వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారి తల నరికేయాలి: డొనాల్డ్ ట్రంప్ మాజీ సలహాదారుపై ట్విట్టర్ నిషేధం, వీడియో తొలగింపు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మాజీ చీఫ్ స్ట్రాటజిస్ట్ స్టీవ్ బ్యానన్‌పై ప్రముఖ సోషల్ మీడియా యాప్ ట్విట్టర్ నిషేధం విధించింది. ఓ యూట్యూబ్ వీడియోలో ఎఫ్‌బిఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే, ప్రభుత్వ ప్రముఖ మహమ్మారి నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీని శిరచ్ఛేదనం చేయమని పిలుపునిచ్చిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ చీఫ్ స్ట్రాటజిస్ట్ స్టీవ్ బ్యానన్‌ను ట్విట్టర్ సస్పెండ్ చేసింది.

రెండవసారి ట్రంప్ ఏమి చేయాలో సహ-హోస్ట్ జాక్ మాక్సేతో మాట్లాడిన బ్యానన్.. వ్రే, ఫౌసీని తొలగించాలని సూచించాడు.కానీ, నేను ట్యూడర్ ఇంగ్లాండ్ పాత కాలానికి తిరిగి వెళ్లాలనుకుంటున్నాను, నేను తలలను పైక్‌లపై ఉంచాను, సరియైనది, నేను వాటిని ఫెడరల్‌ బ్యూరోకాట్స్‌కు హెచ్చరికగా వైట్ హౌస్ రెండు మూలల్లో ఉంచాను, ' అని పేర్కొన్నారని టెక్‌క్రంచ్‌ తెలిపింది.

YouTube removes video: Twitter bans former Trump advisor Steve Bannon on calls of beheading

ఈ టెక్‌క్రంచ్ ప్రకారం, హింసను ప్రేరేపించడానికి వ్యతిరేకంగా తన నియమాలను ఉల్లంఘించినందుకు ఆయన ఖాతాను "శాశ్వతంగా నిలిపివేసినట్లు" ట్విట్టర్ ధృవీకరించింది. దీని ప్రకారం, ఖాతా అప్పీల్ చేయవచ్చు కానీ, స్వయంచాలకంగా పునరుద్ధరించబడదు.

"స్టీవ్ బ్యానన్ వార్ రూమ్" ఎపిసోడ్‌ను యూట్యూబ్ ఛానల్ నుంచి తొలగించింది. 'హింసను ప్రేరేపించడానికి వ్యతిరేకంగా మా విధానాన్ని ఉల్లంఘించినందుకు మేము ఈ వీడియోను తీసివేశాము. ఎన్నికల అనంతర కాలంలో మా విధానాలను అమలు చేస్తున్నందున మేము అప్రమత్తంగా ఉంటాము ' అని యూట్యూబ్ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు.

ఇది ఇలావుంటే, అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది. పెన్సిల్వేనియా, అరిజోనా, పెన్షిల్వేనియాలోని ఓట్లే కీలకంగా మారాయి. ఇప్పటికే దాదాపు డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం ఖరారైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నప్పటికీ ఓవరాల్‌గా విజయానికి చాలా దూరంలో ఉన్నారు.

English summary
Twitter has suspended US President Donald Trump’s former chief strategist Steve Bannon after he made calls to behead FBI director Christopher Wray and the government’s leading pandemic expert, Dr Anthony Fauci, in a YouTube video, which has also been removed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X