వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లవ్ ప్రపోజల్‌కు ఒప్పుకుందని ఎయిర్ హోస్టెస్‌ను ఉద్యోగం నుంచి తొలగించిన యాజమాన్యం

|
Google Oneindia TeluguNews

చైనా : చైనాలో ఒక యువతిని ఒక వ్యక్తి తాను ప్రేమిస్తున్నానంటూ ప్రపోజ్ చేశాడు. వ్యక్తి తన ప్రేమను వ్యక్తపరచడంతో అమ్మాయి కూడా ఓకే చెప్పేసింది. అమ్మాయి ఆ ప్రేమకు ఓకే చెప్పడంతో ఆమె ఉద్యోగం ఊడింది. ఇదేంటి ప్రేమకు ఉద్యోగం ఊడేందుకు లింకు ఏమిటనేగా మీ డౌటు...? అక్కడికే వస్తున్నాం. అబ్బాయి తన ప్రేమను వ్యక్త పరిచింది ఎక్కడో కాదు... విమానంలో. అది కూడా గాల్లో ఎగురుతుండగా... అది కూడా విమానంలో పనిచేస్తున్న మహిళా సిబ్బిందికి. ఇలా ఆ రాకుమారుడు ప్రపోజ్ చేయడం... ఆమె అందుకు ఒప్పుకోవడం... వెంటనే ఆమె ఉద్యోగం కాస్త ఊడిపోవడం అన్ని కొన్ని రోజుల్లోనే జరిగిపోయాయి. ఇంతకీ ఆ అబ్బాయి ప్రపోజ్ చేయడం బయటకు ఎలా పొక్కిందో తెలుసా... ప్రపోజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇక వివరాల్లోకి వెళితే... చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్న ఓ యువతి తాను ప్రేమించిన అబ్బాయితో పెళ్లికి ఒప్పుకోవడంతో ఆమెను ఉద్యోగం నుంచి తీసేసింది ఆ విమానాయాన సంస్థ. విమానం గాల్లో ఉన్న సమయంలో తనను పెళ్లిచేసుకోవాల్సిందిగా ఆ అబ్బాయి.. అమ్మాయిని కోరాడు. అయితే ఆ సమయంలో తన బాధ్యతలు మరిచి ప్రవర్తించిందని పేర్కొంటూ అమ్మాయిని ఉద్యోగం నుంచి తొలగించింది విమానాయాన సంస్థ. ఈ మేరకు ఆ అమ్మాయికి సెప్టెంబర్ 10న లేఖ పంపింది సంస్థ. ఈ ఏడాది మేలో అబ్బాయి ఈ విమానాయాన సంస్థలో పనిచేసే అమ్మాయికి ప్రపోజ్ చేయడం జరిగింది.

Woman staff fired from job for accepting the passengers proposal in mid flight

ఈ ఏడాది మేలో విమానం టేకాఫ్ అయిన అరగంటకు విమానంలో ఆ అబ్బాయి ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడం ఆ తర్వాత యాజమాన్యం అమ్మాయిని తొలగించడం జరిగిపోయింది. ఈ వార్త చైనాలో గుప్పుమనగానే... నెటిజెన్లు అమ్మాయిని ఉద్యోగం నుంచి తొలగించడాన్ని తప్పుబడుతున్నారు. కొందరు వ్యక్తిగత విషయాలను ప్రొఫెషనల్ లైఫ్‌తో కలిపి చూడటం సరికాదన్నారు.

English summary
A mid flight proposal cost an unnamed flight attendant her job after the airlines fired her for neglecting the passengers and called it an irresponsible act. While some are supported the stewardess, others argued that it was incorrect to mix personal with professional life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X