• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వూహాన్ ల్యాబ్ లీక్: చైనా ఆర్మీకి లింకు -కరోనా గుట్టు తేలకుంటే కొవిడ్-26, కొవిడ్-32 తప్పవు: అమెరికా బాంబు

|

పుట్టి ఏడాదిన్నర దాటినా ప్రపంచం ఇంకా కరోనా వైరస్ ప్రభావం వల్ల విలవిల్లాడుతూనే ఉంది. వ్యాక్సిన్ల కొరత ఉన్న భారత్ లాంటి దేశాలు ఆర్థికంగానూ ఘోరంగా దెబ్బతింటాయని ఐఎంఎఫ్ లాంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. కరోనాకు విరుగుడు వ్యాక్సిన్లేననే భావన బలంగా ఉన్నప్పటికీ, అసలు కొవిడ్ మూలాలను పూర్తిగా తెలుసుకోకుంటే రాబోయే రోజుల్లో ఉత్పాతం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్ వ్యాప్తికి మూలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాలో వూహాన్ ల్యాబ్ లో ఆ దేశ సైన్యం రహస్య కలాపాలు నిర్వహించిందని తాజాగా వెల్లడికావడం కలకలం రేపుతున్నది..

షాక్: భారత్‌లో వ్యాక్సిన్‌పై తొలి ఫిర్యాదు -కొవిషీల్డ్‌తో యాంటీబాడీలు రాలేదు -సీరం, కేంద్రంపై చర్యలుంటాయా?షాక్: భారత్‌లో వ్యాక్సిన్‌పై తొలి ఫిర్యాదు -కొవిషీల్డ్‌తో యాంటీబాడీలు రాలేదు -సీరం, కేంద్రంపై చర్యలుంటాయా?

బాంబు పేల్చిన పాంపియో

బాంబు పేల్చిన పాంపియో


కరోనా వైరస్ జన్మస్థలమైన వూహాన్ లో చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని వైరాలజీ ల్యాబ్ చుట్టూ ఏడాదిన్నరగా అనూహ్య వివాదాలు, వాదనలు, గొడవలు సాగుతున్నాయి. కరోనాను చైనా ఒక జీవాయుధంగా ప్రపంచం మీదికి ప్రయోగించిందనే ఆరోపణలు, చైనాలో రెండో వేవ్ తలెత్తకపోవడం, వుహాన్‌ ల్యాబ్ లో ప‌నిచేసే ప‌రిశోధ‌కుల‌కు 2019 నవంబ‌ర్ క‌న్నా ముందే వైర‌స్ సోకిన‌ట్లు ఇటీవ‌ల వాల్‌స్ట్రీట్ జ‌ర్న‌ల్ సంచలన క‌థ‌నం రాయడం, ఆ వెంటనే యూఎస్ ప్రెసిడెంట్ జోబైడెన్.. కరోనా మూలాలను కనిపెట్టాల్సిందిగా ఇంటెలిజెన్స్ ను ఆదేశించడం తెలిసిందే. ట్రంప్ హయాంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన మైక్ పాంపియో.. వూహాన్ ల్యాబ్ లీకేజీతో చైనీస్ ఆర్మీతో లింకులున్నాయంటూ తాజాగా బాంబు పేల్చారు.

షాకింగ్ video: కొవిడ్ రోగి శవాన్ని నదిలో పడేసిన బంధువుల -చివర్లో ఊహించని ట్విస్ట్ -కేంద్రం సీరియస్షాకింగ్ video: కొవిడ్ రోగి శవాన్ని నదిలో పడేసిన బంధువుల -చివర్లో ఊహించని ట్విస్ట్ -కేంద్రం సీరియస్

డైలీ మెయిల్ సంచలన కథనం..

డైలీ మెయిల్ సంచలన కథనం..


చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీకైందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే స్పష్టం చేసినా, దారి రిపోర్టులను అమెరికా లాంటి అగ్రదేశాలేవీ నమ్మడంలేదు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నన్ని రోజులూ ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావించారు. కరోనాను చైనీస్ వైరస్ అని కూడా నిందించారు. ఇప్పుడు బైడెన్ వచ్చిన తర్వాత కూడా అమెరికా తీరు మారలేదు. కొవిడ్ మూలాలపై దర్యాప్తునకు బైడెన్ ఆదేశించిన దరిమిలా, వుహాన్ ల్యాబ్ లీకేజీకి, చైనీస్ ఆర్మీని లింకులు ఉండొచ్చంటూ బ్రిట‌న్‌కు చెందిన డెయిల్ మెయిల్ సంచలన కథనం రాయగా, యూఎస్ మాజీ మంత్రి మైక్ పాంపియో ఆ విషయాన్ని నిర్ధారించారు.

