వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌పై సోషల్ మీడియా దిగ్గజ సంస్థల ముప్పేటదాడి: అలాంటి వీడియోలిక యూట్యూబ్‌లో కనిపించవ్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: మరి కొద్ది రోజుల్లో మాజీ కాబోతోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సోషల్ మీడియా దిగ్గజ సంస్థల దాడి కొనసాగుతూనే ఉంది. మొన్నటికి మొన్న ఆయన ట్విట్టర్ అకౌంట్‌‌పై ఆ సంస్థ యాజమాన్యం శాశ్వతంగా నిషేధం విధించింది. వేలాదిమంది ఆయన మద్దతుదారుల అకౌంట్లను సస్పెండ్ చేసింది. అదే రోజు- ఫేస్‌బుక్ ట్రంప్‌కు సంబంధించిన కొన్ని కొత్త వీడియోలను బ్లాక్ చేసింది. తాజాగా- యుట్యూబ్ అదే మార్గాన్ని అనుసరించింది.

ట్రంప్‌పై పగ తీర్చుకున్న నల్ల జాతీయులు: నూటికి 12 మందే: ఎడిసన్ స్టడీ ఏం చెబుతోంది?ట్రంప్‌పై పగ తీర్చుకున్న నల్ల జాతీయులు: నూటికి 12 మందే: ఎడిసన్ స్టడీ ఏం చెబుతోంది?

డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన ఛానెల్ కొత్తగా పోస్ట్ చేసిన వీడియోలన్నింటినీ రిమూవ్ చేసింది. వాషింగ్టన్ అల్లర్ల సందర్భంగా.. ఆ తరువాతా ట్రంప్ ఇచ్చిన ప్రసంగాలకు సంబంధించిన వీడియోలేవీ ఇక యూట్యూబ్‌లో కనిపించబోవని తెలిపింది. వాషింగ్టన్‌లోని పార్లమెంట్‌ భవనంపై డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు వేలసంఖ్యలో దాడికి పాల్పడిన అనంతరం ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అల్లర్లకు పాల్పడిన తన మద్దుతదారులు, క్వానన్ సపోర్టర్లు, ఆందోళనకారులను మరింత ప్రోత్సహించేలా డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తించారని, వాటికి సంబంధించిన వ్యాఖ్యాలను పోస్ట్ చేసిన కారణంతో ట్విట్టర్, ఫేస్‌బుక్ ఇదివరకే తొలగించింది.

YouTube removes new content uploaded to US President Donald Trump’s channel

తాజాగా- అదే జాబితాలో యూట్యూబ్ చేరింది. డొనాల్డ్ ట్రంప్ సొంతంగా నడుపుతోన్న ఛానెల్‌కు సంబంధించిన కొన్ని వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేయగా.. వాటిని తొలగించినట్లు తెలిపింది. తమ విధానాలు, మార్గదర్శకాలకు విరుద్ధంగా అందులోని కంటెంట్ ఉండటం వల్ల తొలగించాల్సి వచ్చిందని అధికారికంగా వెల్లడించింది. హింసను ప్రేరేపించేలా, దాడులను ప్రోత్సహించేలా ఉన్న ట్రంప్ వీడియోలు కనిపించవని స్పష్టం చేసింది.

క్వానన్ ఉద్యమకారుల కంటెంట్ మొత్తం హింసాత్మక పరిస్థితులు, వ్యవస్థీకృత దాడులను ప్రేరేపించేలా ఉన్నాయనే కారణంతో వాటిని సస్పెండ్ చేస్తున్నట్లు ట్విట్టర్ యాజమాన్యం వెల్లడించింది. ఇప్పటికి 70 వేలకు పైగా అకౌంట్లను సస్పెండ్ చేశామని, ఇది ఇక్కడితో ఆగదని తెలిపింది. క్వానన్ కంటెంట్ ఉన్న మరిన్ని అకౌంట్లను రద్దు చేస్తామని స్పష్టం చేసింది. మరోవైపు- ఫేస్‌బుక్ సైతం అదే బాటను అనుసరిస్తోంది. స్టాప్ టు స్టీల్.. అనే పేరుతో పోస్ట్ అయిన అన్ని అకౌంట్లను తొలగిస్తున్నామని వెల్లడించింది.

English summary
YouTube removes new content uploaded to US President Donald Trump’s channel and issued a strike for violating policies, for inciting violence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X