వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంకల్పం ముందు అంగవైకల్యం ఓడింది: దివ్యాంగురాలికి విమానం పైలట్ లైసెన్స్

|
Google Oneindia TeluguNews

అమెరికా: ఆమె సంకల్పం ముందు అంగవైకల్యం ఓడిపోయింది. చేతులు కాళ్లు సరిగ్గా ఉన్నా చాలా ఇబ్బంది పడుతున్నాము. కానీ అరిజోనాలోని ఓ మహిళకు చేతులు లేవు. అయినప్పటికీ ఆమె అనుకున్నది సాధించింది. జెస్సికా కాక్స్ అనే 36 ఏళ్ల యువతి పుట్టుకతోనే చేతులు లేకుండా పుట్టింది. అయితే అన్ని అడ్డంకులు ఎదుర్కొని దృఢమైన సంకల్పంతో విజయం సాధించింది. అమెరికాలోని అరిజోనా రాష్ట్రానికి చెందిన జెస్సికా కాక్స్ పైలట్ లైసెన్స్ సాధించిన దివ్యాంగురాలిగా సరికొత్త రికార్డు సృష్టించింది.

Woman who has no arms gets pilot license

పుట్టుకతోనే చేతులు లేకుండా పుట్టిన జెస్సికా... ఎన్నో విద్యల్లో ప్రావీణ్యత సాధించింది. పియానో వాయించడం నుంచి కారు నడపడం వరకు అన్నీ కాళ్లతోనే చేసేది. అంతేకాదు స్క్యూబా డ్రైవింగ్‌లో కూడా సర్టిఫికేట్ సాధించింది.ఇక తైక్వాండోలో థర్డ్ డిగ్రీ బ్లాక్ బెల్ట్ సాధించింది. ఇక ఇతర దివ్యాంగుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తుంది కాక్స్. తన ప్రసంగాలతో దివ్యాంగులకు ఇన్స్‌పిరేషన్‌గా నిలుస్తోంది. దాదాపు 20 దేశాలు తిరిగి దివ్యాంగులతో సమావేశమై ఆమె ప్రసంగాల ద్వారా వారికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

Woman who has no arms gets pilot license

తనకు చేతులు ఉండి ఉంటే బాగుండేదని తానెప్పుడూ బాధపడలేదని జెస్సికా చెప్తారు. తనకు చేతులు ఉన్ని ఉంటే తనలో ఇంత పట్టుదల ఉండేది కాదేమో అని అన్నారు. అంతేకాదు తను ఏమి చేయాలని భావిస్తుందో అదే చేస్తానని ఆమె అన్నారు. తన జీవితంలో చాలామంది స్ఫూర్తిగా నిలిచినట్లు జెస్సికా తెలిపింది. తాను చాలా మంది నుంచి స్ఫూర్తి పొందింనట్లు చెప్పిన జెస్సికా ఇప్పుడు ఆ బాధ్యత తను తీసుకుంటున్నట్లు చెప్పారు. ముందుగా విమానంను నడపాలంటే చాలా భయమేసేదని చెప్పిన జెస్సికా... ఆ తర్వాత ఎలాగైనా సరే లైసెన్స్ సాధించాలనే పట్టుదల తనలో పెరగడంతో అదే దృష్టిలో ఉంచుకుని నేర్చుకున్నట్లు చెప్పారు.

English summary
A woman from Arizona has defied all odds to become the first licensed pilot in the US to fly a plane without arms. The 36-year-old Jessica Cox, who suffered from a rare condition and was born without arms, has learned to fly using her feet. However, flying is just one of her many accomplishments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X