వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భయపడను, నిశ్శబ్దంగా ఉండను: రైతు నిరసనలపై మరోసారి మీనా హారీస్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ మేనకోడలు, లాయర్ మీనా హారీస్ భారత రైతుల ఆందోళనలకు మరోసారి తన మద్దతును తెలియజేశారు. 'నేను భారతీయ రైతుల కోసం మానవ హక్కులకు మద్దతుగా మాట్లాడాను.. దాని ప్రతిస్పందనను చూడండి' అంటూ మీనా హారిస్ గురువారం ట్వీట్ చేస్తూ రాయిటర్స్ జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీ ఫోటోను పంచుకున్నారు.

నేను బెదిరింపులకు భయడపడను. నేను నిశ్శబ్దంగా ఉండను. అని మీనా హారీస్ ట్వీట్ చేయడంతోపాటు దాన్ని పిన్ చేశారు.

 Wont Be Silenced: Meena Harris On Protest Over Her Tweets

36 ఏళ్ల ఈ రచయిత.. రైతు నిరసనలపై అంతర్జాతీయ మీడియా నివేదిక వచ్చినప్పటి నుంచి క్రమం తప్పకుండా ట్వీట్ చేస్తున్నారు. ప్రభుత్వ అణిచివేత పాప్ స్టార్ రిహన్నా, వాతావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్, పోర్న్ స్టార్ మియా ఖలిఫా తోపాటు చాలామంది నుంచి మంగళవారం పోస్ట్‌లకు దారితీసింది.

'మనం దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదు?' అని ట్విట్టర్‌లో 100 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న రిహన్నా రైతుల నిరసనలపై చేసిన ఈ పోస్ట్.. ఢిల్లీ వెలుపల హైవేలపై రెండు నెలల తరబడి ఆందోళనను ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లింది.

రైతుల నిరసనకు పర్యావరణవేత్త గ్రేటా థన్‌బర్గ్ కూడా మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. 'నేను ఇప్పుడు కూడా రైతుల ఆందోళనకు నా మద్దతు తెలియజేస్తున్నా. రైతుల శాంతియుత నిరసనలకు నా మద్దతు ఉంటుంది. ద్వేషం, బెదిరింపులే లేదా హింస, మానవ హక్కుల ఉల్లంఘనలకు తావులేదు' అంటూ ట్విట్టర్ వేదిక ఈ స్వీడిష్ పర్యావరణ కార్యకర్త తాజాగా పేర్కొన్నారు.

ఇండియాలో జరుగుతున్న రైతుల ఆందోళనలకు మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేసిన నేపథ్యంలో గ్రేటా థన్‌బర్గ్‌పై గురువారం ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన కాపేపటికే ఆమె ఈ ట్వీట్ చేయడం గమనార్హం. పాప్ స్టార్ రిహాన్నా కూడా రైతుల ఆందోళనలకు మద్దతుగా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆమె తర్వాత గ్రేటా థన్‌బర్గ్ స్పందించారు. ఇండియాలో జరుగుతున్న రైతుల ఆందోళనలకు తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు గ్రేటా థన్ బర్గ్ ట్విట్టర్ వేదికగా మంగళవారం రాత్రి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

English summary
American lawyer Meena Harris, the niece of Vice-President Kamala Harris, has shared a photo of a protest against her over her posts in support of the farmers' agitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X