వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళలంతా 'టాప్ లెస్' గా రోడ్ల మీద.. సమానత్వం కోసం

|
Google Oneindia TeluguNews

లాస్ ఏంజిల్స్ : స్త్రీ-పురుష సమానత్వాన్ని ఏ కోణంలో నిర్వచించినా..! పురుషుల కంటే స్త్రీలు కొంత అణిచేయబడుతున్నారనేది వాస్తవం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సమస్యను అధిగమించడానికి ఫెమినిస్టులు, సోషల్ యాక్టివిస్టులు చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. భౌతికత విషయంలో మగవాళ్లకు ఉన్న స్వేచ్చ ఆడవాళ్లకు ఎందుకు ఉండకూడదన్న కోణంలోను చాన్నాళ్లుగానే వాదోపవాదనలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే అమెరికా లాంటి చోట్ల.. మహిళలంతా టాప్ లెస్ ప్రదర్శనలతో తమకూ మగవాళ్లతో సమానంగా అలా తిరిగే హక్కు ఉందని చాటి చెబుతున్నారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో గత వారం ఈ టాప్ లెస్ ప్రదర్శన జరిగింది. దాదాపు 50 మంది మహిళలు 'టాప్ లెస్' ప్రదర్శనలో పాల్గొని తాము పురుషులతో సమానమే అన్న నినాదాలు చేశారు.

Women go TOPLESS on the streets

కాగా టాప్ లెస్ ప్రదర్శన పట్ల భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. కొంతమంది దీనిని సమర్థిస్తుంటే.. మరికొంతమంది మాత్రం విడ్డూరంగా ఉందని నోరెళ్లబెడుతున్నారు. ఇక ఈ టాప్ లెస్ ప్రదర్శనలో కెమెరా మెన్ లు మాత్రం ఫోటోలను క్లిక్ మనిపించడంలో బిజీబిజీగా గడిపారు.

English summary
Women across the US have taken to the streets bare chested on Go Topless Day - to promote gender equality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X