• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Year Ender 2020 : లెబనాన్‌‌ మహా విషాదం.. ప్రపంచ చరిత్రలో అత్యంత శక్తివంతమైన నాన్ న్యూక్లియర్ పేలుళ్లు..

|

ప్రపంచంపై కరోనా వైరస్ పంజా... ఆసియా-తూర్పు ఆఫ్రికా-ఇండియా-మిడిల్ ఈస్ట్‌పై మిడతల దండయాత్ర.. ఇండోనేషియా వరదలు,ఆస్ట్రేలియాలో కార్చిచ్చు... ఇలా 2020లో ఎన్నో ఉపద్రవాలు మానవాళిని వణికించాయి. ఇదే 2020లో లెబనాన్ దేశంలోని బీరుట్‌లో సంభవించిన పేలుళ్లు ఆ దేశానికి మహా విషాదాన్ని మిగిల్చాయి. బీరుట్ ఓడరేవు సమీపంలోని ఓ గోదాములో నిల్వ ఉంచిన 2750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ కారణంగా భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 204 మంది మృతి చెందగా 6500 మంది గాయపడ్డారు. దాదాపు 3లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 15బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం జరిగింది. గడిచిన దశాబ్దంన్నర వరకు అంతర్యుద్దాలతో సతమతమవుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న లెబనాన్‌కు బీరుట్ పేలుళ్లు తీరని నష్టాన్ని మిగిల్చాయి.

పేలుళ్ల తీవ్రత...

పేలుళ్ల తీవ్రత...

లెబనాన్ రాజధాని బీరుట్‌ ఓడరేవుకు సమీపంలోని హ్యాంగర్ 12 గోడౌన్‌లో ఈ ఏడాది అగస్టు 4న భారీ పేలుళ్లు సంభవించాయి. లెబనాన్‌కు 240కి.మీ దూరంలోని సైప్రస్ దీవుల వరకూ ఈ పేలుళ్ల శబ్దాలు వినిపించాయంటే దీని ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రిక్టర్ స్కేలుపై 3.3 భూకంప తీవ్రతకు ఈ పేలుళ్లు సమానమని గుర్తించారు. ప్రపంచ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన నాన్ న్యూక్లియర్ పేలుళ్లుగా వీటిని తేల్చారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల చాలా భవనాలు కుప్పకూలాయి. ఈ పేలుళ్లతో అక్కడ నెలకొన్న భీతావహ దృశ్యాలు మరుభూమిని తలపించాయి. హ్యాంగర్ గౌడౌన్‌లో అమ్మోనియం నైట్రేట్‌ను,బాణసంచాను పక్కపక్కనే నిల్వ చేయడం ఈ పేలుళ్లకు కారణంగా అక్కడి అధికారులు చెప్పారు. అయితే పేలుళ్లకు కచ్చితమైన కారణమేంటన్న దానిపై ఇప్పటికీ విచారణ జరుగుతూనే ఉంది.

ఏడేళ్లుగా గోడౌన్‌లోనే....

ఏడేళ్లుగా గోడౌన్‌లోనే....

2013లో రష్యాకి చెందిన రోసస్ నౌకలో భారీగా అమ్మోనియం నైట్రేట్‌ను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన లెబనాన్ కస్టమ్స్ అధికారులు... అప్పట్లో దాన్ని సీజ్ చేసి హ్యాంగర్ 12లో నిల్వ చేశారు. అప్పటినుంచి అది హ్యాంగర్ 12 గోడౌన్‌లోనే ఉంది. ఇంత భారీ ఎత్తున అమ్మోనియం నైట్రేట్‌ను నిల్వ చేసిన అధికారులు... ఆ తర్వాత దాని గురించి పట్టించుకోలేదు. నిజానికి ఈ కెమికల్‌ను ప్రైవేట్ కంపెనీలకు అమ్మేయడమో లేక సైన్యానికి ఇవ్వడమో చేయాలని ప్రతిపాదిస్తూ డిసెంబర్ 5,2014, మే 6,2015,అక్టోబర్ 3, 3016 అక్టోబర్ 27,2017లో కస్టమ్స్ అధికారులు న్యాయమూర్తులకు లేఖలు రాశారు. అయితే ఆ లేఖలకు ఎటువంటి స్పందన లేకపోవడం.. ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ కెమికల్ గోడౌన్‌లోనే ఉండిపోయింది.

బాణసంచా నిల్వచేయడమే కారణం...

బాణసంచా నిల్వచేయడమే కారణం...


పైగా అదే గోడౌన్‌లో.. అమ్మోనియం నైట్రేట్‌కు పక్కనే 30 నుంచి 40 సంచుల బాణసంచాను నిల్వ చేసినట్లు అక్కడ పనిచేసే యూసుఫ్ షెహాదీ అనే కార్మికుడు వెల్లడించాడు. స్థానిక మీడియా ప్రకారం అగస్టు 4వ తేదీ సాయంత్రం 6.07గం. సమయంలో మొదటి పేలుడు సంభవించింది. ఆ తర్వాత 33-35సెకన్ల వ్యవధిలో మరో పేలుడు సంభవించింది. పేలుళ్ల ధాటికి లెబనాన్ నగరం మొత్తాన్ని నల్లటి పొగ కమ్మేసింది. పేలుళ్ల కారణంగా మొత్తం 204 మంది మరణించగా ఇందులో 22 దేశాలకు చెందినవారు ఉన్నారు. సుమారు 6500 మంది గాయపడగా ఇందులో 108 మంది బంగ్లాదేశీయులు ఉన్నారు. సుమారు 15 బిలియన్ల ఆస్తి నష్టం జరిగింది. నగరంలోని 90శాతం హోటల్స్ ధ్వంసమయ్యాయి. ఆస్పత్రులు కూడా ధ్వంసమవడంతో చాలామంది క్షతగాత్రులకు సకాలంలో చికిత్స కూడా అందలేని పరిస్థితి.

ఇదీ లెబనాన్ పరిస్థితి...

ఇదీ లెబనాన్ పరిస్థితి...

సిరియా ఆధిపత్యానికి వ్యతిరేకంగా లెబనాన్‌లో 1975, 2005లో చెలరేగిన అంతర్యుద్దం 2005లో సిరియన్ దళాలను ఆ దేశం నుంచి ఉపసంహరించుకునేంతవరకూ కొనసాగింది. సిరియా అనుకూల,వ్యతిరేక శిబిరాల మధ్య అసమ్మతి కారణంగా చాలాకాలం పాటు అక్కడ రాజకీయ వ్యవస్థలు స్తంభించిపోయాయి. సిరియా ఆధిపత్యం,ఆ దేశంతో విబేధాలతో కారణంగా... లెబనాన్ రాజధాని బీరట్,ఇరత ప్రాంతాల్లో ఎన్నోసార్లు దాడులు జరిగాయి.ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితుల్లో ఉన్న లెబనాన్ చరిత్రలో మొదటిసారిగా అప్పుల చెల్లింపులో చేతులెత్తేస్తున్నట్లుగా ఈ ఏడాది మార్చిలో ప్రకటించింది. ఇంతలోనే లెబనాన్ పేలుళ్లు సంభవించడం ఆ దేశాన్ని ఆర్థికంగా మరింత దెబ్బకొట్టాయి.

English summary
The explosion that happened in August in the Port of Beirut was one of the most powerful non-nuclear blasts in history - releasing enough energy in a matter of milliseconds to power over 100 homes for a year - according to a new assessment of the disaster in the Lebanese capital by researchers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X