వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో చలి ఎలా ఉందంటే.. ఈ వీడియోలు చూస్తే ఒళ్లు జలదరిస్తుంది!

|
Google Oneindia TeluguNews

చికాగో: పోలార్ వోర్టెక్స్ కారణంగా చికాగో సహా అమెరికాలోని పలు రాష్ట్రాలు గడ్డకట్టుకుపోయిన విషయం తెలిసిందే. విపరీతమైన చలి కారణంగా జనాలు బయటకు రావడం లేదు. చలికి ఎవరూ బయటకు రావొద్దని ప్రభుత్వాలు కూడా హెచ్చరికలు జారీ చేశాయి. అయితే, ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన కొన్ని వీడియోలు చూస్తే చలి ఎంత బాగా ఉందో ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది.

పైకి లేచి నిలబడిన యువతి వెంట్రుకలు

చలి ధాటికి ఓ యువతి వెంట్రుకలు అలాగే కదలకుండా పైకి లేచి ఉండిపోయాయి. పొడిగా ఉన్న వెంట్రుకలతో ఆమె ఇంటి బయటి నుంచి లోనికి వస్తోంది. ఆమె వెంట్రుకలు తలపైకి లేచి నిలబడ్డాయి. కనీసం కదలకుండా ఉన్నాయి.

వేడి నీరు ఫ్రీజ్

మరో వీడియోలో ఓ వ్యక్తి ఇంట్లో నుంచి ఓ గిన్నెలో వేడి వేడి నీరు తీసుకు వచ్చి, బయటకు వచ్చాక ఆ గిన్నెలో నుంచి ఆ వేడి నీటిని పైకి విసురుతాడు. అలాంటి వేడి నీరు కూడా ఫ్రీజ్ అయ్యేంత చలి ఉంది.

సబ్బు నురగ కూడా ఫ్రీజ్ అయ్యేంత

చిన్నపిల్లలు సబ్బు నురగలతో ఆడే విషయం తెలిసిందే. ఆ గాలి బుడగలు గాలిలో పగిలిపోతాయి. కానీ ఇక్కడ సబ్బు నురగతో ఓ బుడగను వదిలితే.. అది కూడా గడ్డకట్టి ఆ తర్వాత ఫట్ మని పగులుతుంది.

పట్టాలపై మంటలు

పట్టాలపై మంచు గడ్డకడుతుండటంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీంతో పట్టాలపై మంచు లేకుండా చేసేందుకు అక్కడ నిప్పు పెడుతున్నారు.

English summary
A torrent of polar air brought record-low temperatures to much of the American Midwest on Wednesday. The bitter cold is being caused by a displacement of the polar vortex, a stream of air that normally spins around the stratosphere over the North Pole, but whose current was disrupted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X