వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా భార్య నా ముఖం చూడట్లేదు, రోజూ చచ్చిపోతున్నా: యోగాగురు బిక్రమ్

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: భారతీయ అమెరికన్ యోగా గురువు బ్రిక్రమ్ చౌదరి(69) మరోసారి తాను ఎవరిపైనా లైంగిక వేధింపులకు పాల్పడలేదని చెప్పారు. తనను చాలా మంది మహిళలు ఇష్టపడతారని, అందువల్ల తాను ఎవరిపైనా బలవంతంగా లైంగిక వేధింపులకు పాల్పడలేనని తెలిపారు.

కొందరు న్యాయవాదుల కారణంగానే పలువురు మహిళలు తనపై లైంగిక వేధింపులు కేసులు పెట్టారని బిక్రమ్ కుమార్ ఆరోపించారు. ‘నేను ప్రపంచానికి నిజం చెప్పాలనుకుంటున్నా. నేను ఎవరినీ లైంగికంగా వేధించలేదు. నాపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం విచారకరం' అని సిఎన్ఎన్‌కు ఇచ్చిన ఓ ఇంటర్య్లూలో పేర్కొన్నారు.

‘మహిళలు, యువతులు నన్ను ఇష్టపడతారు. నన్ను ప్రేమిస్తారు' అని బిక్రమ్ తెలిపారు. ‘అందువల్ల ఒక వేళ నేను మహిళలతో సంబంధం ఏర్పర్చుకోవాలనుంటే.. వారిని లైంగికంగా వేధించాల్సిన అవసరం లేదు' అని చెప్పారు. కొందరు న్యాయవాదుల ప్రభావంతో పలువురు మహిళలు తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తుండటం విచారకరమని తెలిపారు.

‘నేను మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదు. అయితే నాపై ఫిర్యాదు చేసిన వారు చెడ్డవారు అని చెప్పలేను. వారు ఇతరుల ప్రభావంతో నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు' అని బిక్రమ్ చౌదరి తెలిపారు. తనపై ఆరోపణలను అవాస్తవమైనప్పటికీ.. తన కుటుంబానికి జరగాల్సిన పరువు నష్టం జరిగిపోయిందని చెప్పారు.

Bikram Choudhury

అంతేగాక, తన భార్య తన ముఖాన్ని చూసేందుకు కూడా ఇష్టపడటం లేదని ఆవేదనగా తెలిపారు.
‘నా పిల్లలు, నా భార్య, మనమంతా జీవితంలో ఒక్కసారే చనిపోతాం. కానీ నేను మాత్రం ఉదయం లేచిన ప్రతీసారీ చనిపోతున్నా' అని తెలిపారు. ‘నా స్ఫూర్తిని ఎలా పంచుకోగలను. ఎవరూ చేయలేనంతగా 24గంటలపాటు కష్టపడే తనకు ఇచ్చే రివార్డు ఇదేనా?' అని బిక్రమ్ ప్రశ్నించారు. ‘మీ సంస్కృతిని చూస్తే సిగ్గేస్తుంది. పాశ్చాత్య సంస్కృతి సిగ్గుచేటుగా వుంది' అని చెప్పారు.

ఇది ఇలా ఉండగా బిక్రమ్ చౌదరి వద్ద యోగా తరగతులకు వెళ్లిన ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. బిక్రమ్ చౌదరి అబద్ధాలు చెబుతున్నారని తెలిపింది. యోగా తరగతులకు వచ్చే పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చెప్పింది. కాగా, ఇప్పటికే యోగా గురు బిక్రమ్ చౌదరిపై లాస్ ఏంజెల్స్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి.

కాగా, బిక్రమ్ చౌదరికి ముప్పై ఏళ్ల క్రితం పెళ్లైంది. బిక్రమ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ఏ మహిళతోను, ఏ విద్యార్థినితోను సెక్స్ చేయాలనే ఆలోచన లేదని చెప్పారు. కొందరు తాను శృంగారంలో పాల్గొనకుంటే.. ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు.

English summary
Bikram Choudhury, 69, founder of the Bikram Yoga, a form of the exercise practiced in hot rooms, says he never assaulted the women and they are accusing him after being "influenced" by their lawyers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X