వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలకలం: సూట్‌కేసులో మహిళ మృతదేహం లభ్యం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సూట్‌కేసులో వృద్ధ మహిళ మృతదేహం కనిపించడం... జపాన్ రాజధాని టోక్యో రైల్వే స్టేషన్‌లో కలకలం సృష్టించింది. జపాన్ పోలీసు అధికారులు వెల్లడించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.

ఏప్రిల్ 26వ తేదీన ఒక వ్యక్తి తన పసుపు రంగు సూట్‌కేసుని టోక్యో ప్రధాన రైల్వే స్టేషన్‌లో లాకర్‌లో భద్రపరిచారు. ఆ తర్వాత ఆ వ్యక్తి తన సూట్‌కేసు కోసం తిరిగి రాలేదు. ఆదివారం సాయంత్రం ఆ సూట్‌కేసుని రైల్వే స్టేషన్‌లో పని చేసే కార్మికుడు ఉత్కంఠతో తెరిచి చూశాడు.

Woman's body found in suitcase left for month at Tokyo train station

అందులో ఓ వృద్ధ మహిళ మృతదేహం ఉండటం చూసి నిర్ఘాంతపోయాడు. ఆ సూట్ కేసులో ఉన్న మృతదేహం 4 అడుగుల 7 అంగుళాల ఎత్తు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు.. మృతురాలి ఐడెంటిటీ కోసం దర్యాప్తు చేపట్టారు.

రైల్వే స్టేషన్‌లో నెల రోజుల పాటు వదిలి వెళ్లిన సామానుని పరీక్షించే అధికారం స్టేషన్ నిర్వాహకులకు ఉందని, అందులో భాగంగానే సూట్ కేసుని తెరిచి చూశారని పోలీసులు వెల్లడించారు. జపాన్ రాజధానిలో ఉన్న అన్ని ప్రముఖ రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులు తన సమాను నిల్వ చేసుకునేందుకు ప్రత్యేక లాకర్స్‌ సదుపాయం ఉందని తెలిపారు.

English summary
The body of an elderly woman has been found in a suitcase left abandoned for a month in Tokyo’s main train station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X