• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ సంచలన ప్రకటన: వారసుడి పేరు ఖరార్: ఆన్‌లైన్ బుక్ స్టోర్ స్థాయి

|

వాషింగ్టన్: టాప్ ఆన్‌లైన్‌ మార్కెటింగ్ కంపెనీ, ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరున్న జెఫ్ బెజోస్.. సంచలన ప్రకటన చేశారు. అమెజాన్ నుంచి తప్పుకోబోబోతున్నట్లు వెల్లడించారు.. కొత్త ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి అమెజాన్‌లో అన్ని రకాల బాధ్యతల నుంచి ఆయన వైదొలగబోతోన్నారు. తన వారసుడిని కూడా ఖరారు చేశారు. ఆయన పేరును ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

  #JeffBezos To Step Down As #Amazon CEO
  కొత్త సీఈఓగా ఆండీ జస్సీ..

  కొత్త సీఈఓగా ఆండీ జస్సీ..

  ఆండీ జస్సీ..తదుపరి పీఈఓగా నియమితులు కానున్నారు. ప్రస్తుతం ఆండీ.. అమెజాన్ వెబ్ సర్వీసుల విభాగాధిపతిగా పని చేస్తున్నారు. 1994లో అమెరికాలోని సియాటెల్ ప్రధాన కేంద్రంగా ఓ చిన్న స్టార్టప్‌గా ఆవిర్భవించింది.. అమెజాన్. ఆన్‌లైన్ బుక్ స్టోర్‌గా ప్రారంభంలో సర్వీసులను అందించిందా కంపెనీ. ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో ఆకాశమే హద్దుగా ఎదిగింది. ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించింది. తాము కొనుగోలు చేసే వస్తువులను ఒక్క ఫోన్ కాల్‌తో ఇంటికే తెప్పించుకునే సదుపాయాన్ని కల్పించడంతో ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ సర్వీసులను కోట్లాదిమంది ఆదరించారు.

  1996లో ఆన్‌లైన్ బుక్ స్టోర్‌గా

  1996లో ఆన్‌లైన్ బుక్ స్టోర్‌గా

  ఇ-కామర్స్, రిటైల్ మార్కెటింగ్ రంగంలో ఓ సరికొత్త ఒరవడిని తీసుకొచ్చిందా కంపెనీ. 1996 నుంచీ జెఫ్ బెజోస్ అమెజాన్ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌‌లో ఎంబీఏ చదివిన జెఫ్ బెజోస్.. క్యాంపస్ నుంచి బయటికి వచ్చిన వెంటనే అమెజాన్‌ను నెలకొల్పాలరు. ఆ కంపెనీ సర్వీసులు విశ్వవ్యాప్తం కావడానికి ఆయన అనుసరించిన వ్యూహాలు, ప్రణాళికలే కారణం. పదేళ్ల తరువాత కూడా ప్రజలు ఎలాంటి సర్వీసులను కోరుకుంటారనే విషయాన్ని ఆయన ముందుగానే పసిగట్టగలిగారు. దానికి అనుగుణంగా కంపెనీ స్ట్రాటజీని రూపొందించుకోగలిగారు. దాన్ని పక్కాగా ఎగ్జిక్యూట్ చేయగలిగారు.

  అమెజాన్ వెబ్ సర్వీసెస్ చీఫ్

  అమెజాన్ వెబ్ సర్వీసెస్ చీఫ్

  ఫలితంగా- ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరు తెచ్చుకున్నారు. అన్నీ సవ్యంగా సాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో జెఫ్ బెజోస్.. అర్ధాంతరంగా తప్పుకోనున్నట్లు ప్రకటించారు. కొత్త ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అమెజాన్ సంస్థకు కొత్త సీఈఓ నియమితులవుతారని వెల్లడించారు. ఆండీ జస్సీని తన వారసుడిగా నియమిస్తున్నట్లు తెలిపారు. అమెజాన్ వెబ్ సర్వీసుల హెడ్‌గా పనిచేస్తోన్న ఆండీ జస్సీ 1997లో మార్కెటింగ్ మేనేజర్‌గా అమెజాన్‌లో చేరారు.2003లో అమెజాన్ వెబ్ సర్వీస్‌ను స్థాపించారు. అప్పటి నుంచీ ఆయన ఆ విభాగం చీఫ్‌గా పనిచేస్తున్నారు.

  వ్యక్తిగత కారణాల వల్లే..

  వ్యక్తిగత కారణాల వల్లే..

  ఆయన సారథ్యంలో కంపెనీ మరింత పురోగమిస్తుందని నమ్ముతున్నట్లు బెజోస్ తెలిపారు. తన తరువాత ఆ స్థాయి అనుభవం ఉన్న వ్యక్తి ఆయనొక్కరేనని పేర్కొన్నారు. 57 సంవత్సరాల వయస్సున్న జెఫ్ బెజోస్.. తాను తప్పుకోవడానికి గల కారణాలను వెల్లడించలేదు. దానికి సంబంధించిన ఎలాంటి ప్రస్తావన కూడా ఈ ప్రకటనలో పొందుపరచలేదు. వ్యక్తిగత కారణాల వల్లే ఆయన తప్పుకొంటున్నారని అమెరికన్ మీడియా అభిప్రాయపడుతోంది.

  English summary
  Amazon founder Jeff Bezos said Tuesday he would stand aside later this year as chief executive of the company he built from a startup into one of the world's most valuable firms. handing over the CEO role to Andy Jassy, who heads Amazon Web Services.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X