వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భయపడేది లేదు: ట్రంప్ వ్యతిరేకంగా మడోన్నా, రోడ్డెక్కిన మహిళలు

కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వ్యతిరేకంగా ఆమెరికాలో ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వ్యతిరేకంగా ఆమెరికాలో ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. వాషింగ్టన్‌తో పాటు పలు నగరాల్లో, అలాగే లండన్, మెక్సికోలలోని అమెరికా దౌత్య కార్యాలయాల వద్ద వేలాది మంది ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. పలుచోట్ల దిష్టిబొమ్మలు, జెండాలు దహనం చేశారు.

ట్రంప్‌కు వ్యతిరేకంగా ట్వీట్, దుమారం: షాకిచ్చారుట్రంప్‌కు వ్యతిరేకంగా ట్వీట్, దుమారం: షాకిచ్చారు

వాషింగ్టన్‌లో భారీ ప్రదర్శనకు ఉదయమే వేల సంఖ్యలో మహిళలు తరలివెళ్తూ కనిపించారు. మహిళలు, ముస్లింలు, మెక్సికోవాసులను కించపరుస్తూ.. ట్రంప్‌ చేసిన వ్యాఖ్యాలకు వ్యతిరేకంగా ఈ ప్రదర్శన చేపడుతున్నట్లు వారు తెలిపారు.

 Women's marches: More than one million protesters vow to resist President Trump

వచ్చే నాలుగేళ్లు ప్రశాంతంగా ఊరుకోబోమని దీంతో స్పష్టమవుతున్నట్లు వ్యాఖ్యానించారు. మహిళలు వెనక్కి తగ్గాలని అనుకోవట్లేదు, తమకు భయం తక్కువ.. ప్రేమ ఎక్కువ లాంటి సందేశాలు రాసిన ప్లకార్డులు చేతపట్టుకొని నిరసన తెలిపారు.

ఒకే దేశం-ఒకే హృదయం, అమెరికన్లకే ప్రాధాన్యం: ట్రంప్ ప్రమాణం, 9 లక్షలమంది హాజరుఒకే దేశం-ఒకే హృదయం, అమెరికన్లకే ప్రాధాన్యం: ట్రంప్ ప్రమాణం, 9 లక్షలమంది హాజరు

లక్షలాది మంది మహిళలు ఆందోళనకు దిగారు. మిగతా నగరాల్లోనూ ఈ భారీ ప్రదర్శనకు మద్దతుగా 600 వరకూ చిన్నపాటి ప్రదర్శనలకు మహిళలు తరలి వస్తూ కనిపించారు. ట్రంప్‌ ప్రమాణ స్వీకారంనాటి కంటే శనివారమే మెట్రో మార్గాలు చాలా రద్దీగా కనిపించాయని అధికారులు అంటున్నారు.

పలుచోట్ల హింసాత్మకంగా

మరోవైపు, వాషింగ్టన్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. పలుచోట్ల ఆందోళనకారులు పోలీసులపై రాళ్లురువ్వారు. వాహనాలకు నిప్పుపెట్టారు. ఆరు దుకాణాలనూ ధ్వంసం చేశారు. ఈ ఆందోళనల్లో ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. దీంతో 217 మందిని అదుపులోకి తీసుకున్నారు. రద్దీఎక్కువగా ఉండే వాషింగ్టన్‌ వీధుల్లో ఇవి చోటుచేసుకున్నాయి.

ట్రంప్ వ్యతిరేక ర్యాలీలో మడోన్నా

ట్రంప్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అమెరికా మహిళలతో పాప్‌స్టార్‌ మడోన్నా కూడా జత కలిశారు. శనివారం నిర్వహించిన భారీ ర్యాలీలో మడోన్నా పాల్గొన్నారు. అనుకోని అతిథిలాగా ఆమె ఈ ఉద్యమంలో ప్రత్యక్షమయ్యారు.

నల్లటి పిల్లిచెవుల టోపీ, కోటు ధరించిన మడోన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేదికపైకి ఎక్కి వెల్‌కమ్‌ టు ది రివల్యూషన్‌ ఆఫ్‌ లవ్‌.. అన్నారు. తాము భయపడమని, తాము ఒంటరి వాళ్లం కాదని, తాము వెనక్కి తగ్గమని, మన ఐకమత్యం ముందు ఏ శక్తి నిలువదని అన్నారు.

English summary
More than 1 million people gathered in Washington and in cities around the country and the world Saturday to mount a roaring rejoinder to the inauguration of President Trump.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X