వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యవ్వనం రాకున్నా యువతులతో సెక్స్, బానిసలు: ఐఎస్ సందేశాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: సిరియాలో పలువురు మహిళలను ఇసిస్ (ఐఎస్ఐఎస్) సెక్స్ బానిసలుగా చూస్తోందని, తమను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తోందని యూఎన్‌కు చెందిన వాలరీ అమోస్ తెలిపింది. తమ మతానికి చెందని మహిళలు బానిసలను, వారిని కొనొచ్చు లేదా అమ్మొచ్చు లేదా కానుకగా ఇవ్వొచ్చని, శారీరక సంబంధాన్ని తట్టుకునే అమ్మాయి అయితే సెక్స్ జరపొచ్చునని ఇస్లామిక్ స్టేట్ మార్గదర్శకాలు జారీ చేసిందట.

ముస్లీం మహిళల్ని మాత్రం అలా చేయడానికి వీల్లేదని, వారు మన మతాన్ని నమ్మకున్నా.. అలా చేయవద్దని పేర్కొందని బ్రిటన్ ఉగ్రవాద విశ్లేషకులు చెబుతున్నారు. కలీఫత్‌ను ఏర్పరచాలని, ప్రపంచంలో ఇస్లాం సామ్రాజ్యాన్ని స్థాపించాలన్న లక్ష్యంతో ఇసిస్‌గా ఏర్పడి ఐఎస్‌గా పేరు మార్చుకున్న సంస్థ ఇందుకు మన ఆర్‌ అండ్‌ డీ లాగా, రిసెర్చ్‌ అండ్‌ ఫత్వా డిపార్ట్‌మెంట్‌ను ఏర్పరుచుకుందని తెలిపింది.

Women sold as sex slaves in IS markets, says officials

వాషింగ్టన్‌కు చెందిన మధ్యప్రాచ్య పరిశోధక సంస్థకు కూడా ఐఎస్‌కు చెందిన సంబంధిత డాక్యుమెంట్లు లభించాయని, ఐఎస్‌ ఆధిపత్యం ఉన్న ఇరాక్‌, సిరియా దేశాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో అరాచక రాజ్యమే నడుస్తోందని బ్రిటన్‌, అమెరికాలకు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఐఎస్‌ విడుదల చేసిన మార్గదర్శకాల పుటలు కూడా వారి దగ్గర ఉన్నాయి.

వాటిలో తమ తరపున యుద్ధం చేస్తున్న వారి దగ్గర నుంచి తరచు వచ్చిన సందేహాలకు, ఐఎస్‌కు చెందిన రిసెర్చ్‌ అండ్‌ ఫత్వా డిపార్ట్‌మెంట్‌ మార్గదర్శకాలు జారీ చేసింది. ఐఎస్‌ సైనికుల దాడిలో వారికి దొరికిన ముస్లిమేతర మహిళలను ఎలా వాడుకోవచ్చో, అతి వికారంగా వివరించారని, ఈ వివరణలు మన సమాజాన్ని చీకటి యుగాలకు తీసుకువెళతాయని, విశ్లేషకులు చెబుతున్నారు.

ఆ డాక్యుమెంట్లో ఒక ప్రశ్న మహిళా బానిసల్లో యవ్వనం రాకున్నా సెక్స్‌ చేయొచ్చా? అని ఉందట. అందుకు సమాధానంగా ఆ అమ్మాయి శరీరం అందుకు తట్టుకునేలా ఉంటే చేయొచ్చని సమాధానం ఇచ్చారట. యూదులు, క్రిస్టియన్లతో సహా ముస్లిమేతర మహిళలు ఎవరినైనా ఇలాగే చేయొచ్చని డాక్యుమెంట్లో స్పష్టం చేశారట.

English summary
Women sold as sex slaves in IS markets, says officials
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X