• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా విలయంలో చైనా అద్భుతం -ఆకలి కేకలు సమాప్తం -కడు పేదలు లేరంటూ జిన్‌పింగ్‌ ప్రకటన

|

అక్కడ పుట్టిన కరోనా మహమ్మారి గ్లోబల్ గా ఇప్పటికే 11.4కోట్ల మందిని కాటేసింది.. ఏకంగా 25లక్షల మందిని బలితీసుకుంది.. భారత్, అమెరికా సహా బడా దేశాలన్నీ ఆర్థికంగా దెబ్బతిన్నాయి.. అయినాసరే ఈ విలయ కాలంలో చైనా అద్భుతాన్ని సాధించగలిగింది. తమ దేశంలో ఇక ఆకలి కేకలు వినబడవని, కడు పేదలు మచ్చుకైనా కనిపించబోరని డ్రాగన్ సగర్వంగా ప్రకటించుకుంది. వివరాల్లోకి వెళితే..

ys sharmila పార్టీలోకి ఇద్దరు మాజీ మంత్రులు -ఒకరు ఫైర్ బ్రాండ్ -ఉద్యమాల పురిటిగడ్డ నుంచి..ys sharmila పార్టీలోకి ఇద్దరు మాజీ మంత్రులు -ఒకరు ఫైర్ బ్రాండ్ -ఉద్యమాల పురిటిగడ్డ నుంచి..

పేదరికంపై సంపూర్ణ విజయం..

పేదరికంపై సంపూర్ణ విజయం..

చైనా మరో ఘనత సాధించినట్లు ప్రకటించింది. తమ దేశంలో కడు పేదలు ఎవరూ లేరని అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌ గురువారం అధికారికంగా ప్రకటించారు. పేదరికంపై సంపూర్ణ విజయం సాధించినట్లు ఆయన బీజింగ్‌లో ఘనంగా ప్రకటించారు. ఈ బృహత్తర కార్యక్రమంలో దేశం విజయం సాధించడానికి కృషి చేసిన 1,981 మందికి, 1,501 సంస్థలకు ఆయన రిప్రజెంటేటీవ్స్‌ ఆఫ్‌ నేషనల్‌ హానరీ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ అవతరించి మరో నాలుగు నెలల్లో వందేళ్లు పూర్తవుతున్న సమయంలో ఈ ప్రకటన వెలువడటం ప్రాధాన్యం సంతరించుకొంది.

 మానవ చరిత్రలోనే అద్భుతం..

మానవ చరిత్రలోనే అద్భుతం..

దేశం నుంచి కడు పేదరికాన్ని పూర్తిగా రూపుమాపడం అనే ప్రక్రియను ‘మానవ చరిత్రలోనే ఒక అద్భుతం' అని చైనా అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. ప్రస్తుతం ఉన్న ప్రమాణాల ప్రకారం 832 కౌంటీలను, 1,28,000 గ్రామాలను , దాదాపు 10 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చినట్లు ఆ పత్రిక పేర్కొంది. రోజువారీ ఆదాయం 2.30డాలర్ల కంటే తక్కువ ఉన్న వారిని చైనాలో దారిద్యరేఖకు కింద ఉన్నట్లు భావిస్తారు. ఇది పేద దేశాలకు ప్రపంచ బ్యాంక్‌ సూచించిన 1.90 డాలర్ల రోజువారీ ఆదాయం కంటే కొంచెం ఎక్కువ. కానీ..

 చైనాలో లెక్కలు అంతేమరి..

చైనాలో లెక్కలు అంతేమరి..

అత్యధిక ఆదాయం ఉన్న దేశాలకు ప్రపంచ బ్యాంక్‌ నిర్దేశించిన రోజువారీ ఆదాయ ప్రామాణిక మొత్తం 5.50 డాలర్ల కంటే చైనాలో గణాంకాలు చాలా తక్కువ. చైనాది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. వాస్తవానికి చైనాలో పేదరిక నిర్మూలన ఉద్యమంలో వేలకొద్దీ అక్రమాలు జరిగినట్లు కేసులు నమోదయ్యాయి. అధికారులే వారి చుట్టాలను, బంధువులను పేదలుగా ప్రభుత్వ నిధులను మళ్లించడం అక్కడ సర్వసాధారణమని యునివర్శిటీ ఆఫ్‌ వెస్టర్న్‌ ఆంట్రియో ప్రొఫెసర్‌ టెర్రీ పేర్కొన్నారు. దీనికి తోడు దారిద్యరేఖ ప్రామాణిక మొత్తం జాతీయ ఆదాయ సగటుతో పోలిస్తే చాలా తక్కువ. ఇప్పటికీ చైనాలో 13శాతం మంది పేదరికంలో ఉండే అవకాశం ఉందని టెర్రీ వివరించారు.

 సంస్కరణలు ఫలించాయా?

సంస్కరణలు ఫలించాయా?

పేదరికం లెక్కలు వేయడానికి చైనా అధికారులు ఇంటింటికీ తిరిగి ఆదాయం, ఇంటి పరిస్థితులు, ఆరోగ్యబీమా, పాఠశాల మానేసిన వారిని గుర్తించి.. మెరుగుపర్చారు. ఇప్పుడు చైనాలో ప్రతి ఒక్కరూ పాఠశాలకు వెళ్లాల్సిందేనని సౌత్‌చైనా మార్నింగ్‌పోస్టు పేర్కొంది. దీంతోపాటు శిశుమరణాలు కూడా గణనీయంగా తగ్గినట్లు ఇటీవల ఐరాస పేర్కొంది. చైనాలో 1970లో ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. నాటి నుంచి 800 మిలియన్ల మందిని పేదరికం నుంచి బయటవేసినట్లు ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంది. కమ్యూనిస్టు దేశమే అయినప్పటికీ, పెట్టుబడిదారీ విధానానికి ఏమాత్రం తీసిపోని విధంగా చైనాలో పాలన, సంస్కరణల అమలు సాగుతుందన్న సంగతి తెలిసిందే.

మోదీ సర్కార్ మరో సంచలనం -న్యూస్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా, ఓటీటీలకు కళ్లెం -24 గంటల్లో తొలగించాలిమోదీ సర్కార్ మరో సంచలనం -న్యూస్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా, ఓటీటీలకు కళ్లెం -24 గంటల్లో తొలగించాలి

English summary
The ruling Communist Party is celebrating the official end of extreme poverty in China with a propaganda campaign that praises President Xi Jinping’s role, part of efforts to cement his image as a history-making leader who is reclaiming his country’s rightful place as a global power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X