• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వాట్‌యే కాన్ఫిడెన్స్!: కదులుతున్న రైలులో అందమైన అమ్మాయి ఫొటోషూట్ చేస్తే..(వీడియో)

|
    కదులుతున్న రైలులో అందమైన అమ్మాయి ఫొటోషూట్ చేస్తే (వీడియో)

    వాషింగ్టన్: ఒక అందమైన అమ్మాయి అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ రైలులో ప్రయాణిస్తూ సెల్ఫీలు, ఫొటోషూట్‌లు, వీడియోలు తీసుకుంది. ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆమె అందం, ఆత్మస్థైర్యంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

    అందంగా ఫొటోలకు ఫోజులు..

    అందంగా ఫొటోలకు ఫోజులు..

    జెస్సికా జార్జ్ అనే అమ్మాయి రైలులో ప్రయాణిస్తూ పోల్స్‌ను పట్టుకుని అందంగా ఫొటోలకు ఫోజులిచ్చింది. బెన్ యాహ్ర్ అనే ప్రయాణికుడు ఆమె ఫోన్‌తో ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆ తర్వాత అతడు ఆ ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియా వేదికైన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

    నెటిజన్ల ప్రశంసలు..

    నెటిజన్ల ప్రశంసలు..

    ట్విట్టర్‌లో జెస్సికా జార్జ్ ఫొటోలను వీడియోలను పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే 8.7 మిలియన్లకుపైగా వీక్షణలు రావడం గమనార్హం. వేలాది మంది నెటిజన్లు జెస్సికా అందం, ఆత్మవిశ్వాసాన్ని చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.

    రైలు కదులుతుండగానే..

    రైలు కదులుతుండగానే..

    57 సెకండ్ల నిడివిగల జెస్సికా వీడియోను గత ఆదివారం ట్విట్టర్‌లో పోస్టు చేశాడు బెన్. రైలు కదులుతుండగానే హై హీల్స్ వేసుకుని మరీ జెస్సికా అందంగా ఫోజులు ఇవ్వడం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది.

    ఫిదా అంటూ నెటిజన్లు..

    ఫిదా అంటూ నెటిజన్లు..

    జెస్సికా ముఖంలోని హావభావాలు ఆమెలోని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయని నెటిజన్లు కొనియాడుతున్నారు. పక్కనే ఉన్న ప్రయాణికులను పట్టించుకోకుండా ఆమె చాలా చక్కగా ఫొటోలకు ఫోజులిచ్చారంటూ కితాబిస్తున్నారు. ఇలాంటి సెల్ఫీ కాన్ఫిడెన్స్‌ను తమకు కూడా ఇవ్వాలంటూ పలువురు నెటిజన్లు ఆమెను కోరుతున్నారు.

    ఆనందంలో మునిగిపోయిన జెస్సికా

    జెస్సికా వేసుకున్న డ్రెస్ బాగుందని, ఆమె చేసిన ఫొటోషూట్ ఇంకా బాగుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. నెటిజన్ల నుంచి ఊహించని స్పందన రావడంతో జెస్సికా కూడా ఆనందంలో మునిగిపోయింది. మీ అభిమానానికి ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లకు జవాబిచ్చింది. మీ మద్దతుతో మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకెళతానని తెలిపింది.

    English summary
    What lengths would you go to in order to get that perfect picture? One woman in New York went above and beyond to get it just right. Jessica George was riding the train when fellow passenger Ben Yahr spotted her whipping out her phone, setting it to self-timer and having a glamorous photoshoot right then and there.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X