వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ మహిళ కారు డిక్కీ తెరవగానే ఇంజిన్ పక్కన 4 అడుగుల పైథాన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

విస్కోన్సిన్: అమెరికాలోని విస్కోన్సిన్‌లో ఓ మహిళ కారులో పైథాన్ కనిపించింది. కారు ముందు డిక్కీలోని ఇంజిన్ వద్ద అది పడుకొని ఉంది. ఇందుకు సంబంధించి ఓమ్రో పోలీస్ డిపార్టుమెంట్ తన ఫేస్‌బుక్ అధికారిక పేజీలో ఓ పోస్ట్ చేసింది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.

ఓ మహిళకు చెందిన ఎస్‌యూవీ కారు ఎప్పటికి భిన్నంగా ముందుకు సాగుతోంది. దీంతో కారు డ్రైవర్ ఏదైనా సమస్య ఉందేమోనని కారు డిక్కీ తెరిచాడు. అతను డిక్కీ తెరవగానే కారు ఇంజిన్ వద్ద ఓ పెద్ద పాము కనిపించింది..

Woman Whose Car Was Running Strangely Finds Huge Python Under Hood

వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. ఓమ్రో నుంచి పీటర్స్ అనే ఆఫీసర్, విన్నేకాన్ నుంచి సౌరియోల్ అనే అధికారి.. ఇద్దరు వచ్చారు. వారు అందులోని పామును తీసే ప్రయత్నం చేశారు. వారు దానిని పైథాన్‌గా గుర్తించారు. కారు ఇంజిన్ ప్రాంతం నుంచి ఆ పైథాన్ తొలగించడంలో ఇద్దరు అధికారులు విఫలమయ్యారు. దీంతో పాములు పట్టేవారిని రప్పించారు.

ఈ ఫోటోను ఓమ్రో పోలీసులు తమ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. దీనిని 2300 మందికి పైగా షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

కాగా, ఈ పైథాన్ 4 అడుగుల పొడువు ఉంది. దీనిని పాములు పట్టే స్టీవ్ కెల్లర్ అక్కడి నుంచి కాపాడాడు. దీనిని పెట్ స్నేక్‌గా భావిస్తున్నారు. యజమాని నుంచి తప్పించుకొని ఉంటుందని భావిస్తున్నారు. ఓమ్రోలో ఎక్సోటిక్ పెట్స్ పెంపకం చట్టవిరుద్ధం. కాగా ఇలా పాము దొరకడం ఇదే మొదటిసారి కాదు. గతంలోను జరిగింది.

English summary
A woman in Wisconsin, USA, would never have suspected the reason behind her car troubles - a large snake under the hood. According to a Facebook post by the Omro Police Department, officials were called in to assist a motorist on Wednesday at around 6.50 pm. The driver had pulled over because her SUV was "running strangely." When she opened the hood to investigate, she was stunned to find a large snake in the engine compartment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X