• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

khiladi wife: భార్య నాటుకోడి, ప్రభుత్వ ఉద్యోగం, పిస్తా, బాదాం పప్పు, భార్య సినిమా హౌస్ ఫుల్,ముగ్గురు !

|

చెన్నై/ మదురై/ బెంగళూరు: ముద్దుముద్దుగా కళకలలాడే రత్నాలాంటి ఇద్దరు కుమారులతో కలిసి దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న చోట నాటుకోడి లాంటి భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని బాదం పప్పు, పిస్తా కోసం ఎగిరెగిరి పడింది. ఈ విషయం తెలిసిన భర్త భార్యను మందలించాడు. ఎలాగూ అందరికీ తెలిసిపోయిందని భర్త, పిల్లలను గాలికి వదిలేసిన అక్రమ సంబంధం కొనసాగిస్తున్న ప్రియుడితో ఎంజాయ్ చెయ్యడానికి భార్య అతనితో వెళ్లిపోయింది. నీ భార్య పరాయివాడితో వెళ్లిపోయిందని, నువ్వు మొగుడివా ? బ్రోకర్ వా ? అంటూ భర్తను చూసినవాళ్లు ఆడిపోసుకోవడంతో జీవితంపై విరక్తి చెందిన భర్త భార్య ప్రియుడిని కత్తితో పొడిచి ఇద్దరు కొడుకులను హత్య చేసి అతను ఆత్మహత్య చేసుకోవడంకలకలం రేపింది.

love marriage: ఆంటీకి 51, అబ్బాయికి 26, గ్రాండ్‌గా పెళ్లి, ఆంటీ ఆస్తులు అదుర్స్, గుర్రం ఎక్కాడు, అంతే !love marriage: ఆంటీకి 51, అబ్బాయికి 26, గ్రాండ్‌గా పెళ్లి, ఆంటీ ఆస్తులు అదుర్స్, గుర్రం ఎక్కాడు, అంతే !

 భార్య నాటుకోడి

భార్య నాటుకోడి

తమిళనాడులోని మదురై జిల్లా పాలమేడులోని బృందానగర్ లో కుమార్ (42), ఉషారాణి (35) దంపతులు నివాసం ఉంటున్నారు. కుమార్, ఉషారాణి దంపతులకు కుబేర పెరుంచోళన్ (8), సిద్దార్థ్ (6) అనే ఇద్దరు రత్నాలాంటి కుమారులు ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం వరకు కుమార్, ఉషారాణి దంపతులు కాపురం సవ్యంగానే సాగిపోయింది.

 ప్రభుత్వ ఉద్యోగంతో పాటుపడింది

ప్రభుత్వ ఉద్యోగంతో పాటుపడింది

కుమార్ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. పాలమేడు పట్టణ పంచాయితీలో ఉషారాణి పారిశుద్ద విభాగంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నది. తాను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నానని, నువ్వు చీప్ గా ఆటో డ్రైవర్ అని రెండు సంవత్సరాల నుంచి భర్త కుమార్ తో ఉషారాణి గొడవ చేసేది. ఇదే సమయంలో పట్టణ పంచాయితీలో సీనియర్ అధికారిగా పని చేస్తున్న కనకరాజ్ అనే ఉద్యోగితో కనకరాజ్ భార్య ఉషారాణి చనువుగా ఉండటం మొదలుపెట్టింది. ఇంట్లో ఉన్న బియ్యం గింజల కంటే బయట దోరుకుతున్న బాదాం పప్పు, పిస్తా కోసం భార్య ఉషారాణి పాకులాడింది.

 నాటుకోడికి పుంజు తగులుకుంది

నాటుకోడికి పుంజు తగులుకుంది

ఉషారాణితో చనువుగా ఉంటున్న కనకరాజు ఆమెను వలలో వేసుకున్నాడు. తరువాత కనకరాజు ఏం చూపించాడో ? ఏమో ? ఉషారాణి అతని వలలో పడిపోయింది. ప్రతిరోజు ప్రభుత్వ ఆఫీసులో ప్రియురాలు ఉషారాణికి బాదాం పప్పు, పిస్తా పెట్టిన ప్రియుడు కనకరాజ్ ఆమెను లొంగదీసుకున్నాడు. వచ్చే జీతంలో అర్దం డబ్బులు కనకరాజ్ జల్సాలకు తగలేస్తున్న ఉషారాణి అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. జీతం డబ్బులు ఏమవుతున్నాయి అని భర్త కుమార్ అడితే నా జీతం, నా ఇష్టం అంటూ ఉషారాణి ఇంట్లో రాక్షసిలాగా ప్రవర్తించేది.

