వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Year Ender 2020 : అంగారకుడిపై మూడు నీటి సరస్సులు.. ఈ ఏడాది పరిశోధనల్లో వెలుగులోకి...

|
Google Oneindia TeluguNews

ఖగోళం ఎప్పటికీ ఒక మిస్టరీ... విశ్వంతరాళం ఎన్నటికీ చిక్కని ఓ రహస్యం... ఏటా ఎన్నో పరిశోధనలు... ఎన్నో కొత్త విషయాలు వెలుగుచూస్తూనే ఉంటాయి. అంతులేని విశ్వాంతరాళాన్ని శోధించడం అంత సామాన్యమైన విషయం కాదు. అయినప్పటికీ ప్రపంచ శాస్త్రవేత్తలు అనంత విశ్వపు పుట్టుకను,అంతరిక్ష రహస్యాలను కనుగొనేందుకు నిరంతరం పరిశోధనలు జరుపుతూనే ఉంటారు. ఈ నేపథ్యంలో 2020లోనూ ఖగోళ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

Recommended Video

Mars : Top Scientific Discoveries In 2020 | 3 Lakes On Red Planet | Year Ender 2020
మూడు ఉప్పు నీటి సరస్సులు...

మూడు ఉప్పు నీటి సరస్సులు...

ఈ ఏడాది నవంబర్‌లో నేచర్ ఆస్ట్రానమీలో ఒక పరిశోధనా వ్యాసం ప్రచురితమైంది. అందులో అంగారకుడిపై కొత్తగా మరో మూడు ఉప్పు నీటి సరస్సులను గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. గతంలో గుర్తించిన పెద్ద నీటి సరస్సుకు పక్కనే వీటి జాడలను గుర్తించామన్నారు. ఈ మూడు సరస్సులు అంగారక ఉపరితలం కింద కప్పిపెట్టబడి ఉన్నట్లు గుర్తించడం గమనార్హం. వీటి విస్తీర్ణం దాదాపు 75వేల చదరపు కిలోమీటర్లు. అంటే జర్మనీ లాంటి దేశంలో ఐదో వంతు పరిమాణం. ఈ మూడింటిలో అతిపెద్దదైన సెంట్రల్ సరస్సు 30కి.మీ మేర విస్తరించింది. దీని చుట్టూ మూడు సరస్సులు కి.మీల కొద్ది వెడల్పుతో విస్తరించి ఉన్నాయి.

4.4బిలియన్ల క్రితం నుంచే నీరు..

4.4బిలియన్ల క్రితం నుంచే నీరు..

ఇదే ఏడాది జరిపిన మరో పరిశోధనలోనూ అంగారక గ్రహంపై నీరు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు,4.4బిలియన్ల సంవత్సరాల క్రితమే అక్కడ నీటి జాడ ఉందని కనుగొన్నారు. జపాన్‌లోని టోక్యో విశ్వ విద్యాలయ పరిశోధకుల బృందం ఈ సరికొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. గతంలోనూ ఎన్నో పరిశోధనలు అంగారకుడిపై నీరు ఉన్నట్లు ధ్రువీకరించినప్పటికీ... కొన్ని బిలియన్ల సంవత్సరాలుగా అక్కడ నీరు ఉన్నట్లు గుర్తించడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.

మానవ నివాస యోగ్యమేనా?

మానవ నివాస యోగ్యమేనా?

మానవ నివాసానికి అనుకూలమైన గ్రహం ఈ విశ్వంలో మరొకటి ఉందా అన్న ఖగోళ శాస్త్రవేత్తల పరిశోధనలు నిరంతరం కొత్త విషయాలను వెలుగులోకి తెస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో చాలాకాలంగా అంగారకుడిపై మానవ నివాస అనుకూలతలపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. నీటి జాడ ఉందంటే... అక్కడ జీవం ఉంటుందన్నది వాస్తవమని, కాబట్టి అంగారక గ్రహం ఆవాస యోగ్యమే అన్న వాదనకు శాస్త్రవేత్తల పరిశోధనలు బలం చేకూరుస్తూ వస్తున్నాయి.

English summary
Our universe is just like a mystery novel with a thriller 'whodunnit' plot. It's waiting to get demystified as scientists across the world continue to brainstorm the very existence and sustainability of life on Earth and even the presence of extraterrestrial matter floating in space. Is life possible beyond Earth? Is Big Bang the beginning of the universe? -- The year 2020 has seen some breakthrough discoveries and exciting revelations by scientists and researchers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X