• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

World Blood Donor Day 2021: ఈరోజు చరిత్ర ఏంటి, నినాదం ఏంటి..?

|

ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎక్కువగా చర్చించుకుంటున్న అంశం కరోనా వైరస్. ఒకానొక సమయంలో కరోనాకు చికిత్స ప్లాస్మా థెరపీ అని కూడా చాలామంది చెప్పుకొచ్చారు. ఇక ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు రక్తం పోతే ప్రాణాలను కాపాడేందుకు రక్తం ఎక్కించాలని వైద్యులు చెప్పడం వినేఉంటాం. ప్రాణం నిలవాలంటే శరీరంలో రక్తం కీలక పాత్ర పోషిస్తుంది. ఎమర్జెన్సీ సమయాల్లో రక్తం అనేది క్రిటికల్ రిక్వైర్‌మెంట్. రక్తంకు అంతటి విలువ ఉంది కాబట్టే ఏటా జూన్ 14వ తేదీన ప్రపంచ రక్త దాన దినోత్సవంను జరుపుకుంటున్నాం. ఈ రోజున రక్తం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం.

ఈ కోవిడ్ సమయంలో ఆ మహమ్మారి బారిన పడ్డ చాలామంది ఆరోగ్యం మెరుగుపరచడంలో రక్తం చాలా అవసరమైంది. ఈ కష్టసమయంలో కూడా ఆయా దేశాల్లో చాలామంది రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు. తద్వారా పేషెంట్లకు ప్లాస్మా అవసరాన్ని తీర్చగలిగారు. ఇలా రక్తదానం చేసిన వాళ్లు కరోనా పేషెంట్ల పట్ల దేవుళ్లుగా మారారు. ఇక రక్తదాన దినోత్సవం దాని చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

World Blood Donor Day 14 June 2021 Theme, History, Poster And Quotes In Telugu

అసలు వరల్డ్ బ్లడ్ డోనార్ డేను జూన్ 14వ తేదీనే ఎందుకు జరుపుకుంటామంటే ఆరోజున కార్ల్ లాండ్‌స్టీనర్ జన్మించారు. ఈయన జన్మదినంను ప్రపంచ రక్తదాన దినోత్సవంగా జరపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావించింది. ఇంతకీ కార్ల్ లాండ్‌స్టీనర్ ఎవరనేగా మీ డౌటు.. ప్రస్తుతం మన రక్తం ఫలానా గ్రూప్ అంటే ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఓ పాజిటివ్ అని ఎలా అయితే గుర్తిస్తున్నామో వీటిని గ్రూపులుగా విభజించింది కార్ల్ లాండ్‌స్టీనర్. 1900వ సంవత్సరంలో కార్ల్ లాండ్‌స్టీనర్ రక్తంకు వివిధ గ్రూపులను ఇచ్చారు. తద్వారా ఏ మనిషికి ఏ గ్రూపు రక్తం కావాలో దానికి అనుగుణంగా ఆ గ్రూప్ రక్తం ఇవ్వడం జరుగుతుంది. 1930లో లాండ్ స్టీనర్ పరిశోధనకు గాను నోబెల్ పురస్కారం వరించింది.

ఇక జూన్ 14వ తేదీన అంతర్జాతీయ రెడ్ క్రాస్ మరియు రెడ్ క్రెసెంట్ సొసైటీలు రక్తం ప్రాముఖ్యత గురించి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయి. మే 2005లో ప్రపంచ ఆరోగ్య సంస్థ192 సభ్య దేశాలతో రక్తదాన దినోత్సవంను 58వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో ఏర్పాటు చేసింది. రక్తదానం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించాలంటూ ఈ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆ రకంగా రక్తం అవసరంలో ఉన్న వారికి దానం చేసిన రక్తం అందజేసి ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చింది.

ఈ ఏడాది ప్రపంచ రక్తదాన దినోత్సవం 2021 స్లోగన్

"రక్తదానం చేయండి..ప్రపంచం పరిగెత్తేలా చూడండి" అనేది 2021వ సంవత్సరపు నినాదం. ఇక ఇంగ్లీషులో "Give blood and keep the world-beating"అని ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని తద్వారా ప్రాణాలను కాపాడాలని ఈ నినాదం ఉద్దేశం. ఇక ఈ ఏడాది ప్రపంచ రక్తదాన దినోత్సవం ముఖ్య ఉద్దేశాలు ఇలా ఉన్నాయి.

* రక్తదానం చేసిన వారికి కృతజ్ఞతలు తెలపడం. అదే సమయంలో ప్రజల్లో రక్తదానంపై అవగాహన తీసుకొస్తూ ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఉచితంగా రక్తదానం చేయడాన్ని ప్రోత్సహించడం

* రక్తదానం చేయడం వల్ల వచ్చే లాభాలు సామాజిక సంఘీభావంవంటి అంశాలను ప్రమోట్ చేయడం

* రక్తదానం చేయాల్సిందిగా యువతను ప్రోత్సహించడం అదే సమయంలో ఇతరులను కూడా వీరు ప్రోత్సహించడం

* మంచి ఆరోగ్యంను ప్రమోట్ చేయడంలో యువత ముఖ్య పాత్ర పోషించడం

ఇక ఈ ఏడాది ప్రపంచ రక్తదాన దినోత్సవం వేడుకలకు వేదికగా నిలుస్తోంది రోమ్. ఈ ఏడాది ఇటలీ నగరం హోస్ట్‌గా వ్యవహరిస్తోంది

వరల్డ్ బ్లడ్ డోనార్ డే 2021 కొటేషన్స్

* రక్తదానం చేయడం నీకు కొన్ని క్షణాలు మాత్రమే.. కానీ ఒకరికి అది జీవితం ఇస్తుంది

* నేడు నువ్వు చేసే రక్తదానమే మరొకరి జీవితంలో ఆనందాన్ని నింపుతుంది

* రక్తదానం చేయడం వల్ల ఎలాంటి ఖర్చు లేదు.. కానీ ఒకరి జీవితంను రక్షిస్తుంది

* నువ్విచ్చే రక్తం చాలా విలువైనది: దానం చేసి ఒక జీవితాన్ని కాపాడు. అది ఒక పవిత్ర కార్యం అవుతుంది

* ఎప్పుడూ బలహీనుడవని భావించకు ఒకరి ప్రాణాలను కాపాడగలవని తెలుసుకో..రక్తదానం చేయి

* ఒక మంచి కారణంతో రక్తదానం చేయి. ఆ కారణం ఒకరి ప్రాణాలు కాపాడటం అయి ఉండాలి

* రక్త దానం చేసేందుకు అదనపు బలం కానీ, అదనపు ఆహారంగానీ అక్కర్లేదు. ఇలా ఇస్తున్నావంటే ఒకరి జీవితాన్ని కాపాడుతున్నట్లే*దోమలు, ఇతర పనికిరాని వాళ్లు నీ రక్తం పీల్చేందుకు అవకాశం ఇవ్వకు.. మంచి కార్యంకు వినియోగించు

* నువ్వు దానం చేసే రక్తమే జీవన్మరణ సమస్యకు పరిష్కారం చూపుతుంది

ఇది ప్రపంచ రక్త దినోత్సవం యొక్క ప్రాముఖ్యత, చరిత్ర మరియు ఈ ఏడాది స్లోగన్ మరియు కొటేషన్లు. మనం కూడా రక్తదానం చేద్దాం ఒకరి ప్రాణం కాపాడుదాం.

English summary
World Blood donar day is celebrated every year on June 14th
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X