వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా కోరల్లో ప్రపంచం విలవిల .. 2 కోట్ల 23లక్షలకు పైగా కేసులు ..టాప్ 3 దేశాలివే !!

|
Google Oneindia TeluguNews

ప్రపంచం కరోనా కారణంగా డేంజర్ జోన్ లోకి వెళుతుంది. కరోనాకేసులు రోజురోజుకు పెరుగుతున్న తీరు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఆరోగ్య సంక్షోభంతో పాటు ఇప్పుడు కరోనా దెబ్బకు ఆర్ధిక సంక్షోభం నెలకొంది. కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది.

కరోనా వ్యాప్తికి కారణం వీళ్ళే .. ఆసక్తికర విషయం చెప్పిన డబ్ల్యూహెచ్ఓకరోనా వ్యాప్తికి కారణం వీళ్ళే .. ఆసక్తికర విషయం చెప్పిన డబ్ల్యూహెచ్ఓ

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ


వీరు వారు అన్న తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రముఖుల నుండి, సామాన్య ప్రజల వరకు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా కేసుల వివరాలను చూస్తే వరల్డ్ మీటర్స్ సమాచారం ప్రకారం ఇప్పటివరకూ మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2,23,09,795 .అలాగే ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసులు 64,71,934 . వరల్డ్ వైడ్ గా 7,84,380 మంది కరోనా మహమ్మారి కి బలైపోయారు.1,58,37,861 మంది కోలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు .

కరోనా కారణంగా దెబ్బ తిన్న టాప్ 1 కంట్రీ అమెరికా

కరోనా కారణంగా దెబ్బ తిన్న టాప్ 1 కంట్రీ అమెరికా

కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి , కరోనా నివారణ కోసం ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు ,శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించి, కరోనా వ్యాప్తి చెందకుండా ఉండటం కోసం నిబంధనలు పెట్టినా లాభం లేకుండా పోతోంది. కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న తీరు ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తుంది. కరోనా వైరస్ కారణంగా అత్యంత దెబ్బతిన్న దేశంగా అగ్రదేశం అమెరికా ఉంది. అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న మొత్తం కరోనా కేసుల సంఖ్య 56,55,974 .

56 లక్షలకు పైగా కేసులతో అమెరికా ...రెండో స్థానంలో బ్రెజిల్

56 లక్షలకు పైగా కేసులతో అమెరికా ...రెండో స్థానంలో బ్రెజిల్

56 లక్షలకు పైగా కేసులతో అమెరికా ప్రస్తుతం అతలాకుతలమవుతోంది. ఇప్పటివరకు 1,75 ,074 మంది మృతి చెందగా 24,69,802 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 30,11,098 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

అమెరికా తర్వాత బ్రెజిల్ లో కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి . ఇప్పటి వరకు మొత్తం 34,11,872 కేసులు నమోదయ్యాయి. 1,10,019 మంది మృతి చెందగా ఇప్పటివరకు 25 ,54,179 మంది కరోనా నుండి కోలుకున్నారు. 7,47, 674 మంది ప్రస్తుతం యాక్టివ్ కేసులుగా ఉన్నారు.

 థర్డ్ ప్లేస్ లో ఇండియా .. 27 లక్షలకు పైగా కేసులు

థర్డ్ ప్లేస్ లో ఇండియా .. 27 లక్షలకు పైగా కేసులు


ఆ తర్వాత మూడో స్థానంలో ఇండియా ఉంది. మూడో స్థానంలో కొనసాగుతున్న ఇండియాలో ఇప్పటి వరకు మొత్తం 27,68, 670 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ గా 6,77,059 కేసులు ఉండగా కరోనా తో ఇప్పటి వరకు 53 ,026 మంది మృతి చెందారు . కరోనా నుండి కోలుకున్న వారు 20,38 ,585 మంది. అంతేకాదు రష్యా, జర్మనీ, స్పెయిన్, లండన్ ,జపాన్, ఇంగ్లాండ్ ,ఇటలీ,పాకిస్తాన్ లలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి.

అమెరికా, దక్షిణాసియా, ప్రాచ్య దేశాల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.

 అధికారిక లెక్కలే ఇలా .. అనధికారికంగా లక్షలాది కరోనా బాధితులు

అధికారిక లెక్కలే ఇలా .. అనధికారికంగా లక్షలాది కరోనా బాధితులు

ఏ దేశంలోనూ కరోనా కంట్రోల్ లేని పరిస్థితి కనిపిస్తుంది. అధికారికంగా ప్రకటించిన జాబితానే ఇలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా అనధికారికంగా మరెంత మంది కరోనా బాధితులు ఉన్నారో అన్నది ఆందోళన కలిగించే అంశం . ఏది ఏమైనప్పటికీ వ్యక్తిగతమైన భద్రత, ఆరోగ్య రక్షణను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ మెలగాల్సిన అవసరం ఉందని తాజా పరిస్థితులు ప్రపంచ ప్రజలకు చెబుతున్నాయి. అర్ధం కాని రీతిలో కరోనా వ్యాప్తి చెందుతున్న తీరు ఆందోళన కలిగిస్తున్నా మరణాల రేటు తగ్గుతున్న పరిస్థితి కాస్తంత ఊరట కలిగించే అంశం .

English summary
Worldwide, the number of corona cases worldwide was 2,23,09,795 , while the number of deaths due to corona to date was 7,84,380 . In terms of corona active cases 64,71,934 were reported. It is alarming that 2 crore 23lakhs above cases are registered worldwide till now. A large number of cases are reported in the US, South Asia and the East.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X