వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేం భారత్‌లోకి చొచ్చుకు వస్తే రచ్చ, చేయడానికేం ఉండదు: చైనా కొత్త బెదిరింపు

డొక్లామ్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్‌కు చైనా మంగళవారం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.

|
Google Oneindia TeluguNews

బీజింగ్: డొక్లామ్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్‌కు చైనా మంగళవారం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. భారత్‌లోకి తమ దళాలు ప్రవేశిస్తే పరిస్థితి చాలా గందరగోళంగా మారుతుందని డ్రాగన్ కంట్రీ హెచ్చరించింది. మేం భారత్‌లోకి ప్రవేశిస్తే అప్పుడు చేయడానికేం ఉండదన్నారు.

భారత్‌పై యుద్ధానికి చైనా దూకుడు, కానీ అవి బ్రేకులు వేస్తాయి!భారత్‌పై యుద్ధానికి చైనా దూకుడు, కానీ అవి బ్రేకులు వేస్తాయి!

ఢిల్లీ ప్రకటన మోసపూరితం

ఢిల్లీ ప్రకటన మోసపూరితం

డొక్లామ్ విషయంలో న్యూఢిల్లీ ప్రకటన మోసపూరితమైనది, దుర్మార్గమైనదని చైనా ఆక్షేపించింది. చైనా విదేశాంగ శాఖ మంత్రి మంగళవారం మాట్లాడారు. తాము రోడ్లు వేస్తుంటే అడ్డుకున్నారని, అనవసరంగా, అక్రమంగా తమ భూభాగంలో కలుగజేసుకున్నారన్నారు.

ఓపిగ్గా చూస్తూ ఉండాలా

ఓపిగ్గా చూస్తూ ఉండాలా

భారత్‌ది మోసపూరితమైన తీరు అని, దుర్మార్గమైన చర్య అని చైనా విదేశాంగ శాఖ మంత్రి అన్నారు. వాస్తవాలు చాలా స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. భారత్ తీరును తాము ఓపిగ్గా చూస్తూ ఉండాలా అని అభిప్రాయపడింది.

ఇష్టం లేకుంటే మేం భారత్‌లోకి చొచ్చుకు రావొచ్చా?

ఇష్టం లేకుంటే మేం భారత్‌లోకి చొచ్చుకు రావొచ్చా?

చైనా రోడ్డు నిర్మాణం చేస్తున్న‌ద‌న్న సాకుతో భార‌త బ‌ల‌గాలు హ‌ద్దు దాటాయని, వాళ్లు చెప్పే కార‌ణం హాస్యాస్ప‌దంగా ఉందని, ఇది చూసి ఏ దేశ‌మైనా త‌న ప‌క్క దేశంలో త‌న‌కు ఇష్టం లేని ప‌నులు జ‌రుగుతుంటే చొర‌బ‌డ‌తాయా? భారత్ కూడా స‌రిహ‌ద్దులో నిర్మాణాలు చేప‌డితే చైనా బ‌ల‌గాలు కూడా చొచ్చుకురావ‌చ్చా? అలా అయితే ఎంత గంద‌ర‌గోళం అవుతుందో తెలుసా? అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్ర‌తినిధి హువా చున్యింగ్ అన్నారు.

ఆ లాజిక్ సరిగా లేదు

ఆ లాజిక్ సరిగా లేదు

డొక్లామ్ వివాదంలో భారత్ లాజిక్ సరిగా లేదని, అదే లాజిక్‌తో ప్రతి ఒక్కరూ పొరుగు దేశంలోకి చొరబాటు చేయవచ్చుననే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

చైనా కొత్త తరహా బెదిరింపు

చైనా కొత్త తరహా బెదిరింపు

మొత్తానికి, డోక్లామ్ వివాదంపై చైనా ఇవాళ కొత్త బెదిరింపుల‌కు దిగింది. త‌మ భూభాగంలోకి భార‌త బ‌ల‌గాలే అక్ర‌మంగా చొర‌బ‌డ్డాయ‌న్న అర్థం వ‌చ్చేలా వ్యాఖ్య‌లు చేసింది. త‌మ బ‌ల‌గాలు భార‌త భూభాగంలోకి చొర‌బ‌డితే ర‌చ్చ ర‌చ్చ‌వుతుంద‌ని హెచ్చరించడం గమనార్హం.

మారని చైనా

మారని చైనా


ఇదిలా ఉండగా, ఎన్ని దేశాలు త‌మ వాద‌న‌ను అడ్డంగా కొట్టేస్తున్నా చైనా మాత్రం డోక్లామ్ త‌మ‌దే అని ఇప్ప‌టికీ వాదిస్తూనే ఉంది. భూటాన్ కూడా ఆ భూభాగం త‌మ‌దే అని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది. అటు అమెరికా, జ‌పాన్ కూడా ఈ వివాదంలో భార‌త్‌కే మ‌ద్ద‌తు తెలిపాయి. అయినా చైనా తీరు మాత్రం మార‌డం లేదు.

English summary
China today said there will be "utter chaos" if its troops entered India on the pretext that Indian border infrastructure posed a threat to Beijing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X