• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బైడెన్-కమలను గెలిపించా, ట్రంప్‌ నా మాట వినట్లే: కేఏ పాల్ సంచలనం -మళ్లీ రావొద్దన్న వైసీపీ ఎంపీ

|

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థులు జోబైడెన్, కమలా హ్యారిస్ ల విక్టరీపై చైనా, రష్యా తప్ప మిగతా ప్రపంచమంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. కమల భారతీయ మూలాలున్న వ్యక్తి కావడంతో ఆమె గెలుపుపై ఇక్కడి నేతలందరూ స్పందించారు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యనాయకులంతా కమల గెలుపు మనందరికీ గర్వకారణమని పిలుపునిచ్చారు. అయితే ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ క్రైస్తవ బోధకుడైన కేఏ పాల్ మాత్రం బైడెన్-కమలను తానే గెలిపించానని క్లెయిమ్ చేసుకోవడం సంచలనంగా మారింది. దీనిపై.. నర్సాపురం లోక్ సభ స్థానంలో పాల్ పై గెలుపొందిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అనూహ్యంగా స్పందించారు.

జగన్ వర్సెస్ జగన్: ఆ రహస్యం ఇదే -ఆమెను చూసైనా మారాలి -ఎంపీ రఘురామ -బూతుపురాణం

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

అమెరికా అధ్యక్ష స్థానానికి సంబంధించి గత(2016) ఎన్నికల్లో తన ఆశీర్వాదం పొందిన తర్వాతే ట్రంప్ విజయం సాధించాడని ప్రజాశాంతి చీప్ కేఏ పాల్ పలుమార్లు బాహాటంగా వ్యాఖ్యానించారు. అయితే, కాల క్రమంలో ట్రంప్ విధానాలను తూర్పారపడుతూ, ఆయనకు తీవ్రవిమర్శకుడిలా పాల్ మారిపోయారు. తాజాగా 2020 ఎన్నికల సమయంలోనూ తాను కీలకంగా వ్యవహరించానని, తన ప్రార్థనలు, ప్రయత్నాల ఫలితంగానే డెమోక్రటిక్ అభ్యర్థులైన జోబైడెన్, కమలా హ్యారిస్ లు గెలుపొందారని పాల్ చెప్పుకొచ్చారు. అంతేకాదు..

 వైట్ హౌజ్ నుంచి ఒకటే ఫోన్లు..

వైట్ హౌజ్ నుంచి ఒకటే ఫోన్లు..

అమెరికా దేశానికే కాకుండా, యావత్ ప్రపంచానికి ట్రంప్ అనే ముప్పును తప్పించడానికి తాను చేసిన ప్రయత్నం ఎట్టకేలకు ఫలించిందని, ఎన్నికల్లో జోబైడెన్-కమలా హ్యారిస్ విజయాన్ని ప్రతి ఒక్కరూ అభినందించాలని పాల్ కోరారు. తాజాగా సోషల్ మీడియా ద్వారా మాట్లాడిన ఆయన.. ఎన్నికల ఫలితాలపై ట్రంప్ మంకుపట్టుతో రిపబ్లికన్ పార్టీ చీలిపోయిందన్నారు. ఈ విషయంలో ట్రంప్ మనసు మారేలా ప్రార్థనలు చేయాలంటూ వైట్ హౌజ్ నుంచి అనేక మంది కీలక అధికారులు ఫోన్లు చేస్తున్నారని పాల్ తెలిపారు. అయితే..

 భార్య మాటా వినడంలేదు..

భార్య మాటా వినడంలేదు..

