వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందరికీ వ్యాక్సిన్: 2024 తర్వాతే - సీరం సీఈవో అధర్ అనూహ్య వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా కరోనా కాటుకు గురైనవారి సంఖ్య 3కోట్లకు, చనిపోయినవారి సంఖ్య 9.3లక్షలకు పెరిగింది. భారత్ సహా వివిధ దేశాల్లో ఇప్పటికీ భారీగా కొత్త కేసులు నమోదవుతుండటం వైరస్ వ్యాప్తిని తెలియజేస్తున్నది. ఓ పక్క విరుగుడు వైరస్ కోసం పలు దేశాలు, ప్రఖ్యాత కంపెనీలన్నీ ప్రయోగాలను ముమ్మరం చేశాయి. అయితే, ఎంత వేగంగా ప్రయత్నించినా ప్రపంచ జనాభా మొత్తానికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే కచ్చితంగా ఇంకా నాలుగు నుంచి ఐదేళ్లు పడుతుందని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈవో అదర్ పూనావాలా అన్నారు.

'స్పుత్నిక్-వి’ వ్యాక్సిన్‌తో సైడ్‌ఎఫెక్ట్స్ - మంచం పట్టిన 14 శాతం వాలంటీర్లు - రష్యా మంత్రి వెల్లడి'స్పుత్నిక్-వి’ వ్యాక్సిన్‌తో సైడ్‌ఎఫెక్ట్స్ - మంచం పట్టిన 14 శాతం వాలంటీర్లు - రష్యా మంత్రి వెల్లడి

ప్రపంచ జనాభాలో(700 కోట్ల)లో ఒక్కో వ్యక్తికి రెండు కొవిడ్ వ్యాక్సిన్ డోసులు ఇచ్చినా.. మొత్తం 1500 కోట్ల డోసులు ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంటుందని, ఆ స్థాయిలో ఉత్పత్తికి దేశాలు, సంస్థలు సమాయత్తం కావాలంటే కనీసం 4 నుంచి 5 ఏళ్లు పడుతుందని, ఆ లెక్క ప్రకారం 2024 దాకా తగినన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదని పూనావాలా వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది ప్రారంభంలోగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ప్రకటన నేపథ్యంపై స్పందిస్తూ సీరం సీఈవో ఈ కామెంట్లు చేశారు.

కరోనాపై చైనా మరో సంచలన ప్రకటన-గత ఏప్రిల్‌లోనే వ్యాక్సిన్ రెడీ-అందరికీ వద్దు -సైడ్ ఎఫెక్ట్స్: సీడీసీకరోనాపై చైనా మరో సంచలన ప్రకటన-గత ఏప్రిల్‌లోనే వ్యాక్సిన్ రెడీ-అందరికీ వద్దు -సైడ్ ఎఫెక్ట్స్: సీడీసీ

Won’t be enough Covid-19 vaccines till 2024: Serum Institute CEO Adar Poonawalla

కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉన్న ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికాకు భారత్ లో భాగస్వామిగా సీరం ఇనిస్టిట్యూట్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రాజెనికా, నోవావ్యాక్స్ సహా మొత్ం ఐదు ఫార్మా సంస్థలతో సీరం ఒప్పందాలు చేసుకుంది. తాజాగా స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ తీసుకొచ్చిన రష్యా సంస్థ గమలేరియా ఇనిస్టిట్యూట్ తోనూ సీరం ఒప్పందాలు చేసుకోనుంది. మొత్తంగా తాము తయారుచేసే 100 కోట్ల డోసుల్లో సగం భారత్ కు కేటాయిస్తామని సీరం మొదటి నుంచీ చెబుతోంది.

Recommended Video

#SURIYAagainstNEET:న్యాయూమూర్తులపై హీరో సూర్య కామెంట్స్.. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ!

English summary
Adar Poonawalla, the chief executive of Serum Institute of India (SII), has warned there won’t be enough vaccines against the coronavirus disease (Covid-19) for everyone in the world till the end of 2024. The CEO of the world’s largest vaccine manufacturer has estimated that the world will need around 15 billion doses of the Covid-19 shot if it is a two-dose vaccine. “It’s going to take four to five years until everyone gets the vaccine on this planet,” Poonawalla told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X