వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌కు వేలు చూపించి హెచ్చరిక: ఉద్యోగం పోగొట్టుకొన్న మహిళ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వేలు చూపుతూ హెచ్చరించిన జ్యూలీ బ్రిస్క్‌మ్యాన్ అనే మహిళ ఉద్యోగాన్ని కోల్పోయింది. పనిచేస్తున్న కంపెనీ నుంచి ఆమెను తొలగిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వేలు చూపుతూ హెచ్చరించిన జ్యూలీ బ్రిస్క్‌మ్యాన్ అనే మహిళ ఉద్యోగాన్ని కోల్పోయింది. పనిచేస్తున్న కంపెనీ నుంచి ఆమెను తొలగిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

జూలీ బ్రిస్క్‌మ్యాన్‌ అనే 50 ఏళ్ల మహిళ గత నెలలో స్టెర్లింగ్‌లో సైకిల్‌పై వెళ్తొంది. అదే సమయంలో ట్రంప్‌ తన కాన్వాయ్‌లో గోల్ఫ్‌ కోర్సుకు వెళ్తున్నారు. వాహనాలు తనను దాటుతున్న సమయంలో ఆమె తన చేతి మధ్య వేలిని ట్రంప్‌ కాన్వాయ్‌ వైపు చూపించింది. ఆ కాన్వాయ్‌ వెంట వెళ్తున్న ఓ ఫొటోగ్రాఫర్‌ ఆమె ఫొటోను తీసి సోషల్‌మీడియాలో పెట్టగా వైరల్‌గా మారింది.

 Woman Who Flipped Bird To Trump Motorcade FIRED

దాంతో నెటిజన్లు ఆమె ధైర్యసాహసాలను పొగుడుతూ కామెంట్లు కూడా పెట్టారు.అయితే ఈ ఘటనే ఆమె ఉద్యోగానికి ఎసరు తెచ్చింది. బ్రిస్క్‌మ్యాన్‌ వర్జీనియాకు చెందిన అకీమా అనే కాంట్రాక్టర్‌ వద్ద మార్కెటింగ్‌, కమ్యూనికేషన్‌ స్పెషలిస్ట్‌గా గత ఆరు నెలలుగా పనిచేస్తోంది.

ఈ ఘటన గురించి తెలుసుకున్న ఆ సంస్థ యాజమాన్యం ఆమెపై మండిపడింది. సోషల్‌ మీడియా పాలసీని ఉల్లంఘించారని, ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా తమ పేరు దెబ్బతిందని పేర్కొంటూ ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది.

English summary
The woman who posted a photo of herself giving the middle finger to President Donald Trump’s motorcade to social media has been fired from her job, The Huffington Post reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X