వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus : పేరు మార్చిన డబ్ల్యూహెచ్ఓ.. కొత్త పేరు ఏంటో తెలుసా..

|
Google Oneindia TeluguNews

చైనాలోని వుహాన్ పట్టణం నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అధికారిక పేరును ఖరారు చేసింది. ఈ వైరస్‌కు కోవిడ్-2019(covid-2019) అని పేరు పెట్టింది. ఇందులో CO -కరోనా,VI-వైరస్,D-డిసీజ్ అని అర్థం. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉన్న డబ్ల్యూహెచ్ఓ హెడ్ క్వార్టర్స్‌లో ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఈ ప్రకటన చేశారు.

కొత్తపేరు అందుకే..

కొత్తపేరు అందుకే..

కరోనాపై వ్యాప్తిలో ఉన్న తప్పుడు పేర్లు లేదా సరికాని పేర్లను నిరోధించడానికి ఇది ఉపయోగపడుతుందని టెడ్రోస్ చెప్పారు. భవిష్యత్తులో కరోనా వైరస్‌ను ఎక్కడ గుర్తించినా.. డబ్ల్యూహెచ్ఓ ఖరారు చేసిన పేరుతో పిలవడం ద్వారా దానికో ప్రామాణికత ఏర్పడుతుందన్నారు. తాము సూచించే పేరు ద్వారా ఏ ఒక్క దేశం లేదా ప్రత్యేక సమూహానికి కళంకం ఏర్పడకూడదని డబ్ల్యూహెచ్ఓ భావిస్తుందని అందుకే ఆ పేరును ఖరారు చేశామని చెప్పారు. ఆ పేరులో ఎలాంటి భౌగోళిక,వ్యక్తుల,జంతువుల,సమూహాల పేరును సూచించే పదాలేవి లేవన్నారు.

డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్..

డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్..

డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ... భవిష్యత్తులో కొత్తరకం కరోనా వైరస్‌లు పుట్టుకొస్తే.. వాటికి పేర్లు పెట్టడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. కరోనా వైరస్ అనేది సాధారణ వైరస్‌ల సమూహాం అని అన్నారు. కరోనా వైరస్‌లో అనేక జాతులు ఉన్నాయని, అవి కూడా బయటపడవచ్చునని.. అవి బయటపడే సంవత్సరాన్ని జోడించి వాటికి పేర్లు పెడుతారని చెప్పారు.

Recommended Video

Good Morning India: 3 Minutes 10 Headlines : YS Jagan To Meet Modi, Amit Shah
సోషల్ మీడియాలో తప్పుడు పేర్లు..

సోషల్ మీడియాలో తప్పుడు పేర్లు..

కరోనా వైరస్‌ను కొంతమంది వుహాన్ వైరస్ అని,మరికొందరు చైనా వైరస్ అని సోషల్ మీడియాలో పేర్కొంటున్నందునా.. పేర్ల విషయంలో ప్రజల్లో గందరగోళాన్ని తొలగించేందుకు, అలాగే శాస్త్రీయ ప్రయోజనాల కోసం డబ్ల్యూహెచ్ఓ అధికారిక పేరును ఖరారు చేసిందని సౌమ్య స్వామినాథన్ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా లేదా ఇంటర్నెట్ ద్వారా ఒక్కసారి పేర్లు జనంలోకి వెళ్లాయంటే.. వాటిని తొలగించడం కష్టమని.. అందుకే డబ్ల్యూహెచ్ఓ అధికారికంగా పేరు పెట్టిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

వెయ్యికి చేరిన మృతుల సంఖ్య

వెయ్యికి చేరిన మృతుల సంఖ్య

కరోనా వైరస్ కారణంగా చైనాలో మృతుల సంఖ్య మంగళవారం నాటికి వెయ్యికి చేరింది. మంగళవారం ఒక్కరోజే 108 మంది మృత్యువాత పడ్డారు. కొత్తగా మరో 2478మందికి వైరస్ సోకడంతో... మొత్తం కేసుల సంఖ్య 43వేలకి చేరింది. ఇప్పటికైతే కరోనా వైరస్‌ను నిరోధించే వ్యాక్సిన్ ఏది అందుబాటులోకి రాలేదు. వ్యాక్సిన్ తయారీకి 18నెలల సమయం పడుతుందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. మరోవైపు అమెరికాకు చెందిన గిలీడ్ అనే ఫార్మాసూటికల్ సంస్థ ఓ వ్యాక్సిన్‌ను తయారుచేసినట్టు తెలుస్తోంది. అయితే దీనికి అధికారిక ఆమోదం లభించలేదు. ప్రస్తుతానికి ల్యాబ్‌లలో ప్రయోగాత్మకంగా దీన్ని పరిశీలిస్తున్నారు.

English summary
The flu-like coronavirus that has sickened more than 43,100 people in over two dozen countries now has a name: Covid-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X