వూహాన్ ల్యాబ్‌లో పీఎల్ఏ

వూహాన్ ల్యాబ్‌లో పీఎల్ఏ

వుహాన్ వైరాల‌జీ ల్యాబ్‌లో జరిగిన రహస్య పరిశోధనల్లో చైనీస్ ఆర్మీ.. ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ-పీఎల్ఏ'' కూడా పాలుపంచుకుందని, ల్యాబ్ టెస్టుల్లో సైనికులు కూడా భాగ‌స్వామ్యుల‌య్యార‌ని, వైర‌స్ ప‌రిశోధ‌న‌ల‌తో పాటు సైనిక కార్య‌క‌లాపాలు కూడా రహస్యంగా సాగాయని మైక్ పాంపియో చెప్పారు. డైలీ మెయిల్ కథనంపై ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయనీ కామెంట్లు చేశారు. పీఎల్ఏ సైన్యంతో ఆ ల్యాబ్‌లో ఏం చేశారో చెప్ప‌డానికి చైనా ఇష్టపడటంలేదని, అస‌లు ఎలాంటి ప‌రిశోధ‌న‌లు జ‌రిగాయో కూడా చెప్ప‌డంలేదని, ఆ ల్యాబ్‌లోపలికి వెళ్లేందుకు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు కూడా అవ‌కాశం ఇవ్వ‌లేదని పాంపియో పేర్కొన్నారు.

అమెరికా నిపుణుల వార్నింగ్..

అమెరికా నిపుణుల వార్నింగ్..


విరుగుడు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చి ప్రస్తుతానికి కొవిడ్ ఉధృతి తగ్గినా, అసలు కరోనా వైరస్ పుట్టుపూర్వోత్రాలు, మూలాలు వెల్లడి కాకుంటే రాబోయే రోజుల్లో ఏమైనా జరగొచ్చని, కొత్త విపత్తులు రాబోవనడానికి గ్యారంటీ ఏదీ లేదని అమెరికాకు చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ హయాంలో ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్(ఎఫ్‌డీఏ) క‌మిష‌న‌ర్‌గా పనిచేసి, ఇప్పుడు ఫైజ‌ర్ కంపెనీ బోర్డులో స‌భ్యుడిగా కొన‌సాగుతోన్న స్కాట్ గాట్లిబ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా విష‌యంలో ప్రపంచ శాస్త్ర‌వేత్త‌ల‌ను చైనా క‌నిక‌ట్టు చేశారని, వైహాన్ ల్యాబ్ నుంచే వైర‌స్ లీకైన‌ట్లు చాలా మంది నిపుణులు భావిస్తున్నార‌ని, దీంతో చైనా వ‌త్త‌డికి లోన‌వుతోందని ఆయన పేర్కొన్నారు. పంగోలిన్స్ నుంచి మ‌నుషుల‌కు వైర‌స్ పాకిన‌ట్లు చైనా చెప్పుకొచ్చినా.. దీంట్లో వాస్త‌వం లేద‌న్న అభిప్రాయాన్ని ప్రొఫెస‌ర్ పెట్రోస్కీ వ్య‌క్తం చేశారు.

  Coronavirus In India: కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల !
  భవిష్యత్తులో కోవిడ్‌-26, కోవిడ్‌-32...

  భవిష్యత్తులో కోవిడ్‌-26, కోవిడ్‌-32...

  ‘‘కరోనా వైర‌స్ పుట్టుక‌పై ద‌ర్యాప్తు చేసిన డ‌బ్ల్యూహెచ్‌వో.. ఆ వైర‌స్ వూహాన్ ల్యాబ్ నుంచి లీకైన‌ట్లు ఆధారాలు లేవ‌ని స్ప‌ష్టం చేసినప్పటికీ ప్రపంచం నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి, బెదిరించైనాసరే, చైనాలో సుదీర్ఘ కాలం పాటు విచార‌ణ చేప‌ట్టేలా, వూహాన్ ల్యాబ్ లోని ఇతర శాస్త్ర‌వేత్త‌ల‌ను అనుమ‌తించేలా చేయాలి. అప్పుడు సైంటిస్టులు, ఎపిడ‌మాల‌జిస్ట్‌లు, వైరాల‌జిస్టులు, బ్యాట్ ఎకాల‌జిస్ట్ ప‌రిశోధ‌కులు వూహాన్ లో, హుబే ప్రావిన్సులో కనీసం 6 నెలలు తిష్టవేస్తేగానీ కరోనా మూలాలు కనిపెట్టలేం. ఇదేదే అమెరికా ఇగోకి సంబంధంచిన వ్యవహారం కాదు. క‌రోనా మ‌హ‌మ్మారి ఎలా పుట్టిందో తెలియ‌కుండా భ‌విష్య‌త్తులో సంభ‌వించే వ్యాధులను ప‌సిగట్టలేం. కోవిడ్‌19 మూలాలను కనిపెట్టకపోతే కోవిడ్‌-26, కోవిడ్‌-32 వ‌చ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు'' అని టెక్సాస్ చిల్డ్ర‌న్ హాస్పిట‌ల్ కో డైర‌క్ట‌ర్ పీట‌ర్ హోటెజ్ అన్నారు.

  English summary
  Former Secretary of State Mike Pompeo said that the Wuhan Institute of Virology (WIV) was engaged in military activity alongside its civilian research -- amid renewed scrutiny of the theory that the Covid-19 pandemic emerged from the secretive lab. The world needs the cooperation of the Chinese government to trace the origins of Covid-19 and prevent future pandemic threats, two leading U.S. disease experts said. "There's going to be Covid-26 and Covid-32 unless we fully understand the origins of Covid-19," Scott Gottlieb said.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X