వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్‌కు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్, భారత్‌పై ఇలా

పాకిస్తాన్‌పై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తే మరెంతో కాలం సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: పాకిస్తాన్‌పై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తే మరెంతో కాలం సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు.

భారత్‌పై యుద్ధానికి చైనా దూకుడు, కానీ అవి బ్రేకులు వేస్తాయి!భారత్‌పై యుద్ధానికి చైనా దూకుడు, కానీ అవి బ్రేకులు వేస్తాయి!

ఉగ్రవాదులకు అనుకూలంగా ఉంటే పాకిస్తాన్ అందుకు ఫలితం అనుభవించాల్సి ఉంటుందని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామంగా ఉండటంపై తాము చూస్తూ ఊరుకునేది లేదన్నారు.

డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్: పాక్‌ను వెనుకేసుకొచ్చిన చైనాడొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్: పాక్‌ను వెనుకేసుకొచ్చిన చైనా

లేదంటే ఆపేస్తామని హెచ్చరిక

లేదంటే ఆపేస్తామని హెచ్చరిక

ఆప్గనిస్తాన్‌లో అమెరికన్ ఆపరేషన్‌లో భాగస్వామిగా పాకిస్తాన్ ఎంతో లాభపడిందని ట్రంప్ చెప్పారు. అయితే నేరస్తులు, క్రిమినల్స్‌కు ఆశ్రయం కల్పించడం ద్వారా పాకిస్తాన్ దెబ్బతింటుందన్నారు. ఉగ్రవాదులపై పాకిస్తాన్ కఠిన వైఖరి అవలంభించకుంటే ఆ దేశానికి అమెరికా అందించే సైనిక, ఇతర సాయాలు నిలిచిపోతాయని హెచ్చరించారు.

Recommended Video

US Not A Safe Place For Indians Because of Donald Trump - Oneindia Telugu
మేం బిలియన్ డాలర్లు ఇస్తుంటే

మేం బిలియన్ డాలర్లు ఇస్తుంటే

ఉగ్రవాద వ్యతిరేక చర్యల కోసం తాము బిలియన్ డాలర్లను ఇస్తున్నామని, కానీ తాము పోరాడుతున్న ఉగ్రవాదులకే అది ఆశ్రయం కల్పిస్తోందని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు ఊతమిచ్చే వైఖరికి పాక్ తక్షణమే స్వస్తి పలకాలన్నారు. నాగరికత, శాంతి సామరస్యాలు వెల్లివిరిసే సమాజం నెలకొనేందుకు పాక్ అంకితం కావాలన్నారు.

భారత్ మరింత చొరవ చూపాలి

భారత్ మరింత చొరవ చూపాలి

ఆప్గనిస్తాన్‌లో సుస్థిరత నెలకొనేందుకు భారత్ అందించిన సహకారం మరువలేనిదని ట్రంప్ అన్నారు. అయితే అమెరికాతో వాణిజ్యం ద్వారా బిలియన్ డాలర్ల రాబడి పొందుతున్న భారత్.. ఆప్గన్ విషయంలో ముఖ్యంగా ఆర్థిక చేయూత, అభివృద్ధి పరంగా మరింత సహకరించాలని కోరారు.

భారత్ కీలక భాగస్వామి

భారత్ కీలక భాగస్వామి

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ తమకు కీలక భద్రత, ఆర్థిక భాగస్వామి అని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ తమ దక్షిణాసియా విధానాన్ని వివరించారు. భారత్‌తో అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతమే తమకు అత్యంత కీలకమని చెప్పారు.

English summary
US President Donald Trump hit out at Pakistan and said that the country gives a safe haven to agents of chaos. "Pakistan often gives safe haven to agents of chaos," he said, noting that there is nuclear-powered tensions between Pakistan and its neighbor India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X