వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌కు భారీ షాక్: 56 శాతం యువత ఓట్లు బైడెన్‌కే - హార్వర్డ్ వర్సిటీ సర్వే

|
Google Oneindia TeluguNews

అంతర్జాతీయ కూటముల నుంచి వైదొలగడం ద్వారా బోలెడంత ఖర్చును నివారించానని, ఆ డబ్బుతో దేశీయంగా ఉద్యోగాల కల్పన చేపట్టానని, అమెరికా చరిత్రలోనే కనీవినీ ఎరుగనంత స్థాయిలో గత నాలుగేళ్లలో ఉపాధి రంగం మెరుగుపడిందంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతోన్న మాటలను అక్కడి యువత పెద్దగా నమ్ముతున్నట్లు లేదు. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో యువతం.. డెమోక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ కు జైకొట్టబోతున్నట్లు తెలుస్తోంది..

నన్ను రేప్ చేసి, చంపేవాడే: ఎమ్మెల్యే అభ్యర్థిపై నటి అమీషా పటేల్ - బీహార్‌లో భయానక అనుభవంనన్ను రేప్ చేసి, చంపేవాడే: ఎమ్మెల్యే అభ్యర్థిపై నటి అమీషా పటేల్ - బీహార్‌లో భయానక అనుభవం

Young Americans to vote Joe Biden in higher numbers: Harvard poll

ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అమెరికా వ్యాప్తంగా యువ ఓటర్లపై చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 18 నుంచి 29 ఏళ్ల వయసున్న వారు ఈ సర్వేలో పాల్గొన్నారని, ఓటింగ్ పట్ల గతంలో ఎన్నడూ లేనంత ఆసక్తి ఈసారి యువతరం ప్రదర్శిస్తున్నదని నిర్వాహకులు తెలిపారు.

సర్వేలో పాల్గొన్న యవతలో 63 శాతం మంది తామీసారి తప్పక ఓటేస్తామని చెప్పారు. గత(2016) ఎన్నికల్లో కేవలం 47 శాతం మంది యువత మాత్రమే ఓట్లు వేయడం తెలిసిందే. నవంబర్ 3న ఓటేయబోతున్న యువతలో జోబైడెన్ పట్ల ఆదరణ పెరుగుతోందని హార్వర్డ్ సర్వేలో వెల్లడైంది.

ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే బైడెన్ యువ ఓట్ల ఆదరణలో 24 పాయింట్లు ముందంజలో ఉన్నారని హార్వర్డ్ సర్వే నిర్వాహకులు తెలిపారు. కాగా, కీలకమైన టెక్సాస్ లాంటి రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజలో ఉన్నట్లు మరో సర్వేలో వెల్లడైంది. ఎన్నికలకు మరో ఐదు రోజులే ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నవంబర్ 3న పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది.

English summary
Young Americans adults are expected to vote in large numbers in the 2020 US Presidential elections, and Democratic nominee Joe Biden' s favourability has increased considerably in the last few months, according to a poll conducted by the Harvard University's Institute of Politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X