వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: ప్రమాదకర వైరస్‌ నుంచి యువతిని కాపాడిన శునకం.. ఏం చేసిందంటే..

|
Google Oneindia TeluguNews

పెంపుడు జంతువులు చేసిన పని అప్పుడప్పుడు మేలు చేస్తోంది. ఔను ప్రయాణ సమయంలో అడ్డుకోవడం, నిలువరించడంతో వారికి మంచి జరుగుతోంది. కొన్నిసార్లు ప్రమాదం తప్పుతుండగా.. మరికొన్ని సార్లు వైరస్ బారిన కూడా పడే అవకాశం నుంచి తప్పించుకొంటారు. ఔను తైవాన్‌కు చెందిన ఓ మహిళ కరోనా వైరస్ రక్కసి నుంచి బయటపడింది.

పర్యటన రద్దు..

పర్యటన రద్దు..

తైవాన్‌కు చెందిన ఓ యువతి చైనాలోని వుహన్ వచ్చేందుకు సిద్ధమవుతోంది. జనవరి మొదటి వారంలో తన కిమీ అనే కుక్కతోపాటు వచ్చేందుకు రెడీ అయ్యారు. అయితే ఇంతలో కిమీ యువతి పాస్‌పోర్ట్‌ను చింపేసింది. ఇంకేముంది ఆమె వుహన్ పర్యటన అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇది ఒకవిధంగా మేలే చేసింది. పాస్ పోర్ట్ చించడంతో ఇంటి వద్దే ఉండిపోయారు. తొలుత కొంచెం బాధ ఉన్నా.. తర్వాత మాత్రం సర్దుకుపోయింది.

పాస్‌పోర్ట్ చించడంతో

పాస్‌పోర్ట్ చించడంతో


ఇక్కడివరకు ఓకే.. కానీ తర్వాత కరోనా వైరస్ గురించి తెలుసుకుంది. వైరస్ ప్రబలింది వుహన్‌లోనే అని తెలిసి ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. తన కిమీ తనకు ఎంతో మేలు చేసిందని, లేదంటే తామిద్దరం వైరస్ బారినపడే వారిమని గుర్తుచేసింది. ఈ మేరకు డిసెంబర్ 13వ తేదీన పాస్‌పోర్ట్ చించిన ఫోటోతోపాటు.. వైరస్ బారినపడ్డ తర్వాత జరుగుతున్న పరిణామాలను మరో ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హమ్మయ్యా అంటూ యువతి ఊపిరి పీల్చుకున్నారు.

Recommended Video

Coronavirus : Do's And Don'ts For Prevention Of Coronavirus !
మరవను నీ మేలు..

మరవను నీ మేలు..

తన కిమీ తనను ఎళ్లవేళలా రక్షిస్తోంది. మరోసారి రుజువైందని పేర్కొన్నారు. పాస్ పోర్ట్ చింపి తనను వైరస్ బారినపడకుండా కాపాడారాని తెలిపారు. కిమీ చేసిన మేలును మరచిపోలేనని రాసుకొచ్చారు. కరోనా వైరస్‌తో చైనాలో ఇప్పటికే 132 మంది ప్రజలు చనిపోయారు. మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. థాయ్‌లాండ్, జపాన్, సింగపూర్, బ్రిటన్, అమెరికాలో కూడా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

English summary
Kimi, the dog chewed bits of her passport and Taiwan woman couldn’t make the journey to Wuhan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X