వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా దాడులు: లాడెన్ రైట్‌హ్యాండ్ హతం

|
Google Oneindia TeluguNews

యెమన్: అమెరికా వైమానికి దళాలు జరిపిన దాడుల్లో యెమన్ ఆల్‌ఖైదా అధిపతి, బిన్ లాడెన్‌కు అతి సన్నిహితుడైన షేక్ అబు బాసిర్ నాజర్ అల్ వుహాయిషి హతమయ్యాడు. అతనితోపాటు మరో ఇద్దరు ఫైటర్లు కూడా మరణించారు.

కాగా, ఖస్సిమ్ అల్ రాయామీని కొత్త నాయకుడిగా నియమించినట్లు ఆన్‌లైన్లో విడుదలైన ఓ వీడియోలో ఖలేద్ ఓమర్ బటార్ఫి పేర్కొన్నారు. బిన్ లాడెన్‌కు నాజర్ ఎంతో సన్నిహితుడని, ఆప్ఘనిస్థాన్‌లో పేరుమోసిన వ్యక్తని ఆ వీడియోలో తెలిపారు.

Yemeni al-Qaeda leader 'killed in US air strike'

నాజర్ గతంలో జైలు జీవితం గడిపాడని, అతను ఇటీవల జరిగిన దాడుల్లోనూ తప్పించుకున్నారని చెప్పారు. యెమన్‌కు చెందిన నాజర్.. 2009 నుంచి యెమన్ ఆల్‌ఖైదా అధిపతిగా కొనసాగుతున్నారు. అతని వయస్సు 37ఏళ్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

ఐక్యరాజ్యసమితి 2010లో అతి ప్రమాదకరమైన వ్యక్తుల జాబితాలో నాజర్ పేరును చేర్చింది. 1990లో ఉగ్రవాద శిక్షణ తీసుకున్న నాజర్.. క్రమంగా ఒసామా బిన్ లాడెన్‌కు సన్నిహితుడయ్యాడు. దీంతో లాడెన్ తన ఆర్థిక, వ్యక్తిగత రహస్యాలను నాజర్ తో పంచుకునేవాడు.

అమెరికా భద్రతా దళాల కాల్పుల్లో బిన్ లాడెన్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, సెప్టెంబర్ 11, 2001 దాడుల తర్వాత నాజర్‌ అరెస్ట్ చేయబడ్డాడు. మూడేళ్లపాటు ఇరాన్‌లో జైలు శిక్ష అనుభవించాడు.

English summary
The head of al-Qaeda in Yemen, Sheikh Abu Basir Nasser al-Wuhaishi, was killed in a US air strike along with two other fighters in Yemen, an al-Qaeda spokesperson said in an online address.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X