 కనకరాజ్, రాణి 70 MM సినిమా హౌస్ ఫుల్

కనకరాజ్, రాణి 70 MM సినిమా హౌస్ ఫుల్

కనకరాజు, ఉషారాణి విచ్చలవిడిగా తిరగడంతో ఆ విషయం ఆమె భర్త కుమార్ కు తెలిసింది. నువ్వు పద్దతి మార్చుకోవాలని, ఇద్దరు పిల్లలు ఉన్నారని కుమార్ చాలాకాలం భార్యకు బుద్దిమాటలు చెప్పాడు. పేరుకు మాత్రమే ఉషారాణి, బుధ్దిమాత్రం వక్రబుద్ది కావడంతో ఆమె పద్దతి మార్చుకోలేదు. ఇంట్లో గొడవలు ఎక్కువ కావడంతో మూడు నెలల క్రితం భర్త కుమార్, ఇద్దరు పిల్లలను వదిలేసిన ఉషారాణి ఇంటి నుంచి వెళ్లిపోయి పుట్టింటిలో ఉంటూ కనకరాజ్ తో ఎంజాయ్ చేస్తోంది.

 నువ్వు మొగుడా ? బ్రోకరా

నువ్వు మొగుడా ? బ్రోకరా

నీ భార్య ఉషారాణి మిమ్మల్ని వదిలేసి వేరే వ్యక్తితో కులుకుతోందని, అసలు నువ్వు మగాడివేనా ? లేక నీ భార్యకు బ్రోకర్ వా ? అంటూ బంధువులు, చుట్టుపక్కల వాళ్లు కుమార్ ను ఆడిపోసుకున్నారు. చుట్టుపక్కల వాళ్లు, బంధువులు తనను, తన పిల్లలను చులకనగా మాట్లాడుతున్నారని కుమార్ నెల రోజుల నుంచి తీవ్ర ఆవేదనకు గురైనాడు. ఎలాగైనా భార్యను ఇంటికి పిలుచుకునిరావాలని ప్రయత్నించాడు.

 భర్త స్కెచ్ జస్ట్ మిస్

భర్త స్కెచ్ జస్ట్ మిస్

భార్యను ఇంటికి పిలుచుకుని రావడానికి వీలుకాకపోవడంతో రగిలిపోయిన కుమార్ కత్తి తీసుకుని రోడ్డు మీద వెలుతున్న భార్య ప్రియుడు కనకరాజ్ మీద దాడి చేశాడు. కనకరాజ్ కు తీవ్రగాయాలై ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. కనకరాజ్ మీద దాడి చేసిన కుమార్ ఇద్దరు కుమారులను పిలుచుకుని కులదైవం ఆలయానికి వెళ్లాడు.

 ఫ్యామిలీ ప్రాణాలు, కిలాడీ ఉద్యోగం పోయింది

ఫ్యామిలీ ప్రాణాలు, కిలాడీ ఉద్యోగం పోయింది

కులదైవం ఆలయంలో కూల్ డ్రింక్ లో విషం కలిపి ఇద్దరు కుమారులకు ఇచ్చి అతను తాగాడు. స్థానికులు విషయం గుర్తించి ముగ్గురిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై కుమార్, అతని ఇద్దరు కుమారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భర్త, ఇద్దరు పిల్లల ఆత్మహత్యకు కారణమైన కిలాడీ లేడీ ఉషారాణితో పాటు ఆమె ప్రియుడు కనకరాజ్ ఉద్యోగాలు శాశ్వతంగా ఊడిపోయాయి.

English summary
Year Ender 2020: Wifes illegal relationship, Husband killed two sons, and commits suicide due to wifes illegal relationship near Madurai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X