వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కంగ్రాట్స్ బిడెన్-హ్యరిస్: ప్రపంచ దేశాధినేతల విషెస్, బిడెన్‌తో కమలా ఫస్ట్ కాల్.. వి డిడ్ ఇట్..

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ ఘన విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్‌గా కమలా హ్యరిస్ గ్రాండ్ విక్టరీ కొట్టారు. దీంతో వారిద్దరికీ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కంగ్రాట్స్ అంటూ ప్రపంచ దేశాధినేతలు విష్ చేస్తున్నారు.

 స్నేహ హస్తం..

స్నేహ హస్తం..

కెనడా నేత జస్టిన్ ట్రూడో విష్ చేశారు. బిడెన్, హరిస్‌కు అభినందనలు తెలిపారు. అమెరికా, కెనడా స్నేహంతో మెలిగే దేశాలు.. ప్రపంచ యవనిక ఇరుదేశాలు కలిసికట్టుగా పనిచేస్తాయని అన్నారు. మీతో కలిసి బంధాన్ని మరింత ఇనుమడింప జేస్తామని ట్రూడో ట్వీట్ చేశారు.

 అభినందనలు..

అభినందనలు..

ఐరీష్ ప్రధానమంత్రి మైఖేల్ మార్టిన్ బిడెన్, హ్యరిస్‌కు అభినందనలు తెలిపారు. బిడెన్ మంచి స్నేహితుడు అని గుర్తుచేశారు. అతనితో కలిసి గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నానని తెలిపారు. అధ్యక్షుడిగా ఎన్నికవడం సంతోషంగా ఉంది అని ట్వీట్ చేశారు. ఐరీస్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని ఐర్లాండ్ వైద్యారోగ్యశాఖ మంత్రి సైమన్ కాన్వె అన్నారు.

 విష్ చేసిన ఒబామా..

విష్ చేసిన ఒబామా..

ప్యారిస్ మేయర్ అన్నె హిదాల్గొ వెల్ కం బ్యాక్ అమెరికా అంటూ ట్వీట్ చేశారు. మనం ప్యారిస్ అగ్రిమెంట్ 5వ యానివర్సరీ వేడుక చేసుకుందాం అంటూ ట్వీట్ చేశారు. వాతావరణ మార్పులపై కలిసి పనిచేద్దామని పేర్కొన్నారు. జర్మనీ విదేశాంగ కమిటీ చైర్మన్, లండన్ మేయర్ సదీఖ్ ఖాన్ అభినందనలు తెలిపారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా విష్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహు.. బిడెన్, హ్యరిస్‌లను విష్ చేశారు. తమ దేశాల మధ్య ఇలాగే సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. బిడెన్, హరిస్‌లకు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అభినందనలు తెలిపారు.

 గర్వకారణం..

గర్వకారణం..

తన తల్లి ఈ రోజు గర్విస్తోందని కమలా హర్యిస్ సోదరి మాయ హరిస్ పేర్కొన్నారు. అంతేకాదు అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత బిడెన్‌తో కమలా హ్యరిస్ ఫస్ట్ కాల్ మాట్లాడారు. మనం సాధించాం అంటూ ఆమె కాల్ కొనసాగింది. మనం సాధించాం.. మీరు నెక్ట్స్.. యూఎస్ఏ ప్రెసిడెంట్ అంటూ నవ్వారు. అమెరికాలో ప్రజాస్వామ్యం గెలిచిందని మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు,

English summary
world leaders have congratulated President-elect Joe Biden and Vice President-elect Kamala Harris Saturday on their victory in the 2020 US presidential election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X