• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

క్రాష్: కనిపించిన అల్జీరియా విమానం శకలాలు

By Pratap
|
Wreckage, remains from Air Algérie flight AH5017 found in Mali
అల్జీర్స్: అల్జీరియాకు చెందిన విమాన శిథిలాలు శుక్రవారం మాలి దేశం సమీపంలో కనిపించాయి. అల్జీరియా విమానం కనిపించకుండా పోయి కూలిపోయిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో 110 మంది ప్రయాణీకులు 6గురు సిబ్బంది ఉన్నారు. అందరూ మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. గత వారం రోజుల్లో ప్రపంచంలో ఇది మూడో విమాన ప్రమాదం.

అల్జీరియాకు చెందిన పౌరవిమానం కూలిపోయినట్లు ఆ దేశం నిర్ధారించింది. గురువారం నాడు బుర్కినా ఫాసో నుంచి అల్జీర్స్‌కు బయలుదేరిన విమానం మాలి సమీపంలో కూలిపోయినట్లు నిర్ధారణ అయింది. అధికారులు విమాన శిథిలాలను కూడా కనుగొన్నారు. విమానం ప్రయాణిస్తున్న సమయంలో వాతావరణం అనుకూలంగా లేదు.

ఆ ప్రాంతానికి భయంకరమైన తుపాన్ ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆ కారణం వలనే విమానం కూలిపోయి ఉంటుందని అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.విమానం బుర్కినా ఫాసోలో ప్రయాణం ప్రారంభించిన గంట వ్యవధిలో గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి.

విషయం తెలిసిన వెంటనే ఫ్రెంచ్ ఫైటర్ జెట్ విమానాలు రంగంలోకి దిగాయి. అలాగే మాలి నైజీరియా సరిహద్దుల్లో ప్రయాణిస్తున్న విమానాలు కూడా అల్జీరియా విమానం ఆచూకీ తెలుసుకోడానికి ప్రయత్నించాయి. చివరికి మాలి దేశం సమీపంలో శిథిలాలు దొరకడంతో విమానం కూలిపోయిందని అధికారులు నిర్థారించారు.

English summary
An Air Algerie flight carrying 110 passengers and six crew members has reportedly crashed in Mali after having disappeared from radar early on Thursday morning between Burkina Faso and Algeria.
 An Air Algerie flight that had taken off from Burkina Faso's capital Ouagadougou went missing on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X