వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోబెల్‌ శాంతి బహుమతి 2020 - కరోనాలో జనం ఆకలి తీర్చిన ప్రపంచ ఆహార కార్యక్రమానికే పట్టం

|
Google Oneindia TeluguNews

ఏటా ప్రపంచంలో శాంతి నెలకొల్పేందుకు వ్యక్తులు, సంస్ధలు చేసిన కృషికి ప్రతిఫలంగా ప్రకటించే నోబెల్‌ శాంతి పురస్కారానికి ఈ ఏడాది ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమం డబ్ల్యూఎఫ్‌పీ ఎంపికైంది. నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీ ఇవాళ శాంతి పురస్కారం విజేతను ప్రకటించింది. కరోనా సమయంలో వివిధ దేశాల్లో అన్నార్తుల ఆకలి తీర్చినందుకు వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ను ఈ విశిష్ట పురస్కారానికి ఎంపిక చేసినట్లు నోబెల్‌ కమిటీ పేర్కొంది.

ఈ ఏడాది నోబెల్‌ శాంతి పురస్కారం కోసం ఏకంగా 318 మంది పోటీ పడ్డారు. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పాటు పలువురు ప్రముఖులు, పలు అంతర్జాతీయ సంస్ధలు ఉన్నాయి. మొత్తం మీద 211 మంది వ్యక్తులు, 107 సంస్ధలు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం రేసులో నిలిచాయి. ఇది నోబెల్‌ శాంతి పురస్కారం చరిత్రలోనే ఇది నాలుగో అతిపెద్ద పోటీ అని విశ్లేషకులు పేర్కొన్నారు.

world food programme (wfp) wins nobel peace prize 2020

Recommended Video

#AmitabhBachchan : Coronavirus సోకిన తరువాత మొదటిసారి మాట్లాడిన Amitabh Bachchan..!

ఈ ఏడాది నోబెల్‌ శాంతి పురస్కారానికి ఎంపికైన ప్రపంచ ఆహార కార్యక్రమం కింద కరోనా సమయంలో ఐక్యరాజ్యసమితి తన సభ్యదేశాల్లో పేద దేశాల్లో కోట్లాది మందికి అన్నపానీయాలు అందించడం ద్వారా ఆకలి తీర్చింది. అకలి తీర్చడం కూడా శాంతికి కృషి చేయడమే అని ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ప్రకటన సందర్భంగా నోబెల్‌ కమిటీ ప్రతినిధి పేర్కొన్నారు. కరోనా సమయంలో వివిధ దేశాల ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ ప్రపంచ ఆహార కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడిందని నోబెల్ కమిటీ ప్రశంసించింది.

English summary
The Norwegian Nobel Committee has decided to award the 2020 Nobel Peace Prize to the World Food Programme (WFP).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X