వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుక్త వయస్సులో ఉన్న మహిళలు ఆ విషయంలో చాలా ఒత్తిడికి గురవుతున్నారు: స్టడీ

|
Google Oneindia TeluguNews

మనిషి జీవితంలో ఒత్తిడి అనేది సాధారణంగా ఉంటుంది. ఒత్తిడిని అధిగమించేలా ప్రయత్నించి గమ్యాన్ని చేరుకోవాలని చాలా మంది పెద్దలు సూచిస్తుంటారు. విపరీతమైన ఒత్తిడిని భరించలేక కొందరు అఘాయిత్యాలకు పాల్పడిన వారున్నారు. ఈ మధ్యే ఒత్తడివల్ల శృంగార సమస్యలు తెచ్చుకుంటున్నారని ఓ స్టడీ వెల్లడించింది. ముఖ్యంగా శృంగార సమస్యలను మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారని స్టడీ వెల్లడించింది.

శృంగారం అంటే భూతంలా ఫీల్ అవుతున్నారు

శృంగారం అంటే భూతంలా ఫీల్ అవుతున్నారు

సెక్స్ అనే పదంను భూతంగా చూడటం వల్ల చాలా ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారని ఆస్ట్రేలియాలోని ఓ స్టడీ అభిప్రాయపడింది. శృంగారం అనే పదంను వినియోగిస్తే అదేదో నేరంలా ఫీల్ అవుతున్నారని స్టడీ వెల్లడించింది. ముఖ్యంగా ఈ తరహా ఆందోళన ఎక్కువగా మహిళల్లో కనిపిస్తోందని స్టడీ వెల్లడించింది. పాశ్చాత్య దేశాల్లోలా కాకుండా భారత్‌లో సెక్స్ గురించి ఎక్కువగా మహిళలు చర్చించకపోవడంతో అవగాహన లేక పలు వ్యాధులకు దగ్గర అవుతున్నారని స్టడీ వెల్లడించింది.

శృంగారపరంగా ఒత్తిడి ఎదుర్కొంటున్న యవ్వన మహిళలు

శృంగారపరంగా ఒత్తిడి ఎదుర్కొంటున్న యవ్వన మహిళలు

మహిళలకు శృంగారం అనే సబ్జెక్ట్ పై అవగాహన ఉన్నప్పటికీ బహిరంగంగా మాట్లాడలేకపోవడం నష్టం చేకూరుస్తోందని వెల్లడించింది. 18 ఏళ్ల నుంచి 39 ఏళ్ల లోపు ఉన్న మహిళలు సెక్సువల్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు వివరించింది. ఒత్తిడి వల్ల తమ శృంగార జీవితాన్ని కూడా పూర్తి స్థాయిలో మహిళలు ఎంజాయ్ చేయలేకున్నారని స్టడీ ద్వారా తెలుస్తోంది.

శృంగార జీవితానికి దూరమవుతున్న మహిళలు

శృంగార జీవితానికి దూరమవుతున్న మహిళలు

కొన్ని మ్యాగజీన్లపై వచ్చే మహిళా మోడల్స్ ఫోటోలు సాధారణ మహిళలపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. వారంత అందంగా లేమని తమలో తాము భావించి ఒత్తిడికి గురవుతున్నారని స్టడీ పేర్కొంది. మహిళల్లో శృంగార కోరికలు, ఉద్వేగం, ఉద్రేకం ఉన్నప్పటికీ ఎక్కడో ఓ మూలనా తాము అందంగా లేమనే భావన వారిని శృంగార జీవితానికి దూరం చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఒత్తిడికి గురవుతున్నారని ఎక్స్‌పెర్ట్స్ వివరించారు.

Recommended Video

Period Feast: 28 Menstruating Women Cook Food For 300 Citizens | Oneindia Telugu
 ఇంకా స్టడీ ఏం చెబుతోంది..?

ఇంకా స్టడీ ఏం చెబుతోంది..?

ఇక అమెరికాలో 3వేల మంది మహిళల నుంచి అభిప్రాయం సేకరించడం జరిగింది. వారానికోసారి లేదా తరచూ శృంగారంలో పాల్గొంటున్న మహిళల్లో కచ్చితంగా సమయానికి పీరియడ్స్ అవుతున్నాయని స్టడీ పేర్కొంది. అంతేకాదు పీరియడ్స్ నిలిచిపోవడం చాలా తక్కువగా అంటే 28శాతంగా ఉందని స్టడీ వెల్లడించింది. అదే సమయంలో నెలకోసారి శృంగారంలో పాల్గొంటున్న మహిళల్లో పీరియడ్స్ ప్రక్రియ సరైన సమయంలో లేదా క్రమంగా ఉండటం లేదని స్టడీ వెల్లడించింది.

English summary
Many countries, including India, lack a proper sex education system, with some people getting into the morality of it, and insisting others feel guilty and ashamed for their personal choices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X