వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా జన్మస్థానం: వుహాన్‌లో నైట్ క్లబ్స్, పబ్స్ ఫుల్ ప్యాక్: నైట్ లైఫ్‌ ఎంజాయ్: మాస్కుల్లేకుండా

|
Google Oneindia TeluguNews

బీజింగ్: ప్రపంచానికి చావును సరికొత్తగా పరిచయం చేసిన కరోనా వైరస్‌కు జన్మనిచ్చినట్టుగా భావిస్తోన్న నగరం.. చైనాలోని వుహాన్. హ్యూబే ప్రావిన్స్‌లో గల ఈ సిటీలోని ఫిష్ మార్కెట్ నుంచి కరోనా పుట్టుకొచ్చిందనే వాదన ఉంది. దీన్ని చైనా అంగీకరించకపోయినప్పటికీ.. వాస్తవం అదే. వుహాన్‌లో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్నీ తన గుప్పిట్లో బంధించింది. అగ్రరాజ్యాలను గడగడలాడిస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ దాని తీవ్రత పెరుగుతోందే తప్ప.. తగ్గే సూచనలేవీ ఇప్పట్లో కనిపించేలా లేదు.

వైఎస్ జగన్ దిద్దుబాటు: చంద్రబాబు హయాంలో కూల్చేసిన దేవాలయాల పునర్నిర్మాణం?:వైఎస్ జగన్ దిద్దుబాటు: చంద్రబాబు హయాంలో కూల్చేసిన దేవాలయాల పునర్నిర్మాణం?:

 వుహాన్ మెరుగ్గా..

వుహాన్ మెరుగ్గా..

కరోనా వైరస్ వ్యాప్తి చెందిన దేశాల్లోనే పరిస్థితి ఇంత తీవ్రంగా ఉందీ అంటే.. ఆ మహమ్మారి ఎపిక్ సెంటర్ వుహాన్‌లో ఇంకెంత దుర్భరంగా ఉండొచ్చనే అనుమానాలు తలెత్తడం ఎంత సహజమో.. వుహాన్ ప్రజల స్థితిగతులు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకునే ఆసక్తి కలగడమూ అంతే సహజం. కరోనా బారిన పడిన దేశాలు, నగరాలతో పోల్చుకుంటే.. వుహాన్ ఎంతో మెరుగ్గా ఉంటోంది. అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి ముందునాటి పరిస్థితులు వుహాన్‌లో ఏర్పడ్డాయి. మాస్కులు లేకుండా, భౌతిక దూరాన్ని పాటించకుండా తిరిగేస్తున్నారు అక్కడి జనం.

నైట్ క్లబ్స్ ఫుల్ ప్యాక్..

నైట్ క్లబ్స్ ఫుల్ ప్యాక్..

వుహాన్‌లోని నైట్ క్లబ్బులన్నీ ఫుల్ ప్యాక్ అవుతున్నాయి. వీకెండ్ రోజుల్లో నైట్ క్లబ్బులు, పబ్బులు స్థానిక యువతతో నిండిపోతున్నాయి. నైట్ లైఫ్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు వుహాన్ యువత. మాస్కులు ధరించకుండా క్లబ్బులు, పబ్బులకు పరుగులు తీస్తున్నారు. భౌతిక దూరాన్ని పాటించట్లేదు. డాన్స్ ఫ్లోర్ల మీద చిందులు వేస్తున్నారు. హగ్స్‌తో హద్దులు మీరుతున్నారు. సుమారు 11 మిలియన్ల జనాభా ఉన్న వుహాన్‌లో పదుల సంఖ్యలో పబ్బులు, నైట్ క్లబ్బులు ఉన్నాయి. కరోనా వ్యాప్తి చెందిన తరువాత అవన్నీ మూతపడ్డాయి. వాటిని తెరవడానికి స్థానిక ప్రభుత్వం తాజాగా అనుమతులు ఇవ్వడంతో మళ్లీ పాత కళను సంతరించుకున్నాయి.

 మాస్ టెస్టింగులు..

మాస్ టెస్టింగులు..

ప్రస్తుతం వుహాన్‌లో కొత్తగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావట్లేదు. ఈ ఏడాది మే నుంచి వుహాన్‌లో మాస్ టెస్టింగులను నిర్వహిస్తోంది ప్రభుత్వం. సామాజిక వ్యాప్తి లేదని నిర్ధారించారు. 33 రోజులుగా వుహాన్‌లో కొత్తగా ఏ ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. దీనితో.. కరోనాను నిర్మూలించినట్లుగా భావిస్తున్నారు అక్కడి అధికారులు. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయనప్పటికీ.. నైట్ క్లబ్బులు, పబ్బులను పునఃప్రారంభించడానికి అనుమతి ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వచ్చే నవంబర్ నాటికి వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తుందని వుహాన్ స్థానిక అధికారులు చెబుతున్నారు.

చైనాలో అయిదు వేలను దాటని కరోనా మరణాలు..

మిగిలిన దేశాలతో పోల్చుకుంటే.. చైనాలో కరోనా వైరస్ మిగిల్చిన విధ్వంసం, ప్రాణనష్టం నామమాత్రమే అనడంలో సందేహాలు అక్కర్లేదు. మొత్తం కరోనా వైరస్ కేసులు లక్షను కూడా దాటలేదు. కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య అయిదు వేల లోపే. ఇప్పటిదాకా కరోనా వల్ల 4634 మరణాలు చైనాలో నమోదు అయ్యాయి. మొత్తం కేసులు 85,291 కాగా.. 80,484 మంది రికవర్ అయ్యారు. ప్రస్తుతం అక్కడ ఉన్న యాక్టివ్ కేసులు 173 మాత్రమే. చైనా ఏ వ్యూహాన్ని అనుసరించిందో గానీ.. కరోనాను శరవేగంగా కట్టడి చేయగలిగింది. వ్యాప్తి చెందకుండా అడ్డుకోగలిగింది.

English summary
While rest of the world is still struggling with the pandemic of Coronavirus, the epicentre in China, Wuhan has returned back to normal. The nightclubs have reopened their dancefloor after no new cases were reported in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X