వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిడుగుపాటు: మహిళ ప్రాణాలు కాపాడిన ‘బ్రా’

|
Google Oneindia TeluguNews

బీజింగ్: పిడుగు మీద పడితే .. ప్రాణాలు కోల్పోవడమో, తీవ్రమైన గాయాలపాలు కావడమో జరుగుతుంది. అయితే, పడిన పిడుగు తీవ్రతను తగ్గించి.. శరీరంలో ప్రధానమైన అవయవాలకు ఎటువంటి నష్టం జరగకుండా చేసింది ఓ మహిళ ధరించిన బ్రా. దీంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.

ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజం. ఈ ఘటన చైనా రాజధాని బీజింగ్‌కు సమీపంలోని ఓ ప్రాంతంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. స్థానిక మహిళ లాయ్, తన కుమారుడిని పాఠశాల నుంచి తీసుకువచ్చేందుకు బయలుదేరింది. వర్షం పడుతుండటంతో గొడుగు పట్టుకుని వెళ్తోంది. ఆమె అక్కడే ఉన్న చెక్క బ్రిడ్జి వద్దకు రాగానే పెద్ద శబ్దంతో పిడుగుపడింది.

Woman saved by her bra after being struck by lightning during a storm

గొడుగుకు మెటల్ ఫ్రేమ్ ఉండటంతో పిడుగు ఆమె ఛాతీలోకి దూసుకుపోయింది. కాకపోతే ఆమె ధరించిన బ్రాలో మెటల్ వైర్ల కారణంగా పిడుగు తీవ్రత తగ్గింది. ఫారడే కేజ్‌లా పనిచేసిన మెటల్ వైర్లే ఆమె శరీరంలో ముఖ్యమైన భాగాలు దెబ్బతినకుండా చూశాయి.

లాయ్ ధరించిన దుస్తులు మాత్రం దహనమైపోయాయి. చర్మం కూడా కాలిపోయింది. సమీపంలో ఆస్పత్రికి లాయ్‌ని తరలించారు. చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. కాగా, ఆమె ధరించిన బ్రా కారణంగా ప్రాణాపాయం నుంచి బయటపడినట్లైంది.

English summary
A Chinese woman has miraculously survived a lightning strike thanks to the wires in her bra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X