వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

16వ అంతస్తులో ఒళ్లుజలధరించే స్టంట్: యువతి పోల్ డ్యాన్స్, ఎలా.. ఎక్కడ చేశారంటే?

|
Google Oneindia TeluguNews

మాస్కో: రష్యాలో ఓ యువతి ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసింది. 16 అంతస్తుల భవనం పైన పోల్ డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోల్ డ్యాన్స్ ప్రదర్శన మాస్కోలో చేసింది. దీనిని డ్రోన్ ద్వారా, గోప్రో కెమెరాల ద్వారా చిత్రీకరించారు.

ఒళ్లు జలదరించేలా పోల్ డ్యాన్స్

27 ఏళ్ల పోల్ డ్యాన్సర్ మరినా కోర్జెనెవ్‌స్కాయా అనే యువతి రష్యాలోని వోరోనెజ్‌లోని 16 అంతస్తుల బిల్డింగ్ పైకి ఎక్కింది. అక్కడ పోల్ డ్యాన్స్ చేసింది. ఒళ్లు జలదరించే ఈ ప్రదర్శనను గత ఏడాది ఆగస్ట్ నెలలో చేసింది. కానీ ఈ వీడియోను ఇప్పుడు విడుదల చేశారు.

 గతంలోను స్టంట్స్

గతంలోను స్టంట్స్

ఈమె గతంలోనూ భయానక స్టంట్స్ చేసింది. గత ఏడాది ఏప్రిల్ నెలలో మంచుతో స్టంట్స్ చేసింది. అలాగే మాస్కోలోని జర్యాడ్యే పార్క్‌లో గత ఏడాది అక్టోబర్‌లో బ్రిడ్జి పైన స్టంట్స్ నిర్వహించింది. ఇప్పుడు పోల్ డ్యాన్స్ చేసింది.

ఐరన్ రాడ్డుతో రక్షణ వలయం

ఐరన్ రాడ్డుతో రక్షణ వలయం

ఈమె 16వ అంతస్తు పైన పోల్ డ్యాన్స్ చేసినప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. 16వ అంతస్తు పైన ఆమె పోల్ డ్యాన్స్ చేసే ప్రాంతానికి కింది భాగన ఐరన్ రాడ్డులతో రక్షణ వలయం ఏర్పాటు చేశారు. ఆమె సునాయాసంగా పోల్ డ్యాన్స్ చేసింది. కానీ అనుకోని ప్రమాదం జరిగితే పడిపోకుండా ఉండేందుకు దీనిని ఏర్పాటు చేశారు. కానీ అత్యంత ఎత్తు నుంచి పోల్ డ్యాన్స్ చేయడం సాధారణ విషయం కాదు. అక్కడి నుంచి కిందకు చూస్తేనే కళ్లు తిరుగుతాయి.

English summary
A fearless pole dancer who seems to be very confident in her ability showed off her impressive skills on the top of a 16-storey building in Moscow as her stomach-churning stunt was being filmed by a drone and GoPro cameras.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X