వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికలు: హఫీజ్ సయీద్‌కు పాక్ ప్రజలు గట్టి షాక్, ఒక్క సీటు రాలేదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

కరాచి: ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ ఓటర్లు షాకిచ్చారు. ఆయన మద్దతిచ్చిన అల్లాహో అక్బర్ తెహ్రిక్ (ఏఏటీ) పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆయన మద్దతిచ్చిన పార్టీని ప్రజలు తిరస్కరించారు. ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. అయితే ఆయన మద్దతుదారులుగా చెప్పుకున్న కొందరు స్వతంత్రులు గెలిచారు.

మొత్తం 272 స్థానాలకుగాను ఎన్నికలు జరుగగా ప్రభుత్వ ఏర్పాటులో ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పార్టీ 120 స్థానాల్లో, పీఎంపఎల్ఎల్ 61 స్థానాల్లో, పీపీపీ 40 స్థానాల్లో ముందంజలో ఉంది. దాదాపు 60 శాతం కౌంటింగ్ పూర్తయిందని తెలుస్తోంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీకి పదిహేను నుంచి ఇరవై స్థానాలు తక్కువగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎన్నికల ఫలితాలు: ఇమ్రాన్ వైపు పాకిస్తాన్ మొగ్గు, ఆయనకు శిక్షపడే ఛాన్స్ఎన్నికల ఫలితాలు: ఇమ్రాన్ వైపు పాకిస్తాన్ మొగ్గు, ఆయనకు శిక్షపడే ఛాన్స్

Zero seats for Hafiz Saeeds party as Pakistan election results pour in

మ్యాజిక్ ఫిగర్‌కు ఏ పార్టీ చేరుకోని పరిస్థితి ఏర్పడటంతో పీపీపీ మద్దతు కోరాలని ఇమ్రాన్ ఖాన్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. లేదంటే ఇండిపెండెంట్లు, చిన్న పార్టీలు కీలకం కానున్నారు. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని పీఎంఎల్ఎన్ నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణలను సీఈసీ సర్దార్ ముహమ్మద్ రజా కొట్టిపారేశారు. కొన్ని సాంకేతిక ఇబ్బందులు మినహా ఈ ఎన్నికలను పూర్తి పారదర్శకంగా జరిపించామన్నారు.

English summary
Pakistan Elections 2018. As per latest unofficial trends on Geo news, PTI leading on 119 seats, PMLN on 61 seats & PPP on 40.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X