వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనుభవంలేకుండా విమానం నడిపిన భార్య, భర్త మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

మాడ్రిడ్: విమానాన్ని నడపడంలో ఏమాత్రం అనుభవం లేని ఓ మహిళ అత్యవసర పరిస్థితుల్లో దానిని నడపాల్సి వచ్చింది. అయితే, చివరికి ఆ విమానం కూలిపోయింది. ఈ సంఘటన స్పెయిన్‌లో రెండు రోజుల క్రితం జరిగింది.

ఓ మహిళ తనకు భర్తతో కలిసి మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్టులో గగన విహారానికి వెళ్లింది. ఆ సమయంలో భర్త అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో ఏం చేయలేని ఆమె ఒక పైలట్ మిత్రుడికి ఫోన్ చేసింది.

 Woman with no pilot experience crash lands plane in Spain

విమానాన్ని ఎలా తీసుకెళ్లాలి, ఎలా దింపాలనే విషయాన్ని అడిగింది. ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ అధికారులు కూడా రంగంలోకి దిగారు. మహిళతో ఫోన్లో మాట్లాడుతూ ఎలా దింపాలో అధికారులు సూచించారు. వారి సూచనలు పాటిస్తూ ఆమె మూడువేల కిలోమీటర్ల పైనుంచి నేలకు దించింది.

అయితే, సెవెల్లీ నగరంలోని విమానాశ్రయం వద్ద నేల మీదకు దిగే సమయంలో దగ్గరలోని బత్తాయి తోటల్లో విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి. ఆమె సెవెల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. భర్త మాత్రం మృతి చెందాడు.

English summary
A Spanish woman who had never flown a plane brought a micro light aircraft in for a crash landing after her pilot husband lost consciousness during the flight, officials said Monday. She was recovering in a hospital in the southern city of Seville.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X