వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

COVID-19 virus: వుహాన్ ఆస్పత్రి డైరెక్టర్ మృతి, 1800కు చేరిన మృతుల సంఖ్య

|
Google Oneindia TeluguNews

వుహాన్: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్(కొవిడ్-19) వేలాది మంది సామాన్యులతోపాటు రోగులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బంది ప్రాణాలు కూడా తీస్తోంది. తాజాగా వుహాన్ నగరంలోని వుచాంగ్ ఆస్పత్రి ప్రధాన డైరెక్టర్ లియా జిమింగ్.. కరోనావైరస్ కారణంగా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

కొవిడ్ కారణంగా మృతి చెందిన తొలి ఆస్పత్రి డైరెక్టర్ లియూ కావడం గమనార్హం. గతంలో ఈ వైరస్‌ను తొలుత గుర్తించిన వైద్యుడు మృతి చెందిన విషయం తెలిసిందే.
లియూ జిమింగ్‌ను కాపాడేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమైనట్లు వైద్యులు వెల్లడించారు.

Wuhan hospital director dies of COVID-19 virus after all-out rescue efforts failed

లియూ జిమంగ్ మరణాన్ని చైనా అధికారిక టీవీ ఛానల్ ధృవీకరించింది. కాగా, కరోనా వైరస్ గురించి ముందస్తు హెచ్చరిక జారీ చేసిన వైద్యుడు లియూ జిమింగ్ మృతి చెందడం పట్ల చైనాలో లక్షలాది మంది ఆయనకు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. కాగా, ఇప్పటి వరకు కొడివ్ వల్ల ఆరుగురు వైద్య సిబ్బంది మృతి చెందగా, 1716 మంది వైద్య సిబ్బందికి కూడా ఈ వ్యాధి సోకింది.

1800 మంది దాటిన మృతులు

చైనాలో కరోనావైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 1800 దాటింది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న హుబెయ్ ప్రావిన్సులో సోమవారం 93 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 1863కు చేరింది. తాజాగా, మరో 1,807 కొత్త కరేసులు నమోదుకావడంతో బాధితుల సంఖ్య 72,300కు పెరిగింది. కాగా, హుబెయ్ వెలుపల ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గిందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 10,615 మంది వైరస్ బారి నుంచి కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు.

ఇది ఇలా ఉండగా, జపాన్ నౌకలో వైరస్ బారిన పడిన అమెరికన్లలో 13 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. నౌకలో ఉన్న 338 మంది అమెరికన్లను అక్కడి ప్రభుత్వం రెండు విమానాల్లో అమెరికాకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. వీరందరికీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య కేంద్రాల్లో చికిత్ అందిస్తున్నారు. వైరస్ బారిన పడ్డ మరో 40 మంది జపాన్‌లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఈ నౌకలో పలువురు భారతీయులు కూడా ఉండటం గమనార్హం. వీరిలో ఇద్దరికి కొవిడ్ సోకినట్లు అనుమానిస్తున్నారు.

English summary
A hospital director at the epicentre of China's virus epidemic died Tuesday, state media said, the latest medical worker to fall victim to the coronavirus which has spread across the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X