వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెమెన్‌ని ఉరితీసింది ఆ తలారే! కూతుర్ని కలవకుండా

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమెన్‌కు గురువారం ఉదయం నాగపూర్ కేంద్ర కారాగారంలో ఉరిశిక్షను అమలు చేశారు. 257 మంది మృతికి ఇతడు కూడా కారణం. అయితే, మెమెన్‌ను ఉరి తీసింది అజ్మల్ కసబ్‌ను ముంబైలోని ఎరవాడ జైలులో ఉరి తీసిన తలారే.

అయితే, భద్రతా కారణాల వల్ల ఉరి తీసిన వ్యక్తి పేరు వెల్లడించలేదు. మెమెన్‌కు ఉరి కోసం పుణేలోని ఎరవాడ జైలు నుంచి 20 మంది సిబ్బంది వచ్చారు. అందులో అతను కూడా ఉన్నారు. ఆయనతో పాటు మరొక కానిస్టేబుల్ కూడా వారం రోజుల క్రితం నాగపూర్ వచ్చారు. శిక్షణ ఇప్పించారు.

Yerwada Man Who Hanged Yakub Memon, Executed Ajmal Kasab Too

యాకూబ్ మెమెన్ చివరి కోరిక తీరలేదు. చనిపోయే ముందు తన కూతురు జుబేదియాను చూడాలని ఉందని మెమెన్ తన చివరి కోరికను జైలు అధికారులకు చెప్పాడు. జైలు వద్దకు అతడి కుటుంబ సభ్యులు వచ్చారు. అయితే, అతని కూతురు మాత్రం రాలేదు.

వాస్తవానికి జైలు వద్దకు యాకూబ్ సోదరులు మాత్రమే వచ్చారు. అతడి కూతురు ముంబైలోనే ఉండిపోయింది. అనివార్య కారణాల వల్ల జుబేదియాను చూసే అవకాశం యాకుబ్ మెమెన్‌కు కలగలేదు. ఆమెతో ఫోనులో మాత్రం మాట్లాడే అవకాశాన్ని జైలు అధికారులు కల్పించారు.

English summary
Yakub Memon.. who was convicted for playing a crucial role in the 1993 Mumbai serial blasts.. was executed today by the same constable who had carried out the hanging of Pakistani terrorist Ajmal Kasab in Pune's Yerwada jail three years ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X