వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.13 కోట్లకు పైగా వదులుకున్న యాహూ సీఈవో

యాహూ సీఈవో మరిస్సా మేయర్ ఈ ఏడాది బోనస్ వదులుకునేందుకు అంగీకరించారు. యాహూలో గతంలో లక్షలాది ఖాతాలు హ్యాక్ అయిన ఘటన పైన దర్యాఫ్తు అనంతరం బోర్డు మరిస్సా బోనస్‌ను నిలిపివేయాలని నిర్ణయించింది.

|
Google Oneindia TeluguNews

శాన్ ఫ్రాన్సిస్కో: యాహూ సీఈవో మరిస్సా మేయర్ ఈ ఏడాది బోనస్ వదులుకునేందుకు అంగీకరించారు. యాహూలో గతంలో లక్షలాది ఖాతాలు హ్యాక్ అయిన ఘటన పైన దర్యాఫ్తు అనంతరం బోర్డు మరిస్సా బోనస్‌ను నిలిపివేయాలని నిర్ణయించింది. అందుకు ఆమె అంగీకరించారు.

హ్యాకింగ్ పైన బోర్డు జరిపిన దర్యాప్తులో కంపెనీ అసమర్థంగా వ్యవహరించిందని తేలింది. దీంతో ఈ పొరపాటుకు ఆమె బాధ్యత తీసుకున్నారు. 2014లో జరిగిన హ్యాకింగ్‌ ఘటనపై మరిస్సా మేనేజ్‌మెంట్‌ విచారణ ఆలస్యం చేసిందని తెలిపింది.

<strong>హెచ్1బి షాక్: వేలాది మంది తెలుగు విద్యార్థులకు షాక్ తప్పదా?</strong>హెచ్1బి షాక్: వేలాది మంది తెలుగు విద్యార్థులకు షాక్ తప్పదా?

Yahoo CEO Marissa Mayer Loses Bonus And Stock Award Over Security Breach

తాను కంపెనీ సీఈఓని అని, తన హయాంలో ఈ ఘటన జరిగిందని, కాబట్టి ఈ ఏడాది తన బోనస్‌ను, ఈక్విటీ గ్రాంట్‌ను వదులుకునేందుకు ఒప్పుకుంటున్నానని మరిస్సా తెలిపారు. ఆమెకు 2 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.13.34కోట్లు) బోనస్‌ రావాల్సి ఉంటుంది.

తన బోనస్‌ను కంపెనీలో కష్టపడి పని చేస్తున్న ఉద్యోగులకు పంచాలని కోరారు. ఆమె 2012 నుంచి యాహూ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. హ్యాకింగ్‌ ఘటనపై దర్యాప్తు అనంతరం యాప్‌ టాప్‌ లాయర్‌ రోనాల్డ్‌ బెల్‌ బుధవారం రాజీనామా చేశారు.

English summary
CEO Marissa Mayer will not be paid her annual bonus, and will not receive a stock award after a Yahoo Inc. investigation found that two security breaches at the company were mishandled by senior executives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X