వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుద్ధం వద్దు -ఇద్దరం గెలుద్దాం -చైనా చీఫ్ జిన్‌పింగ్ అనూహ్య సందేశం -జోబైడెన్‌కు విషెస్

|
Google Oneindia TeluguNews

సుదీర్ఘంగా మూడు వారాల పాటు సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో.. చివరికి 8కోట్ల పైచిలుకు ఓట్లు, 303 సీట్లు సాధించిన జోబైడెన్ ను అధికారికంగా విజేతగా ప్రకటించిన తర్వాతగానీ చైనా స్పందించింది. భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ బైడెన్ కు శుభాకాంక్షలు చెప్పినా.. తుతి ఫలితాల కోసం ఎదురు చూసిన డ్రాగన్ ఎట్టకేలకు ముందుకొచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ ను అభినందిస్తూ చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ బుధవారం సందేశం పంపారు. అయితే ఆ సందేశం ఆసాంతం సంచలన రీతిలో సాగిందిలా..

Recommended Video

Xi Jinping Congratulates Joe Biden, Hopes for ‘Win-Win’ China-US Ties

తిరుపతి: పోటీపై పవన్ కల్యాణ్ ట్విస్ట్ -టికెట్ కోసమే ఢిల్లీకి రాలేదు -టార్గెట్ జగన్ -2రోజుల్లో ఫైనల్తిరుపతి: పోటీపై పవన్ కల్యాణ్ ట్విస్ట్ -టికెట్ కోసమే ఢిల్లీకి రాలేదు -టార్గెట్ జగన్ -2రోజుల్లో ఫైనల్

యూఎస్-చైనా భాయి భాయి

యూఎస్-చైనా భాయి భాయి

వ్యాపార, వాణిజ్య, రక్షణ రంగాలకు సంబంధించి అమెరికా-చైనా మధ్య సంబంధాలు ట్రంప్ హయాంలో తీవ్రంగా దెబ్బతినడం, ఒక దశలో యుద్ధం చేసుకునే స్థాయికి ఉద్రిక్తతలు పెరగడం, బైడెన్ గెలిస్తే చైనా గెలిచినట్లేనని ట్రంప్ ఆరోపించడం తదితర పరిణామాల నేపథ్యంలో అమెరికా ఎన్నికలపై చైనా ఆచితూచి వ్యవహరించింది. అధికార మార్పిడికి సిద్ధమంటూ ప్రెసిడెంట్ ట్రంప్ సంకేతాలిచ్చిన తర్వాతగానీ చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ స్పందించారు. సూపర్ పవర్ స్థానం కోసం పరోక్ష యుద్ధానికి పాల్పడకుండా.. సామరస్యంతో, సహోదర భావంతో కలిసుందామంటూ అమెరికాను చైనా కోరింది. అంతేనా,

బీజేపీ మాస్టర్ స్ట్రోక్: సీఎం కేసీఆర్‌పై స్వామిగౌడ్ సంచలన వ్యాఖ్యలు -నడ్డా సమక్షంలో కమలతీర్థంబీజేపీ మాస్టర్ స్ట్రోక్: సీఎం కేసీఆర్‌పై స్వామిగౌడ్ సంచలన వ్యాఖ్యలు -నడ్డా సమక్షంలో కమలతీర్థం

ప్రపంచం మేలు కోరే పెద్దలుగా..

ప్రపంచం మేలు కోరే పెద్దలుగా..

జోబైడెన్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనుండటంతో.. అమెరికా-చైనా మధ్య సంబంధాలు ఆరోగ్యకరంగా, సుస్థిరంగా ముందుకు సాగుతాయని జిన్ పింగ్ ఆకాంక్షించారు. ‘‘మన రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు కేవలం పరస్పర ప్రయోజనాల కోసమే కాదు సుమా.. యావత్ ప్రపంచానికి మేలు కూడా ఇందులో దాగుంది. అంతర్జాతీయ సమాజపు ఉమ్మడి ప్రయోజనాలన్నీ మన స్నేహంపైనే ఆధారపడి ఉన్నాయని మరువొద్దు'' అని చైనా చీఫ్ గుర్తుచేశారు. ఇంకా,

విన్ -విన్ ఫార్ములా

విన్ -విన్ ఫార్ములా

బైడెన్ పాలనలో అమెరికాతో చైనా సుహృద్భావ సంబంధాలను కోరుకుంటోందని చెప్పిన జిన్ పింగ్.. అందుకోసం ‘విన్ -విన్' ఫార్ములాను ప్రతిపాదించారు. వాణిజ్య, రక్షణ, దౌత్య వ్యవహారాల్లో ఒకరు ఓడటం, మరొకరు గెలవడం అనే విధానాలు కాకుండా, ఇద్దరికీ ప్రయోజనం కలిగేలా (విన్-విన్) వ్యవహరిద్దామని బైడెన్ కు పంపిన సందేశంలో రాసుకొచ్చారు. ‘‘ఇరుపక్షాలు మధ్య ఘర్షణలు, సంఘర్షణలు వద్దేవద్దు. పరస్పర గౌరవం, విన్-విన్ విధానం, సమస్యల పరిష్కారంలో సానుకూలత, వివాదాల ముగింపులో ఓపికగా వ్యవహరిద్దామని జిన్ పింగ్ కోరారు. చైనా వైస్ ప్రెసిడెంట్ వాంగ్ షాన్ సైతం అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎలక్ట్ కమలా హ్యారిస్ కు అభినందనలు తెలిపారు.

English summary
chinese President Xi Jinping on Wednesday congratulated US President-elect Joe Biden on winning the presidential election, expressing hope that the two countries will uphold the spirit of non-confrontation and advance the healthy and stable development of bilateral ties, official media reported. President Xi sent a message to Biden to congratulate him on his election as US president, becoming one of the last major leaders to congratulate the Democratic presidential candidate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X