వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ డీఎన్ఏ శాంపిల్ ఇస్తే అన్నీ బయటపడుతాయి: లైంగిక దాడి బాధిత మహిళ

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ట్రంప్ గత అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తుండగానే పలు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నారు. తమను ట్రంప్ లైంగికంగా వేధించేవాడని పలువురు మహిళలు బాహాటంగానే చెప్పారు. కొన్ని దశాబ్దాల క్రితం ట్రంప్ తనపై లైంగిక దాడి చేశాడని చెప్పిన ఓ మహిళ ఇప్పుడు ట్రంప్ డీఎన్‌ఏ శాంపిల్‌ కోసం డిమాండ్ చేస్తోంది. ఆ రోజున తను వేసుకున్న బట్టలపై వీర్యం పడిందని చెబుతున్న మహిళ ట్రంప్ డీఎన్‌ఏ శాంపిల్ ఇస్తే కచ్చితంగా సరిపోలుతుందని చెప్పింది.

ట్రంప్ నాపై లైంగిక దాడి చేశారు

ట్రంప్ నాపై లైంగిక దాడి చేశారు

1990లో మాన్‌హట్టన్‌లోని ఓ విలాసవంతమైన స్టోర్‌లో ట్రంప్ తనపై లైంగికదాడి చేశారని జీన్ కరోల్ అనే మహిళ ఆరోపణలు చేస్తూ ఈ మేరకు గతేడాది నవంబర్‌లో కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ట్రంప్ మాత్రం అలాంటి మహిళను తన జీవితంలోనే కలవలేదని ఎప్పుడూ చూడలేదని చెబుతూ తనపై వచ్చిన ఆరోపణలను గతేడాది జూన్‌లో ఖండించారు. ఇదిలా ఉంటే మహిళ జీన్ కరోల్ పిటిషన్ దాఖలు చేయగా ఆమె న్యాయవాదులు ఆ పేపర్లను ట్రంప్ లాయర్లకు అందజేశారు. మార్చి 2న ట్రంప్ డీఎన్‌ఏ శాంపిల్ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.

 సాక్షాలు ఇవిగో అంటున్న బాధిత మహిళ

సాక్షాలు ఇవిగో అంటున్న బాధిత మహిళ

ఇక పేపర్లతో పాటుగా జీన్ కరోల్‌పై అత్యాచారం జరిగిన రోజున వేసుకున్న డ్రెస్‌ పై ఉన్న బయలాజికల్ మెటీరియల్‌ను ఓ ల్యాబ్ సేకరించింది. దానికి సంబంధించిన రిపోర్ట్స్‌ను కూడా జీన్ కరోల్ లాయర్లు జతచేసి అందజేశారు. మహిళపై లైంగిక దాడి జరిగిన రోజున వేసుకున్న డ్రెస్‌ను పరిశీలించారు ల్యాబ్ అధికారులు. వీర్యంకు సంబంధించిన ఆధారాలు దొరకనప్పటికీ ఆమె ధరించిన డ్రెస్‌ స్లీవ్స్‌పై మగవారికి సంబంధించిన జెనెటిక్ మెటీరియల్ కనుగొన్నట్లు ల్యాబ్ అధికారులు తేల్చారు. తనపై లైంగిక దాడి జరిగిందని మహిళ చెప్పగా అందులో వాస్తవం లేదని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే మహిళ న్యూయార్క్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

తప్పు చేయకుంటే డీఎన్ఏ శాంపిల్ ఎందుకివ్వరు..?

తప్పు చేయకుంటే డీఎన్ఏ శాంపిల్ ఎందుకివ్వరు..?

ట్రంప్ తనపై లైంగిక దాడి చేశాకా ఆ బ్లాక్ కలర్ డ్రెస్‌ను హ్యాంగ్ చేశానని ఆ తర్వాత ఒక్కసారి మాత్రమే ధరించినట్లు చెప్పుకొచ్చింది. అది కూడా ఓ ఫోటో షూట్ కోసం మాత్రమే ధరించినట్లు మహిళ గురువారం వెల్లడించింది. ట్రంప్ డీఎన్‌ఏ శాంపిల్ ఇస్తే తను ఎవరో తెలుస్తుందని అన్నీ వాటంతకు అవే గుర్తుకు వస్తాయని కారోల్ చెబుతోంది. ఆ రోజు స్టోర్‌లోని ఓ డ్రెస్సింగ్‌ రూంలో ట్రంప్ తనపై ఎలా లైంగిక దాడి చేసిందన్నది కూడా గుర్తుకు వస్తుందని కరోల్ చెబుతోంది.

English summary
A woman who accused President Donald Trump of sexually assaulting her decades ago is asking him for a DNA sample to compare to male genetic material found on the dress she says she wore during the alleged encounter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X