వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్భుతం: మనిషి తలను మరొకరికి అమర్చారు, ఎక్కడంటే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

వియన్నా: ఒకరి తలను మరోకరికి అమర్చడం సాద్యమేనని చైనాకు చెందిన డాక్టర్ షియావ్‌పింగ్ రెన్ నిరూపించారు. సెర్గి కానవేరో బృందంలో సభ్యుడైన షియావ్‌పింగ్ రెన్ ఒకరి తలను మరోకరికి అమర్చి చూపాడు.

టెక్నాలజీ సహయంతో మనిషి అనేక అద్భుతాలను సృష్టిస్తున్నారు. టెక్నాలజీ సహయంతో చనిపోయేస్థితిలో ఉన్న వారిని కూడ బతికిస్తున్నారు.అయితే ఒకరి తలను మరోకరికి కూడ అమర్చనున్నట్టు ఏడాది క్రితం సెర్గికానవేరో అనే డాక్టర్ ప్రకటించి సంచలనం సృష్టించారు.

అయితే ఆయన బృందంలోని చైనాకు చెందిన డాక్టర్‌ షియావ్‌పింగ్‌ రెన్‌ ఈ విషయాన్ని నిరూపించారు.దీంతో ఇంకా ఈ విషయమై మరిన్ని ప్రయోగాలు చేసేందుకు
ఈ బృందం సిద్దమైంది.

తలల మార్పిడి పూర్తి చేశాం

తలల మార్పిడి పూర్తి చేశాం

చైనాలో దాదాపు 18 గంటలపాటు శస్త్ర చికిత్స జరిపి ఒక శవం తలను ఇంకో మొండేనికి మళ్లీ అతికించగలిగామని కానవేరో ప్రకటించారు.తలల మార్పిడి ప్రక్రియ విజయవంతమైతే ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తాయని అన్నారు.త్వరలోనే బ్రెయిన్‌ డెడ్‌ అయిన వారి తలలు మార్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

 తలల మార్పిడిపై భిన్న వాదనలు

తలల మార్పిడిపై భిన్న వాదనలు

కానవేరో ప్రయోగాలపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కానవేరో చేస్తుంది నైతికంగా చాలా తప్పని యూనివర్సిటీ హాస్పిటల్‌ ఆఫ్‌ సౌత్‌ మాంచెస్టర్‌కు చెందిన డాక్టర్‌ జేమ్స్‌ ఫైల్డ్‌ విమర్శించారు. తల మార్పిడి ద్వారా ఓ భారీ సైజు జీవి జీవన ప్రమాణాన్ని ఎంతో కొంత మెరుగుపరచగలరన్నది నిరూపించేందుకు తగిన సాక్ష్యాలు లను కానవేరో చూపాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.

 ఎలుక తలను మార్చారు

ఎలుక తలను మార్చారు

మనిషి తలను విజయవంతంగా మార్చేందుకుగాను కానవేరో బృందం అనేక జంతువులపై ప్రయోగాలు చేస్తోంది. ఒక ఎలుకకు అదనంగా ఇంకో తలను జోడించి దాన్ని 36 గంటలపాటు జీవించి ఉండేలా చేశారు. ఈ రకంగా జంతువులపై ప్రయోగాలు విజయవంతమైన తర్వాత శవాల తలలను అతికించే ప్రయోగంలో కూడ సక్సెస్ అయ్యారు. ఇక బ్రెయిన్ డెడ్ అయిన రోగుల తలలను మార్చనున్నారు. ఆ తర్వాతే బతికున్న మనుషుల తలలను మార్చనున్నారు.

 రెండేళ్ళ క్రితమే సంచలనం

రెండేళ్ళ క్రితమే సంచలనం

రెండేళ్ల క్రితం రష్యాకు చెందిన కంప్యూటర్‌ సైంటిస్ట్‌ వాలరె స్పిరిడినోవ్‌ తలను ఇంకో మొండేనికి అతికిస్తానని కానవేరో ప్రకటించారు. ఆనాడు ఈ ప్రకటన సంచలనమే. ఈ అంశంపై ఎన్నో చర్చలు మొదలయ్యాయి. అప్పట్లో ఈ ప్రయోగానికి అంగీకరించిన స్పిరిడినోవ్‌ ప్రస్తుతం తనకు ఆరోగ్యవంతమైన శరీరం లభించడం కష్టమే అని అంటున్నారు.

English summary
The world's first human head transplant has allegedly been performed on a corpse in an 18 hour operation which successfully connected the spine, nerves and blood vessels of two people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X