వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొవిడ్-19 వ్యాక్సిన్‌: చైనా అనూహ్యం -భారత్ సహకారం కోరిన జిన్‌పింగ్ -సాంప్రదాయ ఔషధాలతో..

|
Google Oneindia TeluguNews

కరోనా విలయానికి కర్త, కర్మ, క్రియగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా.. మహమ్మారిని అరికట్టే విషయంలో భారత్ సహకారాన్ని కోరింది. కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీతోపాటు సాంప్రదాయ ఔషధాలతో వైరస్ ను తుదముట్టించగలిగే అవకాశాలను కలిసి పరిశోధిద్దామని పిలుపునిచ్చింది. చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ఈ మేరకు మంగళవారం బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో కీలక ప్రతిపాదనలు చేశారు. పింగ్ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ లభిస్తేగనుక దేశాల మధ్య భాగస్వామ్యంతో రూపొందనున్న తొలి వ్యాక్సిన్ తయారుకానుంది.

Recommended Video

COVID-19 Vaccine : Xi Jinping కీలక ప్రతిపాదనలు.. దేశాల మధ్య భాగస్వామ్యంతో తొలి వ్యాక్సిన్!

చైనా జిన్‌పింగ్‌తో మోదీ ఫేస్ టు ఫేస్ -టెర్రర్ చర్యల్ని ఉతికారేసిన ప్రధాని - పోస్ట్ కొవిడ్ స్ట్రాటజీచైనా జిన్‌పింగ్‌తో మోదీ ఫేస్ టు ఫేస్ -టెర్రర్ చర్యల్ని ఉతికారేసిన ప్రధాని - పోస్ట్ కొవిడ్ స్ట్రాటజీ

జిన్ పింగ్ కీలక ప్రసంగం..

జిన్ పింగ్ కీలక ప్రసంగం..

బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా సభ్యదేశాలుగా ఉన్న బ్రిక్స్ కూటమి 12వ శిఖరాగ్ర సదస్సులో భాగంగా మంగళవారం ఐదు దేశాల అధినేతలు బొల్సనారో, పుతిన్, మోదీ, జిన్ పింగ్, సిరిల్ రమఫొసాలు తమ సందేశాలను వినిపించారు. కరోనా కారణంగా ఈ ఏడాది రష్యా ఆతిథ్యమిస్తోన్న సదస్సును వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు. కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో భారత ఫార్మా దిగ్గజాలు ముందంజలో ఉన్నాయని మోదీ పేర్కొనగా, ఆ తర్వాత మాట్లాడిన జిన్ పింగ్ కీలక ప్రతిపాదనలతో ప్రసంగించారు..

భారత్ సహకారమే కీలకం..

భారత్ సహకారమే కీలకం..

‘కరోనా వైరస్ కు విరుగుడు వ్యాక్సిన్లు కనిపెట్టే ప్రయత్నాల్లో భాగంగా చైనాకు చెందిన పలు కంపెనీలు.. రష్యా, బ్రెజిల్ సంస్థల భాగస్వామ్యంతో పనిచేస్తున్నాయి. అయితే దేశాధినేతలుగా మనం కూడా మరిన్ని ఉపశమన మార్గాలను అన్వేషించాలి. బ్రిక్స్ దేశాల సారధ్యంలో కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీకి నేను ప్రతిపాదన చేస్తున్నాను. అదే సమయంలో బ్రిక్స్ దేశాల సింఫోజియంను ఏర్పాటు చేయడం ద్వారా సంప్రదాయ ఔషధాలతో వైరస్ ను కట్టడిచేసే మార్గాలను అణ్వేషిస్తే మంచిదని ప్రతిపాదిస్తున్నాను. ఈ రెండు ప్రతిపాదనలకు భారత్ సహకారం ఎంతో కీలకమైనది. అదే సమయంలో బ్రిక్స్ దేశాలన్నీ ఈ దిశగా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను''అని జిన్ పింగ్ అన్నారు.

చైనా జాతీయ కేంద్రంలో రీసెర్చ్..

చైనా జాతీయ కేంద్రంలో రీసెర్చ్..

బ్రిక్స్ దేశాలన్నీ కొవిడ్ వ్యాక్సిన్ తయారీకి అంగీకరిస్తే గనుక.. చైనాలోని జియామెన్‌ నగరంలోని ఆవిష్కరణ కేంద్రంలో సంబంధిత రీసెర్చ్ కోసం చైనా జాతీయ కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తామని జిన్ పింగ్ చెప్పారు. విభేదాలను అధిగమించి, ఐక్యంగా పనిచేయడం ద్వారా వైరస్ ను ఓడించగలమని, తద్వారా బ్రిక్స్ దేశాలు ప్రపంచానికి కూడా దిక్సూచిగా పనిచేయాలని తాను కోరుతున్నట్లు జిన్ పింగ్ అన్నారు. బహుళవాదానికి మద్దతు, అమెరికా లాంటి దేశాల ఒత్తిడి ఒత్తిడికి లోను కాకుండా బ్రిక్స్ దేశాలు ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు జిన్ పింన్ చెప్పారు.

షాకింగ్: మరో బడా బ్యాంకు ఢమాల్ -లక్ష్మి విలాస్ బ్యాంక్‌ విత్ డ్రాలపై కేంద్రం సంచలన ఆంక్షలుషాకింగ్: మరో బడా బ్యాంకు ఢమాల్ -లక్ష్మి విలాస్ బ్యాంక్‌ విత్ డ్రాలపై కేంద్రం సంచలన ఆంక్షలు

English summary
Chinese President Xi Jinping on Tuesday offered to cooperate with India and other BRICS nations in the development of vaccines against the coronavirus and called for holding a symposium by the five-member bloc on traditional medicine to explore its role in the COVID-19 prevention and treatment. I propose we convene a BRICS symposium on traditional medicine to explore its role in coronavirus prevention and treatment, Xi said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X