• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పామ్‌బీచ్‌లో యువతి తీరుపై అవాక్కైన పోలీసులు

By Nageswara Rao
|

ఫ్లోరిడా: ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని దొంగిలించి పారిపోతున్న ఓ యువతిని వెంబడించిన పోలీసులకు మతిపోయినంత పనైంది. వాహనాన్ని ఆపి డోర్ తీయగా ఆమె శరీర కిందిభాగంలో బట్టలు లేకపోవడంతో పోలీసులు అవాక్కయ్యారు. అమెరికాలోని ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌ కౌంటీలో ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.... ఎప్పటిలాగే విధుల్లో భాగంగా ఆదివారం ఫ్లోరిడాలోని పామ్ బీచ్ గ్రీన్ మార్కెట్ వద్ద తమ ట్రాఫిక్ వాహనాన్ని ఆపి పోలీసులు కిందకు దిగారు. అయితే ఇంజన్ మాత్రం ఆఫ్ చేయలేదు. దీంతో ఆ సమయంలో అటుగా వెళ్తున్న అమరా కోరిన్ మారెరో(24) అనే యువతి తాను వేసుకున్న ప్యాంట్‌ను విప్పేసి ట్రక్‌లో ఎక్కి కూర్చుంది.

women robbed truck in palm beach florida

అంతేకాదు వాహనాన్ని వేగంగా ముందుకు పోనిచ్చింది. అలా కొంతదూరం వెళ్లిన తర్వాత ట్రక్‌ను చూసిన పోలీసులు వెంటనే ఆ వాహనాన్ని అనుసరించారు. కొంతదూరం తర్వాత వాహనాన్ని అడ్డుకుని అందులో ఉన్న యువతిని కిందకు దించేందుకు డోర్ తెరిచారు.

ఇంకేముంది ఆ యువతి తీరుని చూసి అవాక్కయ్యారు. ఆమె నడుము కింది భాగంలో ఎలాంటి దుస్తులు లేకుండా నగ్నంగా ఉంది. అంతేకాదు ఆమెతో మాట్లాడిన పోలీసు అధికారులు ఆమె మద్యం సేవించి, పూర్తిగా మత్తులో ఉందన్న విషయాన్ని తెలుసుకున్నారు.

ఆమె వద్ద డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకపోవడంతో ట్రక్‌ దొంగతనం కేసులో మెరిరోను అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం 15 వేల డాలర్ల పూచికత్తుపై కోర్టు ఆమెకు బెయిలు మంజూరు చేసింది.

English summary
women robbed truck in palm beach florida.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X