‘‘జోబైడెన్ విక్టరీ ప్రకటన చేశారు. కానీ ట్రంప్ వార్ డిక్లెర్ చేశారు. ఏం జరుగుతుందోనని అందరూ భయపడుతున్నారు. కనీసం భార్య మాటను కూడా ట్రంప్ వినట్లేదు. అమెరికా ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్నారు. ఉపాధ్యక్షుడు మైక్ పేన్స్, ఇవాంకా ట్రంప్ లాంటి ఎందరో దగ్గరి వ్యక్తులు నచ్చ చెబుతున్నా ట్రంప్ పెడచెవిన పెడుతున్నారు. ఈ దశలో వైట్ హౌజ్ నుంచి నాకు ఫోన్లు, మెసేజ్ లు వచ్చాయి. కానీ దిగిపోవడానికి అంగీకరిస్తానని చెబితేనే వైట్ హౌజ్ లోకి వెళ్లి, ట్రంప్ కోసం ప్రార్థన చేస్తానని నేను షరతు విధించాను. ట్రంప్ నా మట కూడా వినడంలేదు. ఎన్నికల్లో అక్రమాలు జరిగి ఉండొచ్చు. కానీ ట్రంప్ చెబుతున్న స్థాయిలో కాదు, మహా అయితే 10వేల ఓట్లు కంటే ఎక్కువ తేడా రాదు'' అని కేఏ పాల్ పేర్కొన్నారు. దీనిపై

 ఆ లెక్కన నేనే గ్రేట్..

ఆ లెక్కన నేనే గ్రేట్..

అమెరికాలో బైడెన్-కమలా హ్యారిస్ ను గెలిపించింది తానే అని కేఏ పాల్ క్లెయిమ్ చేసుకోవడంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సెటైర్లు వేశారు. ‘‘నర్సాపురం స్థానంలో నాకు 4.5 లక్షల ఓట్లొచ్చాయి. కేఏ పాల్ కు 2900 ఓట్లు మాత్రమే దక్కాయి. అలాంటి వ్యక్తి ఇవాళ అమెరికాలో బైడెన్ ను గెలిపించాడంటే ఎంత గొప్ప విషయం? అంత ఈజీగా అమెరికాలో ఎన్నికలను సైతం డిసైడ్ చేయగలిగిన వ్యక్తిని ఓడించినందుకు నేనెంత గొప్పగా ఫీలవ్వాలి? నేనేకాదు, నర్సాపురం ప్రజలు, మా పార్టీ చీఫ్ జగన్ కూడా గర్వపడాల్సిన సందర్భమిది. అంచేత పాల్ గారు ఇకపైనా అంతర్జాతీయ స్థాయిలోనే, ఆ అధ్యక్ష వ్యవహారాలను చూసుకుంటూ ఉండిపోవాలని కోరుతున్నాను. మళ్లీ ఇక్కడికొస్తే ఈసారి 2900 ఓట్లు కూడా సాధించలేరని గుర్తుంచుకోవాలి'' అని ఎంపీ రఘురామ అన్నారు. అంతటితో ఆగకుండా..

65 శాతం మందికి రిజర్వేషన్లు కట్

65 శాతం మందికి రిజర్వేషన్లు కట్

కేఏ పాల్ ప్రస్తావన సందర్భంగా క్రైస్తవ పాస్టర్ల అంశాన్ని కూడా లేవనెత్తిన ఎంపీ రఘురామ.. ఏపీలో తాము తలపెట్టిన హిందూ సనాతన ధర్మ పరిరక్షణ సమితికి అనుబంధంగా లాయర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో మేం లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టామని చెప్పారు. ఆ సంస్థ ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాల్లో.. ఏపీలో పాస్టర్లుగా పనిచేస్తోన్న 65 శాతం మంది సర్టిఫికేట్లలో హిందూ-ఎస్సీ అని ఉందని, దీనిపై ఫిర్యాదు చేయబోతున్నామని, ఎస్సీ రిజర్వేష్ పొందుతూ క్రైస్తవులుగా ఉండటం రాజ్యాంగ విరుద్ధం కాబట్టి ఆ 65 శాతం మంది పాస్టర్ల పిల్లలు రిజర్వేషన్లు కోల్పోబోతున్నారని ఎంపీ రఘురామ అన్నారు.

పదవితోపాటే మూడో పెళ్లీ పెటాకులు -ట్రంప్‌కు మెలానియా విడాకులు -వైట్‌హౌజ్ సహాయకురాలి క్లెయిమ్

English summary
ysrcp mp raghurama krishnam rahu took jibe on praja shanti party chief ka paul amid pauls' claim that because of his prayers joe biden and kamala harris got victory. paul and raju both fought at narsapuram parliament seat in 2019 election. mp raghurama also made key remarks on christian pastors of andhra pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X