వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నివ్వెరపోయిన ప్రపంచం, తోక తొక్కిన త్రాచులా ట్రంప్, కిమ్ కి వ్యతిరేకంగా ఒక్కటైన రష్యా, చైనా!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బీజింగ్: ఉత్తర కొరియా దుడుకుతనం ఏమాత్రం తగ్గడం లేదు. కొద్ది రోజులుగా వరస క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటోంది. హైడ్రోజన్ బాంబును రూపొందించినట్లు ప్రకటించడమే కాక ఆ వెంటనే ఆరోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించడంతో యావత్ ప్రపంచం షాక్ కు గురైంది.

ఉత్తర కొరియా దురుసు చర్యలను ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండించాయి. ఉత్తరకొరియా చర్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లో భూకంపం తెప్పించింది. ఆయన తోక తొక్కిన త్రాచులా లేచారు.

తన ట్విట్టర్ ఖాతాలో ట్రంప్ ఉత్తర కొరియాపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. మరోవైపు చైనా, రష్యాలు కూడా ఉత్తరకొరియా విషయంలో ఒక్కటైనట్లు, ఇకమీదట ఆ దేశంతో వ్యూహాత్మకంగా వ్యహరించాలనే ఒప్పందానికి వచ్చినట్లు చైనా అధికార పత్రిక జున్హువా తెలిపింది.

ఆ ప్రకటనతో నివ్వెరపోయిన ప్రపంచం...

ఆ ప్రకటనతో నివ్వెరపోయిన ప్రపంచం...

తాము అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబు అభివృద్ధి చేశామని ప్రకటించిన ఉత్తర కొరియా గంటల వ్యవధిలోనే ఆరోసారి అణు పరీక్షలు నిర్వహించి ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఈ అణు పరీక్షల వల్ల ఉత్తర కొరియా సరిహద్దుల్లోని జపాన్, చైనా, దక్షిణ కొరియా ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇటీవల పరీక్షించిన ఖండాంతర క్షిపణి హాస్వాంగ్ 14 ద్వారా హైడ్రోజన్ బాంబును ప్రయోగిస్తామని, తమ దేశాధినేత అదేశాలతోనే దీన్ని రూపొందించామని ఉత్తర కొరియా సైన్యాధికారులను ఉటంకిస్తూ ఆ దేశ అధికార పత్రిక ఒక కథనాన్ని ప్రచురించడం తెలిసిందే.

అగ్గిమీద గుగ్గిలమైన ట్రంప్...

అగ్గిమీద గుగ్గిలమైన ట్రంప్...

ఇప్పటికే ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ వైఖరిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఉత్తర కొరియా చర్యలు, దాని నియంత కిమ్ మాటలు అమెరికాకు వ్యతిరేకంగా, ప్రమాదకరంగా మారుతున్నాయంటూ ట్రంప్ ట్విట్టర్ ద్వారా హోరెత్తించారు. ఉత్తరకొరియాను ఒక ధూర్త దేశంగా అభివర్ణించారు. ప్రపంచానికి ఆ దేశం ఒక పెనుముప్పుగా తయారైందన్నారు. ఆ దేశాన్ని బుజ్జగించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, వారికి అర్థమయ్యే భాష ఒకటేనని పరోక్షంగా యుద్ద వ్యాఖ్యలు చేశారు. అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జిమ్‌ మ్యాటిస్‌ ఉత్తరకొరియాను సమూలంగా నాశనం చేయడానికి కూడా వెనుకాడబోమని పేర్కన్నారు.

ఉత్తరకొరియా ఫ్రెండ్స్ తో ఇక నో బిజినెస్...

ఉత్తరకొరియా ఫ్రెండ్స్ తో ఇక నో బిజినెస్...

ఉత్తర కొరియా విషయంలో ఇన్నాళ్లు దక్షిణ కొరియా వెలిబుచ్చిన ఆందోళన నిజమేనని ఇప్పుడు అర్థమవుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. తాజా క్షిపణి పరీక్షల నేపథ్యంలో ఉత్తరకొరియాపై ట్రంప్ కఠిన ఆంక్షలు విధించారు. దీనికి సంబంధించిన కొత్త ముసాయిదాను రూపొందిస్తున్నట్లు అమెరికా ఆర్థిక శాఖ కూడా ప్రకటించింది. ముసాయిదా ప్రకారం ఉత్తరకొరియాతో వ్యాపారం జరిపే ఏ దేశమైనా తమతో వ్యాపారం జరపడానికి కుదరదని అమెరికా ఆర్థిక మంత్రి తేల్చేశారు. ఇదే విషయాన్ని ట్రంప్‌ ట్విటర్‌లో కూడా పేర్కొన్నారు.

ప్రపంచ శాంతికి విఘాతమే...

ప్రపంచ శాంతికి విఘాతమే...

చైనాలోని జియామెన్‌లో బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాట్లాడుతూ నిరంతర అణ్వాయుధ పరీక్షలతో ఉత్తరకొరియా ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోందని మండిపడ్డారు. ఉత్తరకొరియా తీరు మార్చుకోవాలని ఆయన సూచించారు. విద్వేషాలు, రెచ్చగొట్టే ప్రకటనలు మంచిది కాదని అన్నారు. ఉత్తరకొరియా ప్రకటనలు, చేస్తున్న క్షిపణి పరీక్షలు ప్రపంచ శాంతికి విఘాతంగా మారుతున్నాయని మండిపడ్డారు.

కిమ్ కు వ్యతిరేకంగా ఒప్పందం?

కిమ్ కు వ్యతిరేకంగా ఒప్పందం?

చైనాలోని జియామెన్‌లో సోమవారం జరిగే బ్రిక్స్ సమావేశానికి ఒకరోజు ముందుగానే వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ అయినట్లు తెలుస్తోంది. పుతిన్, జిన్‌పింగ్ నడుమ జియామెన్‌లో ఆదివారం రాత్రి ఒక ఒప్పందం కూడా కుదరినట్లు సమాచారం. ఉత్తర కొరియా దూకుడుకు అడ్డుకట్ట వేసి అణునిరాయుధీకరణ నెలకొల్పడమే లక్ష్యంగా ఇరుదేశాల నేతలు ఈ మేరకు ఒప్పందం చేసుకున్నట్లు చైనా అధికార పత్రిక జిన్హువా ఒక కథనం ప్రచురించింది.

English summary
Chinese President Xi Jinping met with his Russian counterpart Vladimir Putin on Sunday, calling for enhancing mutual support and strategic coordination. The two leaders also agreed to appropriately deal with the latest nuclear test conducted by the Democratic People's Republic of Korea (DPRK). Putin is in the southeastern Chinese coastal city of Xiamen, Fujian Province, to attend the ninth BRICS summit and the Dialogue of Emerging Market and Developing Countries scheduled for Sept. 3-5. The two sides should consolidate the high-level mutual political trust, firmly strengthen mutual support and enhance strategic coordination, Xi said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X