వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా కంట్రోల్ కాకుండానే లాక్ డౌన్ ఎత్తివేత మంచిది కాదు ..హెచ్చరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

|
Google Oneindia TeluguNews

కరోనా వ్యాప్తిని అరికట్టటానికి విధించిన లాక్ డౌన్ ను ఎత్తి వేస్తే , ఇక ఆ ఎత్తివేతను కూడా సమర్ధంగా నిర్వహించకపోతే చాలా దారుణమైన పరిస్థితులు చూడాల్సి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది . స్పెయిన్, ఇటలీ, జర్మనీ మరియు ఫ్రాన్స్ వంటి బాగా దెబ్బతిన్న దేశాలలో కొన్ని స్వాగతించే మార్పులు ఉన్నప్పటికీ, లాక్ డౌన్ ఆర్డర్లను ఎత్తివేయడం అప్పుడే మంచిది కాదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు హెచ్చరించారు.

కరోనా బాధితుడితో కానీ, ప్రయాణాల్లో కానీ సంబంధం లేని కరోనా పాజిటివ్ కేసులు : ఐసీఎంఆర్ అధ్యయనం కరోనా బాధితుడితో కానీ, ప్రయాణాల్లో కానీ సంబంధం లేని కరోనా పాజిటివ్ కేసులు : ఐసీఎంఆర్ అధ్యయనం

 లాక్ డౌన్ ఆంక్షల ఎత్తివేతపై తీవ్ర అభ్యంతరం

లాక్ డౌన్ ఆంక్షల ఎత్తివేతపై తీవ్ర అభ్యంతరం

ఇక దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు మాట్లాడుతూ ఆంక్షలను ఎవరైనా ఎత్తివేయాలని కోరుకుంటారు కానీ అదే సమయంలో, ఆంక్షలను చాలా త్వరగా ఎత్తివేయడం ఘోరమైన కరోనా పునరుజ్జీవనానికి దారితీస్తుంది అని హెచ్చరిస్తున్నారు. ఇక లాక్ డౌన్ ఎత్తివేత సరిగ్గా నిర్వహించకపోతే అది అత్యంత ప్రమాదకరంగా ఉంటుందిఅని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు. ఇటలీ ప్రపంచంలోని ఏ ఇతర దేశాల కంటే ఎక్కువ కరోనా మరణాలను నివేదించిందని పేర్కొన్నారు . 157,000 మందికి పైగా రోగులతో కేసుల సంఖ్యలో స్పెయిన్, ఆ తరువాత అమెరికా రెండవ స్థానంలో ఉంది. నివేదించిన కేసులలో చైనా క్షీణించినందున, డబ్ల్యూహెచ్‌ఓ యూరోప్‌ను కరోనావైరస్ యొక్క కొత్త కేంద్రంగా ప్రకటించింది.

చాలా మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్

చాలా మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్

ప్రపంచ ఆరోగ్య సంస్థ పెద్ద సంఖ్యలో కరోనా సోకిన ఆరోగ్య కార్యకర్తల గురించి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని దేశాల్లో 10 శాతం మంది ఆరోగ్య కార్యకర్తలు కరోనా బారిన పడుతున్నారని టెడ్రోస్ అన్నారు. అమెరికా, చైనా వంటి దేశాల ఆరోగ్య సంరక్షణ కార్మికులు ఆరోగ్య సంరక్షణ లో భాగంగా రోగులకు సేవలు చేస్తూ వ్యాధి బారిన పడుతున్నారని ఆయన అన్నారు. కరోనావైరస్ వంటి శ్వాసకోశాలకు సంబంధించిన తీవ్రమైన వ్యాధిని నిర్ధారించటానికి , నిర్వహించడానికి ఉన్న వైద్య సిబ్బంది కొత్త మంది తక్కువ అనుభవం మరియు అనుభవం లేనివారని అందుకే వారు కూడా పెద్ద సంఖ్యలో కరోనాకు గురవుతున్నారని WHO తెలిపింది.

ఆరోగ్య కార్యకర్తల విషయంలో ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూ హెచ్ ఓ

ఆరోగ్య కార్యకర్తల విషయంలో ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూ హెచ్ ఓ

ఇక ఇదే సమయంలో ఇది భయంకరమైన ధోరణి. ఆరోగ్య కార్యకర్తలు ప్రమాదంలో ఉన్నప్పుడు, మనమందరం ప్రమాదంలో ఉన్నాము అని టెడ్రోస్ చెప్పారు. ఇతర దేశాలు, ముఖ్యంగా కొన్ని ఆఫ్రికన్ దేశాలు, కేసుల యొక్క పరిస్థితి చూస్తే భయంకరమైన మరణాలను చూస్తున్నాయని ఆయన అన్నారు. ఈ వైరస్ 16 ఆఫ్రికన్ దేశాలలో వ్యాపించింది. ఇక అక్కడ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు పెద్దగా లేవు. అలాగే వ్యాధి సోకటానికి మూలాలు కూడా తెలియటం లేదు .కొన్ని చోట్ల కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ గా ఉన్న పరిస్థితి .
ఒక విధంగా చెప్పాలంటే బలమైన ఆరోగ్య వ్యవస్థ ఉన్న దేశాలు ఈ మహమ్మారిని చూసి ఆశ్చర్యపోయాయి అని టెడ్రోస్ చెప్పారు.

అప్రమత్తంగా ఉండాలి .. నిర్ణయాల విషయంలో జాగ్రత్త

అప్రమత్తంగా ఉండాలి .. నిర్ణయాల విషయంలో జాగ్రత్త

ఇక లాక్ డౌన్ విషయంలో మాత్రం అప్రమత్తంగా నిర్ణయం తీసుకోకుంటే తరువాత తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని పేర్కొన్నారు.పాఠశాలలు, కార్యాలయాలు తప్పకుండా నివారణ చర్యలు తీసుకోవాలని, ఇక కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ గురించి కూడా ప్రజలకు అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని పేర్కొన్నారు. తమకు వర్ణ బేధాలు లేవని ఇలాంటి సమయంలో గుర్తున్చుకోవాలసింది జాతీయ సమైక్యత పాటించటం , ప్రపంచ సంఘీభావం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

English summary
The World Health Organization officials have warned that even though there are some welcome changes in some of the worst-hit countries like Spain, Italy, Germany and France, it is too soon to lift lockdown orders. "WHO wants to see restrictions lifted as much as anyone. At the same time, lifting restrictions too quickly could lead to a deadly resurgence. The way down can be as dangerous as the way up if not managed properly," WHO Director-General Tedros
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X