• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జపాన్ కొత్త ప్రధాని ఎవరంటే?: పేద రైతు కుటుంబం నుంచి ప్రధానిగా: అట్టపెట్టెల కంపెనీలో లేబర్‌గా

|

టోక్యో: జపాన్ తుదపరి ప్రధానమంత్రి ఎవరో తేలిపోయింది. అనారోగ్య కారణాలతో ఇటీవలే ప్రధానమంత్రి పదవి నుంచి అర్ధాంతరంగా వైదొలగిన షింజో అబే వారసుడెవరో స్పష్టమైంది. అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్డీపీ) నిర్వహించిన అంతర్గత ఎన్నికల్లో షింజో అబే వారసుడిని ఖరారు చేశారు. ఆయనే- యోషిహిడో సుగ. స్ట్రాబెర్రీ రైతు కుమారుడు. ఎల్డీపీ నిర్వహించిన ఎన్నికల్లో యోషిహిడో ఎన్నిక కావడంతో ఇక ఆయన జపాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించడం ఇక లాంఛనప్రాయమే. 71 సంవత్సరాల యోషిహిడో చీఫ్ కేబినెట్ సెక్రెటరీగా పని చేశారు.

ఎల్డీపీ ఎన్నికల్లో ఘన విజయం..

ఎల్డీపీ ఎన్నికల్లో ఘన విజయం..

జపాన్ ప్రధానమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై అధికార ఎల్డీపీ ఎన్నికలను నిర్వహించింది. ఈ ఎన్నికల్లో సుగా ఘన విజయాన్ని సాధించారు. 534 మంది ఎల్డీపీ పార్లమెంట్ సభ్యులు, ప్రాంతీయ ప్రతినిధులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యోషిహిడోతో పాటు షిగెరు ఇషిబా, ఫ్యుమియో కిషిడ ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడ్డారు. ఈ ముగ్గురిలో అత్యధిక ఓట్లు యోషిహిడోకు దక్కాయి. ఆయనకు మద్దతుగా 377 ఓట్లు పోల్ అయ్యాయి. దీనితో జపాన్ తదుపరి ప్రధానమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం దాదాపు ఖరారైంది.

స్ట్రాబెర్రీ రైతు కుమారుడిగా.. అట్టపెట్టెల తయారీలో కార్మికుడిగా..

స్ట్రాబెర్రీ రైతు కుమారుడిగా.. అట్టపెట్టెల తయారీలో కార్మికుడిగా..

సుమారు 14 నెలల పాటు ఆయన ప్రధానమంత్రిగా కొనసాగుతారు. షింజో అబే పదవీ కాలాన్ని యోషిహిడో పూర్తి చేస్తారు. యోషిహిడో.. స్ట్రాబెర్రీలను పండించే పేద రైతు కుమారుడు. అకిట రీజియన్‌లోని ఒగాచీ అనే గ్రామంలో 1948 డిసెంబర్ 6న ఆయన జన్మించారు. ప్రాథమిక విద్యను పూర్తి చేసిన అనంతరం ఉన్నత చదువుల కోసం రాజధాని టోక్యోకు వెళ్లారు. యుజావా హైస్కూల్‌లో గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేశారు. హొసెయి యూనివర్శిటీలో న్యాయవిద్యను అభ్యసించారు. హొసెయి యూనివర్శిటీని ఎంచుకోవడానికి ప్రధాన కారణం.. మిగిలిన విశ్వవిద్యాలయాలతో పోల్చుకుంటే.. అతి తక్కువ ఫీజులు ఉండటమే.

 నైట్ స్కూల్‌లో

నైట్ స్కూల్‌లో

యోషిహిడో ఉదయం పూట ఓ అట్టెపెట్లెల తయారీ కంపెనీలో కార్మికుడిగా పనిచేశారు. రాత్రిపూట తరగతులకు హాజరయ్యే వారు. దీనికోసం నైట్ స్కూల్‌ను ఆయన ఆప్షన్‌గా ఎంపిక చేసుకున్నారు. ఈ కంపెనీలో పనిచేయడం వల్ల వచ్చిన జీతాన్ని తన న్యాయవిద్యను పూర్తి చేయడానికి ఫీజుగా చెల్లించారు. న్యాయవిద్యను పూర్తి చేసుకున్న తరువాత.. రాజకీయాల్లో ప్రవేశించారు. ఎల్డీపీ డైట్ మెంబర్‌గా సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఎల్డీపీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1987లో యోకొహామా సిటీ కౌన్సిల్‌కు ఎన్నిక అయ్యారు. 1996లో తొలిసారిగా ఆ దేశ దిగువసభ డైట్‌కు ఎన్నికయ్యారు. 2012లో జపాన్ కేబినెట్ చీఫ్ సెక్రెటరీగా ఎన్నికయ్యారు.

  India - Japan : చైనాకు బుద్ధి చెప్పేలా.. Japan తో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న భారత్ ! || Oneindia
   షింజో రాజీనామాతో..

  షింజో రాజీనామాతో..

  జపాన్ ప్రధానమంత్రి పదవి నుంచి షింజో అబె తప్పుకొన్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల కిందటే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో పరిపాలనపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించలేకపోతున్నానంటూ ఆయన పదవి నుంచి అర్ధాంతరంగా తప్పుకొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్-మే వరకూ ఆయన పదవీ కాలం ఉంది. అర్ధాంతరంగా తప్పుకోవడం వల్ల ఆయన వారసుడిని ఎన్నుకోవడానికి జపాన్ అధికార పార్టీ ఎల్డీపీ.. ఎన్నికలను నిర్వహించింది. ఈ ఎన్నికల్లో యోషిహిడో సుగా విజయం సాధించారు. షింజో వదిలేసిన పదవీ కాలాన్ని ఆయన భర్తీ చేస్తారు. అనంతరం సాధారణ ఎన్నికలను ఎదుర్కొంటారు.

  English summary
  Japan’s Yoshihide Suga, a long-time ally of outgoing Prime Minister Shinzo Abe, wins ruling Liberal Democratic Party (LDP) leadership election, paving the way for him to become prime minister in a parliamentary vote this week.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X